యూత్ కోసం హోండా నుంచి కొత్త స్పోర్టీ స్కూటర్.. స్టైలిష్ లుక్, ఫీచర్లతో ఇది స్కూటర్లలో కింగ్ అయ్యేలా ఉంది!
పురుషులు అయినా.. స్త్రీలు అయినా అందరికీ నచ్చే వాహనం టూ-వీలర్ వాహనం స్కూటర్. స్టైలిష్‌గా ఉంటూనే.. కంఫ్టర్ట్‌గా ఉండడం స్కూటర్ ప్రత్యేకత. అందుకే ఇది ఎన్నో ఏళ్లుగా అందరికీ చేరువైంది. దిగ్గజ వాహన తయారీ సంస్థ హోండా.. తమ డియో స్కూటర్ తో గతంలో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ స్కూటర్ స్థానాన్ని వివిధ కంపెనీల స్కూటర్లు ఆక్రమించాయని చెప్పవచ్చు. అయితే... హోండా సంస్థ తమ గత వైభవాన్ని మళ్లీ దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా.. ఓ కొత్త స్పోర్టీ స్కూటర్‌తో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. అదే NPF 125 స్కూటర్. మరి ఈ స్కూటర్‌లో ఉండే ఫీచర్లు తదితర విశేషాలు చూసేద్దాం.
ఈ NPF 125 స్కూటర్ లాంచ్‌కి ముందే దీని పేటెంట్‌ను సాధించింది హోండా సంస్థ. ఈ ప్రక్రియంతా ఇప్పటికే పూర్తి అయినప్పటికీ.. దీన్ని భారత్‌లో లాంచ్ చేసే విషయం గురించి హోండా సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. విజువల్ పరంగా యువతను ఆకట్టుకునే డిజైన్‌తో దీన్ని తీసుకురానుంది. దీంట్లోని డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్, మస్క్యులర్ బాడీ ప్యానెలింగ్‌తో ఇది స్టైలిష్‌గా కనిపిస్తోంది.

త్వరలో రానున్న ఈ హోండా NPF 125 స్కూటర్‌లో కీ ఫీచర్లను గమనిస్తే.. ఇందులో టర్న్ ఇండికేటర్స్ కోసం ప్రొజెక్టర్ స్టైల్ హౌజింగ్స్, సింగిల్- పీస్ సీట్, slightly raised exhaust, H-shaped టెయిల్ లైట్స్ ఉంటాయి. దీని డిజైన్‌లో విభిన్నత కనబరుస్తూనే ఫీచర్లలోనూ హోండా సంస్థ రాజీ పడలేదు.
ఉదాహరణకు.. దీని ఫ్లోర్‌బోర్డ్ ఏరియా ఫ్లాట్‌గా చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. పొడవైన వ్యక్తులు కూడా కాళ్ల తాకకుండా దీన్ని రైడ్ చేయవచ్చు. లేదా ఈ ఫ్లోర్‌బోర్డ్ ఏరియాలో మనకు కావాల్సిన వస్తువులను పెట్టుకుని కూడా ప్రయాణించవచ్చు. ఇది 14.3 లీటర్ అండర్‌సీట్ స్టోరేజ్ స్పేస్‌తో ఉంటుంది. ఈ స్పేస్ కారణంగా దీంట్లో హెల్మెట్ సహా ఇతర చిన్న వస్తువులు సులభంగా పెట్టుకోవచ్చు.

అంతేగాకుండా దీంట్లోని ఫ్రంట్ యుటిలిటీ పాకెట్స్‌లో కూడా వాటర్ బాటిల్స్, స్మార్ట్ ఫోన్స్ వంటి ఇతర వస్తువులను క్యారీ చేయవచ్చు. దీంట్లోని టాప్ బాక్స్‌ను వెనుకవైపు అటాచ్ చేసుకునే అవకాశం ఉండడం వల్ల స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చని హోండా సంస్థ చెబుతోంది. దీని కోసం.. ఓ గ్రాబ్ రెయిల్‌ను కూడా అందించింది. దీని ద్వారా వెనుకవైపు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఈ NPF 125 స్కూటర్ కమర్షియల్ యూసేజ్ కోసం ఉపయోగపడుతుంది.
ఈ హోండా NPF 125 స్కూటర్ 124 సీసీ సింగిల్- సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించి ఉంటుంది. ఇది 9.51 bhp పవర్, 10 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్- ఆఫ్, 15- వాట్ Type-C ఛార్జర్, స్మార్ట్ కీ, అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్ సిస్టం, eSP టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ స్కూటర్ లీటర్‌కు 50 కి.మీ.ల మైలేజీ అందించగలదని హోండా సంస్థ చెబుతోంది. దీని టాప్‌స్పీడ్ 90 కేఎంపీహెచ్‌గా ఉంది. దీంట్లో 5.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం ఉంటుంది. అంటే.. దీన్ని పుల్ట్యాంక్ చేయడం ద్వారా దాదాపు 300 కి.మీ.ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఇది ముందు వైపు 12 అంగుళాలు, వెనుకవైపు 10 అంగుళాల వీల్స్‌తో ఉంటుంది.
దీంట్లో సస్పెన్షన్ సెటప్, బ్రైకింగ్ సెటప్ ట్రెడిషనల్‌గానే ఉన్నప్పటికీ.. విదేశాల్లో దీంట్లోని టాప్ వేరియంట్ సింగిల్- ఛానల్ ABS సపోర్ట్‌తో ఉంది. ఈ హోండా NPF 125 స్కూటర్‌కు 125 సీసీ సెగ్మెంట్‌లో.. టీవీఎస్ ఎన్‌టార్క్, సుజుకీ బుర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125, యమహా ఫాసీనో, హీరో జూమ్ 125 వంటి స్కూటర్ల పోటీగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








