తక్కువ ధరలో మహిళల కోసం అదిరిపోయే స్కూటర్.. మంచి మైలేజ్‌‌తో తీసుకొస్తున్న హోండా

ఇండియాలో స్కూటర్ అంటే చాలా మందికి మొదటగా గుర్తుకు వచ్చేది యాక్టివా (Activa)నే. ప్రసిద్ధ టూవీలర్ తయారీ కంపెనీ హోండా(Honda) నుంచి చాలా ఏళ్ల క్రితం విడుదలైన యాక్టివా భారతీయ మార్కెట్లో అతి పెద్ద సంచలనం అని చెప్పవచ్చు. మహిళలు, పురుషులు నడపడానికి అనుకూలంగా ఉండే గేర్‌లెస్ స్కూటర్ ప్రతి ఏడాది అమ్మకాల్లో దుమ్ములేపుతుంది. రెండు దశాబ్దాలకు పైగా దేశంలో తిరుగులేని స్కూటర్‌గా టూవీలర్ విబాగంలో తనకంటూ ప్రత్యేక పేరును లిఖించుకుంది. ప్రజల రోజువారీ అవసరాలకు యాక్టివా బెస్ట్ మోడల్. మారుతున్న కాలానికి అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్స్‌తో అప్‌డేట్ అవుతూ మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉంది. ఇతర కంపెనీల స్కూటర్లు కొనుగోలుకు ఉన్నప్పటికీ కూడా అందరి ఎంపిక మాత్రం ఎప్పుడు యాక్టివానే అవుతుంది. దీంతో పాటు హోండా ఇతర స్కూటర్లను కూడా విక్రయిస్తుంది. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా కంపెనీ మరో కొత్త స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

హోండా ఈ సారి తన కొత్త స్కూటర్‌ను మహిళలకు అనువైన చిన్న మోడల్‌గా తీసుకువస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ స్కూటర్ కోసం SCR125 మోడల్‌కు పేటెంట్‌ను కూడా తీసుకుంది. దీనిని సాంప్రదాయ, స్టెప్-త్రూ స్కూటర్‌గా తయారుచేసింది. త్వరలో రాబోతున్న SCR125 మహిళలు నడపడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటి కంటే మరింత సులభమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. చిన్నగా ఉండటం వల్ల ఎత్తు తక్కువగా ఉన్నవారు కూడా నడపవచ్చు.

Honda New Scr125 Scooter

హోండా SCR125 మోడల్‌ భారతదేశంలో లాంచ్ అయితే యాక్టివా, డియో తరువాత ప్రజాధారణ పొందిన మరో మోడల్ అవుతుందని కంపెనీ పేర్కొంటుంది. ఈ స్కూటర్ 125cc ఇంజిన్‌తో రన్ అవుతుందని తెలుస్తుంది. ఇది 8.85 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 88 కి.మీలు. CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జత చేశారు. దీంతో ఇది మెరుగైన మైలేజ్‌ను అందిస్తుందని హోండా పేర్కొంటుంది.

మహిళల కోసం తీసుకొస్తున్న మోడల్ కాబట్టి ఇది కేవలం 103 కిలోలు బరువు మాత్రమే కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 110 మి.మీగా ఉంటుంది. అలాగే, వీల్‌బేస్ 1,245 మిమీ. కొత్త స్కూటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 6 లీటర్లు. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనలాగ్‌తో వస్తుుంది, అందుకునే బ్లూటూత్ కనెక్టివిటీని దీనిలో ఇవ్వడం లేదు. హోండా SCR125 స్కూటర్‌లో రైడర్లకు ఉపయోగకరంగా ఉండే ఫీచర్స్‌ను అందించారు.

Honda Scr125 Scooter

ముఖ్యంగా కీహోల్ దగ్గరే USB ఛార్జింగ్ పోర్ట్‌ను ఇచ్చారు. సింగిల్-పీస్ సీటు చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. అల్లాయ్ వీల్స్ ఆకట్టుకుంటాయి. ఫ్లోర్‌బోర్డ్ వెడల్పుగా ఉంది. ఆప్రాన్-మౌంటెడ్ హాలోజన్ హెడ్‌లైట్‌తో చీకట్లో కూడా ప్రకాశవంతంగా ముందు రోడ్డు కనిపిస్తుంది. హ్యాండిల్‌బార్ మౌంటెడ్ టర్న్ ఇండికేటర్‌లు కూడా దీనిలో ఉన్నాయి. హాలోజన్ టెయిల్ లైట్‌తో పాటు ముందు వెనుక డిజైన్ ఆకర్షణీయంగా అనిపిస్తుంది.

ముందు భాగంలో డిస్క్ బ్రేక్ సెటప్, పార్కింగ్ బ్రేక్‌ను కూడా అందించారు. ప్రధానంగా దీని ధర విషయానికి వస్తే, యాక్టివా, డియో కంటే తక్కువ ధరకు విడుదల చేయనుంది. సమాచారం ప్రకారం, ప్రారంభ ధర రూ.75,000 నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం ఈ మోడల్‌కు సంబంధించి హోండా పేటెంట్ పొందింది. దీన్ని ఎప్పుడు విడుదల చేస్తారో కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించింది. త్వరలో దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Honda New Scr125 Scooter Patented

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య ఏమిటంటే: భారతదేశంలో SUVలతో పోలిస్తే సెడాన్‌ల అమ్మకాలు తగ్గముఖం పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10 సెడాన్ మోడల్స్ బడ్జెట్ ధరలో కొనుగోలుకు ఉన్నాయి. సెడాన్ కార్ల అమ్మకాలు నెల నెలా తగ్గుతున్నప్పటికి మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు మాత్రం సానుకూలంగానే ఉన్నాయి. ఇతర కంపెనీలు తమ సెడాన్ విక్రయాలను పెంచడంపై దృష్టి సారించాయి. రానున్న రోజుల్లో వీటి సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, February 24, 2025, 14:53 [IST]
English summary
Honda new scr125 scooter will launch soon in india here features and all top things
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+