ఎప్పుడూ చూడని భారీ తగ్గింపు! హోండా బైక్‌పై రూ.80 వేల డిస్కౌంట్! సూపర్ బైక్‌ను తక్కువ ధరకే దక్కించుకోండి!
దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హోండా (Honda) మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించే మోడళ్లను మాత్రమే కాకుండా ప్రీమియం లగ్జరీ సూపర్ బైక్స్‌ను కూడా విక్రయిస్తుంది. యాక్టివా, షైన్, యునికార్న్ వంటి ప్రజాదరణ పొందిన బైక్స్ గురించి మాత్రమే చాలా మందికి తెలుసు కానీ, కంపెనీ అవే కాకుండా ఇతర అడ్వెంచర్ తరహా ఆఫ్‌రోడ్ బైక్స్‌ను విక్రయిస్తుంది. ఈ కోవకే చెందిన మోడళ్లలో ఎక్స్‌ఎల్750 ట్రాన్సాల్ప్ (XL750 Transalp) కూడా ఒకటి. జపనీస్ బ్రాండ్ ప్రీమియం లగ్జరీ సూపర్ బైక్స్ విభాగంలోనూ దూసుకుపోవడానికి దీన్ని లాంచ్ చేసింది. ఇది అడ్వెంచర్, టూరింగ్ లవర్స్ కోసం హోండా అందించిన మరో అద్భుతమైన బైక్. ఇందులో పవర్‌ఫుల్ ఇంజిన్, లేటెస్ట్ సస్పెన్షన్ సెటప్, అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ఈ బైక్‌ను తక్కువ ధరలో కొనేందుకు ఇప్పుడు సరైన సమయం వచ్చింది. జపనీస్ బ్రాండ్ ఈ ప్రీమియం టూరింగ్ బైక్‌పై ఏకంగా రూ.80,000 తగ్గింపు ప్రకటించింది. హోండా XL750 ట్రాన్సాల్ప్ అడ్వెంచర్ బైక్‌ను కలిగి ఉండాలని కలలు కొనేవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఈ బైక్ ప్రస్తుతం భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా అప్‌డేట్ చేసిన కొత్త మోడల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి కంపెనీ కస్టమర్లకు ఈ భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఇదే సమయంలో హోండా యాక్సెసరీలపై డిస్కౌంట్లు, తక్కువ డౌన్‌పేమెంట్, తక్కువ వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ లిమిటెడ్ కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
కస్టమర్లు హోండా కంపెనీ ఇస్తున్న భారీ తగ్గింపును సద్వినియోగం చేసుకుని తక్కువ ధరలో ఈ అధునాతన అడ్వెంచర్ టూరింగ్ బైక్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసినట్లయితే ముందుగా మీ దగ్గరలోని కంపెనీ అధీకృత షోరూమ్‌లలో వెళ్లి సిబ్బందిని సంప్రదించి ఆఫర్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని కూడా సూచిస్తున్నాము. ఎందుకంటే ఆఫర్స్ అనేవి కొన్నిసార్లు ఏరియాను బట్టి మారుతాయి. కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు.

ప్రీమియం అడ్వెంచర్ టూరింగ్‌లో ప్రసిద్ధి చెందిన హోండా XL750 ట్రాన్సాల్ప్‌ను జపాన్ నుండి పూర్తిగా నిర్మించబడిన (CBU) యూనిట్‌గా ఇండియా మార్కెట్‌కు తీసుకువచ్చారు. దీని ధర రూ.10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. అయితే ఇంత భారీ మొత్తంలో ఉండటానికి ప్రధాన కారణం దీన్ని ఇతర దేశం నుంచి దిగుమతి చేసుకోవడం వలన పన్నుతో కలిపి పెరిగింది. ఈ బైక్‌ను హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే విక్రయిస్తున్నారు.
హోండా XL750 ట్రాన్సాల్ప్ 755cc లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో అమర్చబడింది, ఇది 270-డిగ్రీ క్రాంక్ షాఫ్ట్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 90.5 bhp పవర్, 75 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది రైడర్‌లకు స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్, గ్రావెల్, యూజర్ అనే ఐదు వేర్వేరు రైడింగ్ మోడ్స్‌లను కలిగి ఉంది. ఇది హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (HSVC)ని కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఐదు అంగుళాల TFT స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్స్, మెసేజ్‌లు, మ్యూజిక్ కంట్రోలింగ్, నావిగేషన్ కోసం వాయిస్ నియంత్రణను వాడుకోవచ్చు. సేఫ్టీ రైడింగ్ కోసం ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ట్రాక్షన్ కంట్రోల్, కాంపాక్ట్ హెడ్‌లైట్, ఇంటిగ్రేటెడ్ విండ్‌స్క్రీన్, పెద్ద ట్యాంక్ వంటి మొదలైన అంశాలను ఈ బైక్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








