అతి తక్కువ ధరకే అడ్వెంచర్ బైక్ లాంచ్.. వీకెండ్స్‌లో లాంగ్ రైడ్‌కు హాయిగా వెళ్ళండి!
భారతదేశంలో అడ్వెంచర్ బైక్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. సోషల్ మీడియా ట్రెండ్ పెరిగిన కారణంగా చాలా మంది ఇలాంటి వాటిని కొనుగోలు చేసి టూరింగ్ లాంటివి చేస్తూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో షేర్ చేస్తూ భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. టెక్ ఉద్యోగుల్లో పని ఒత్తిడి పెరగడం వలన దాని నుంచి బయటపడటానికి అడ్వెంచర్ బైక్స్‌ను కొనుగోలు చేసి వీకెండ్స్ లేదా సెలవుల సమయాల్లో లాంట్ రైడింగ్ లాంటి చేస్తున్నారు. అందుకే మార్కెట్లో ఈ తరహా బైకుల అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. టూవీలర్ తయారీ కంపెనీలు కూడా కస్టమర్ల నుంచి వస్తున్న ఆదరణకు అనుగుణంగా ఈ మోడళ్లనే మరింత అప్‌డేట్‌గా తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా (Honda) అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల విభాగంలో తన సత్తా చాటడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందుకే కంపెనీ తాజాగా కొత్త అడ్వెంచర్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
హోండా తీసుకొచ్చిన కొత్త బైక్ పేరు 'nx200'. ఇది అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల విభాగంలో యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది. దీని ధర రూ.1.68 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది CB200X లాగే అనిపిస్తుంది. దీని స్థానాన్ని ఎన్‌ఎక్స్ 200 భర్తీ చేయనుంది. ఇది వినియోగదారులకు ఒకే వేరియంట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

CB200X తక్కువ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు కలిగిన మోడల్ కాగా, దీనినే రీబ్రాండ్ చేసి nx200గా మార్కెట్లోకి తీసుకొచ్చారు. రెగ్యులర్‌గా రైడింగ్ చేసే వారు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ బైక్‌తో తమకు నచ్చిన ప్రాంతానికి సాఫీగా వెళ్లవచ్చు. ఈ కొత్త బైక్ హోండా రెడ్ వింగ్, బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో కొనుగోలుకు లభిస్తుంది. ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉన్నప్పటికి, పలు కలర్స్‌లలో కొనుగోలు చేయవచ్చు.
కొత్త nx200 రేడియంట్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ కలర్స్‌లలో లభిస్తుంది. ఇది అడ్వెంచర్ స్టైల్ తరహా అన్ని ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ముందు హ్యండిల్ బార్ మధ్య భాగంలో 4.2-అంగుళాల డిజిటల్ TFT డిస్‌ప్లే, లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ, బైక్ గురించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి రోడ్‌సింక్ యాప్ సపోర్ట్‌ను కూడా ఈ బైకులో అందించారు.
ముందు LED హెడ్‌ల్యాంప్, X-ఆకారపు LED టెయిల్‌లైట్, LED ఇండికేటర్లు, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్‌తో పాటు ఆకట్టుకునే గ్రాఫిక్ డిజైన్, అదనంగా SMS అలర్ట్‌లు, కాల్ నోటిఫికేషన్స్, నావిగేషన్ సపోర్ట్ వంటివి కూడా ఉన్నాయి. వీటిని హోండా రోడ్‌సింక్ యాప్ సహాయంతో ఆపరేట్ చేయవచ్చు. USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించడం విశేషం. అల్లాయ్ వీల్స్ స్టైలిష్‌గా ఉంటాయి.
హోండా nx200 ఇంజిన్ విషయానికి వస్తే, 184.4 cc సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్‌తో రన్ అవుతుంది. దీన్ని ప్రధానంగా OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జోడించారు. ఇది 8,500 rpm వద్ద 16.76 bhp పవర్, 6,000 rpm వద్ద 15.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








