స్కూటర్‌లోనే అడ్వెంచర్.. రోజూ రైడ్‌కి, వీకెండ్ ట్రిప్స్‌కి సరికొత్త హోండా స్కూటర్ వచ్చేసింది

ప్రముఖ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) భారత మార్కెట్లో తన పట్టును కోల్పోకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా కొత్త మ్యాక్సీ స్కూటర్ X-ADV ను విడుదల చేసింది. ఇది కేవలం ఓ స్కూటర్ మాత్రమే కాదు, ఇది అడ్వెంచర్ బైక్‌కి ఒక కొత్త రూపం. ఈ మోడల్ కోసం టూవీలర్ లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు దీన్ని అధికారికంగా తీసుకొచ్చింది. హోండా ఈ మోడల్‌ను రూపొందించిన విధానం, దాని లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది, ఒకవైపు అడ్వెంచర్ విభాగంపై దృష్టి సాధిస్తూనే రోజు అవసరాలను కూడా తీర్చుకునే విధంగా దీన్ని అభివృద్ధి చేసింది.

కంపెనీ నుంచి వెల్లడించిన దాని ప్రకారం, ఈ స్కూటర్‌ను హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల వద్ద ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. బ్రాండ్ ప్రకారం, 2025 జూన్ నుండి ఈ మోడల్ డెలివరీల ప్రారంభం అవుతుంది. దీంతో, భారతీయ టూవీలర్ ప్రేమికులకు మరొక ప్రత్యేకమైన మోడల్ అందుబాటులోకి రానుంది. అనుకూలమైన రైడింగ్, అధునాతన ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్, స్మూత్ ట్రాన్స్మిషన్, స్టోరేజ్ స్పేస్ వంటి అంశాలను ఇది కలిగి ఉంది.

Honda New Scooter X Adv Launched In India

X-ADV ప్రతీ భాగంలో సాహసయాత్రల కోసం కావాల్సిన బలంగా ఉండే బాడీ స్ట్రక్చర్‌ ఉంటుంది. అదే సమయంలో, పట్టణ ప్రయాణాల కోసం అనువుగా ఉంటుంది. మొత్తానికి, హోండా X-ADV మ్యాక్సీ స్కూటర్‌ ద్వారా, రైడింగ్ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీని ధర రూ. 11.90 లక్షల (ఎక్స్-షోరూమ్, గురుగ్రామ్). బలమైన బాడీ డిజైన్‌, శక్తివంతమైన పెర్ఫామెన్స్‌ను ఇస్తుంది కాబట్టే దీనికి ఇంత ధర.

హోండా X-ADV శక్తివంతమైన పనితీరుతో ఆకట్టకుంటుంది. ఇది 745cc లిక్విడ్-కూల్డ్, SOHC, 8-వాల్వ్ పారలల్-ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 6,750 RPM వద్ద 57 హార్స్ పవర్, 4,750 RPM వద్ద 69 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పట్టణ ట్రాఫిక్‌లోనైనా, ఓపెన్ రోడ్స్ మీద అయిన దూసుకుపోయే శక్తి దీని సొంతం. ఇంజిన్‌కు హోండా ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)ను అందించింది.

Honda New Scooter

ఇంకా, ఈ స్కూటర్ అవసరాలకు అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్స్‌తో రూపొందించబడింది. హ్యాండిల్‌బార్‌లోని USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ద్వారా స్మార్ట్‌ఫోన్లు వేగంగా ఛార్జ్ అవుతాయి. మధ్య భాగంలో అమర్చిన 5 అంగుళాల పూర్తి-రంగు TFT డిస్‌‌ప్లే ద్వారా రైడింగ్ సమాచారాన్ని స్పష్టంగా చూపుతుంది. హోండా రోడ్‌సింక్ యాప్ సహాయంతో కాల్స్, మెసేజ్ అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

ఇది రైడ్-బై-వైర్ టెక్నాలజీతో రూపొందించబడినదే కాకుండా, నాలుగు డిఫాల్ట్ రైడింగ్ మోడ్‌లు, స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, గ్రావెల్‌ను అందిస్తుంది. ఇవి వాతావరణం లేదా రహదారి పరిస్థితులపై ఆధారపడి స్కూటర్ పనితీరును సర్దుబాటు చేయడంలో సహాయపడతాయి. అదనంగా, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) వ్యవస్థ ట్రాక్షన్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. దీని వల్ల వర్షం నీళ్లు, తడిసిన నేలపైన నెమ్మదిగా, సురక్షితంగా ప్రయాణించవచ్చు.

New Scooter X Adv Launched

ఇది ముందు భాగంలో 17 అంగుళాల స్పోక్ వీల్‌తో వస్తుండగా, వెనుక భాగంలో 15 అంగుళాల స్పోక్ వీల్‌ కలిగి ఉంటుంది. ఈ కాంబినేషన్, హైవేతో పాటు లైట్ ట్రెయిల్ రైడింగ్‌కు సైతం సహకరించేలా రూపొందించబడింది. స్పోక్ వీల్స్ వలన అడ్డదిడ్డమైన మార్గాల్లో కూడా బైకు స్థిరంగా ముందుకు సాగుతుంది, ఇదే సాహసయాత్రలకు సరిపోయే ఫీచర్. ముందు 296mm డిస్క్‌, వెనుక భాగంలో 240mm డిస్క్‌ను అమర్చారు.

More from DriveSpark

Article Published On: Thursday, May 22, 2025, 12:50 [IST]
English summary
Honda new scooter x adv launched in india starting price at rs 11 90 lakh
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+