ఈ స్కూటర్‌తో రోడ్డెక్కితే అందరి చూపు మీ మీదే! హోండా కొత్త స్కూపీతో స్ట్రీట్ స్టైల్ మారిపోతుంది!
భారతదేశంలో గేర్‌లెస్ స్కూటర్ల మార్కెట్‌ను కైవసం చేసుకున్న బ్రాండ్ అంటే, మొదట గుర్తుకొచ్చేది హోండా (Honda)నే. హోండా యాక్టివా (Activa), డియో (Dio) వంటి మోడళ్లతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల నమ్మకాన్ని సాధించిందీ సంస్థ. హోండా ఇక్కడితో ఆగకుండా, మరింత ఆకర్షణీయమైన, ప్రత్యేకత కలిగిన మోడళ్లను తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అలాంటి యత్నాల్లో భాగంగా, ఇటీవల హోండా స్కూపీ (Honda Scoopy) అనే స్కూటర్‌కి భారతదేశంలో పేటెంట్ దాఖలు చేయడం జరిగింది. ఈ స్కూటర్‌ను 2017లోనే భారత రోడ్లపై విజయవంతంగా పరీక్షించారు. కానీ పలు వ్యాపారపరమైన కారణాల వల్ల దాని లాంచ్ ఆమోదం పొందలేదు. ఇప్పుడు తిరిగి, ఇది కొత్త అవతారంలో ఇండోనేషియా వంటి దేశాల్లో విజయవంతంగా అమ్ముడవుతోంది.
దీని లేటెస్ట్ వెర్షన్ ఈసారి అయినా భారత్‌కు వస్తుందా? అనే ఉత్కంఠతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే కంపెనీ ఇండియాలో పేటెంట్ దాఖలు చేయడం కంటి అంశాలను చూసినట్లయితే ఇది త్వరలోనే మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ హోండా స్కూపీ స్కూటర్ గురించి ఈ కథనంలో ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఇది ఆకట్టుకునే రూపంతో సరికొత్తగా రెట్రో-మోడర్న్ డిజైన్ కలయికతో మహిళలు, పురుషులకు అనుకూలంగా ఉంటుంది.

ఇది యువతను బాగా అట్రాక్ట్ చేసేలా ఉంది. కాలేజ్ విద్యార్థులు, సిటీ యూజర్లకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీని బాడీ లైన్‌లు, పెద్ద సైజ్ రౌండ్ హెడ్‌ల్యాంప్, ప్రత్యేకమైన కలర్ స్కీమ్.. ఇవన్నీ కలిపి దీన్ని ఒక స్పెషల్ స్కూటర్‌గా నిలబెడతాయి. ఇప్పటికే హోండా బ్రాండ్ పైన ఉన్న నమ్మకం, కొత్త స్కూపీ లాంటి మోడల్ మార్కెట్లోకి వస్తే యువతలో దీని మీద క్రేజ్ దూసుకెళ్తుందనడంలో సందేహమే లేదు.
హోండా స్కూపీ అనేది స్టైల్ పరంగా మాత్రమే కాకుండా, వాడుకలోనూ పూర్తి స్థాయిలో ప్రాక్టికల్‌గా ఉండే స్కూటర్. ఇది ప్రత్యేకంగా యువతను టార్గెట్ చేస్తూనే, ఫ్యామిలీ స్కూటర్‌గా కూడా బాగా పనికొచ్చేలా రూపొందించబడింది. చిన్నదైనా, ఇందులో ఫీచర్లు, టెక్నాలజీ అన్ని వయస్సుల వినియోగదారులకు ఉపయోగపడేలా ఉన్నాయి. ఇది 109.5 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ద్వారా రన్ అవుతుంది. ఇందులో eSP, SOHC టెక్నాలజీలతో పనిచేస్తుంది.

ఇవి స్కూటర్‌కు మృదువైన, శక్తివంతమైన పనితీరును మాత్రమే కాకుండా, పెట్రోల్ పొదుపును కూడా అందిస్తాయి. ఈ ఇంజిన్‌కి జతైన CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. దీని ఇంజిన్ 9 bhp పవర్, 9.2 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర ప్రయాణాల్లో చక్కటి వేగం, పిక్-అప్ కోసం ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో టెక్నాలజీకి కూడా తక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు.
డాష్‌పై ఉన్న LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా మైలేజ్, ట్రిప్‌మీటర్, గడియారం, బ్యాటరీ స్టేటస్, ఆయిల్ చెంజ్ అలర్ట్ వంటి సమాచారం అందిస్తుంది. ఈ ఫీచర్లు స్కూటర్ పరిస్థితిపై పూర్తి అవగాహనను కలిగిస్తాయి. అలాగే, టాప్ వేరియంట్లలో లభించే హోండా స్మార్ట్ కీ సిస్టమ్, ఈ స్కూటర్‌ను మరింత ఆధునికంగా మారుస్తుంది. కీని తాకనవసరం లేకుండా హ్యాండిల్ అన్‌లాక్ చేయడం, ఇంజన్ స్టార్ట్ చేయడం వంటివి దీనిలో ఉన్నాయి.

2025 హోండా స్కూపీ యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ముఖ్యమైన ఫీచర్‌ను హోండా అందించింది. ఇది స్కూటర్‌కి టచ్ చేయగానే సౌండ్ ఇచ్చి యజమానులను అలర్ట్ చేస్తుంది. దొంగతనాలను ఇది అరికడుతుంది. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, స్వింగ్ ఆర్మ్ రియర్ సస్పెన్షన్ అందించారు. రైడింగ్‌లో సేఫ్టీ కోసం ముందు, వెనుక రెండింటికీ డ్రమ్ బ్రేక్‌లు అందించబడ్డాయి. అదనంగా కాంబి బ్రేక్ సిస్టమ్ (CBS)ను సపోర్ట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








