గోల్డెన్ ఛాన్స్: ఈ బైకును ఇప్పుడు తక్కువ ధరలో సొంతం చేసుకోండి.. హోండా CB350పై అదిరిపోయే డిస్కౌంట్
దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) తన ప్రసిద్ధ మోడల్ హైనెస్ CB350 బైకును తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. మిడ్-కెపాసిటీ సెగ్మెంట్‌లో తన మార్క్‌ను వేసేందుకు హోండా రూపొందించిన ఈ బైక్‌పై ఈ నెలలో రూ. 15,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్యాష్ డిస్కౌంట్లు, ఫైనాన్స్ సబ్సిడీలు లేదా యాక్సెసరీస్ ఉండవచ్చు. CB350 బైక్ రాయల్ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, బుల్లెట్ లాంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలుస్తోంది. భారతీయ రైడర్ల అభిరుచులను పరిగణలోకి తీసుకుని తయారైంది. ఇటీవల టూవీలర్ సెగ్మెంట్‌లో పోటీ ఎక్కువ అయిన నేపథ్యంలో మరింత ఎక్కువ కస్టమర్లను ఆకర్షించేందుకు హోండా కంపెనీ తన CB350పై ఈ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.
ఇటీవల హోండా CB350 బైకును తాజా ఉద్గార ప్రమాణాలు (OBD2B)కి అనుగుణంగా అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేట్ ద్వారా ఈ బైక్ మరింత ఎకాలాజికల్‌గా మారినప్పటికీ, తన రైడింగ్ డైనమిక్స్ హోదాను మాత్రం అలాగే నిలుపుకుంది. కొత్త మార్పుల్లో భాగంగా, హోండా ఇప్పుడు హైనెస్ CB350ను కొన్ని స్టైలిష్ కలర్ ఆప్షన్లలో కూడా అందిస్తోంది. ఇవి బైక్‌కు మరింత రిచ్ లుక్‌ను అందిస్తున్నాయి.

మరో విషయం ఏమిటంటే తగ్గింపు మే 31, 2025 వరకు ఉంటుంది. ప్రస్తుతం 2025 హోండా CB350 DLX వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.99 లక్షలు కాగా, ఎక్కువ ఫీచర్లతో లభించే DLX ప్రో వేరియంట్ రూ. 2.17 లక్షల వరకు ఉంది. ఈ ధరకు ఇలాంటి రైడింగ్ కంఫర్ట్, డిజైన్ కలిగిన బైక్ లభించడం చాలా అరుదు. ఇది పాతకాలపు బ్రిటీష్ క్లాసిక్స్‌ను తలపించే విధంగా ఉంటుంది.
దీని డిజైన్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, క్రోమ్ టచ్‌లతో కూడిన బాడీ ప్యానల్స్, విశాలమైన ట్యాంక్, ఆకర్షణీయమైన ఎగ్జాస్ట్ నోట్ ఇవన్నీ వింటేజ్ లుక్ ఫీలింగ్‌ని అందిస్తున్నాయి.దీన్ని చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సరైన ప్రత్యామ్నాయంగా అనిపిస్తుంది. దీని రూపాన్ని చూస్తే బైక్ కొనాలని అనిపించేలా ఉంటుంది. ఇది ఒక స్టైల్ ఐకాన్‌గానే కాకుండా, రోజువారీ రైడింగ్‌కు మంచి చాయిస్ కూడా. హోండా హైనెస్ CB350 తన శక్తివంతమైన పనితీరును అందిస్తుంది.

ఇది 348cc సామర్థ్యం గల సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ మోటార్‌ను ఇటీవలే భారత్‌లో అమలవుతున్న తాజా ఉద్గార ప్రమాణాలు OBD2Bకి అనుగుణంగా అప్‌డేట్ చేశారు. అప్‌డేటెడ్ ఇంజిన్ ఇప్పుడు అత్యధికంగా 20.7 bhp పవర్‌ను, 29.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్‌కు సరిపోయేలా, హోండా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించింది. ఇందులో స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ వంటి స్మార్ట్ ఫీచర్ కూడా కలిగి ఉంది.
ఇది గేర్ షిఫ్టింగ్‌ను మరింత సాఫీగా, సులభంగా చేస్తుంది. ట్రాఫిక్‌లో ఫిక్వెంట్ గేర్ మార్పులకు బైకర్లకు ఈజీ రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. బైక్‌కి బలమైన సస్పెన్షన్ సెటప్‌ను అందించారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు అమర్చారు. అలాగే, బ్రేకింగ్ వ్యవస్థ విషయంలో హోండా ఎలాంటి రాజీ పడలేదు. ముందు, వెనుక చక్రాల్లో డిస్క్ బ్రేక్‌లు ఉండగా, వాటికి డ్యూయల్-ఛానల్ ABS సపోర్ట్ ఉంటుంది.

ఈ బైక్‌లో మెరుగైన లైటింగ్ టెక్నాలజీని కూడా అందించారు. ముందుభాగంలో LED హెడ్‌ల్యాంప్ ఉంటుంది. టెయిల్ లాంప్ ఫైర్ రింగ్ టైప్ డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉండగా, LED బ్లింకర్‌లు ఉన్నాయి. అదనంగా, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్‌తో కూడి ఉండటం, రైడింగ్ సమయంలో సడన్ బ్రేకింగ్ సమయంలో రోడ్డు మీద ఇతర వాహనాలకు స్పష్టమైన హెచ్చరిక ఇస్తుంది. ఇది దాదాపు 42 నుంచి 45 కి.మీ వరకు మైలేజ్ అందించగలదు.


Click it and Unblock the Notifications








