భారత రోడ్లపై రెబెల్.. మతిపోగోట్టే స్టన్నింగ్ లుక్స్‌తో లాంచ్ కాబోతుంది! సరికొత్త రైడ్‌కు సిద్దం అవ్వండి..
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా (Honda)కు ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే. మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా బైక్స్, స్కూటర్లను విడుదల చేయడంలో ఇది బాగా ప్రసిద్ధి చెందిన సంస్థ. తక్కువ ధరలో రోజువారీ ప్రయాణాలకు అవసరమయ్యే మోడళ్లను భారతీయ వినియోగదారులకు అందించడంలో హోండా కంపెనీకి మంచి పేరుంది. దేశంలో హోండా యాక్టివా స్కూటర్ ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. మార్కెట్లోకి ఎన్ని స్కూటర్ మోడళ్లు వచ్చినప్పటికి యాక్టివాకు ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. కంపెనీ సైతం దీన్ని ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ చేస్తూ మరి తీసుకొస్తుంది. స్కూటర్ విభాగంలోనే కాకుండా బైక్స్‌లలో కూడా ఇది బాగా ప్రసిద్ది చెందిన సంస్థ.
హోండాకు చెందిన వాహనాలు ప్రస్తుతం దేశంలో లక్షలాది కిలోమీటర్ల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇటీవల కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా దృష్టి పెట్టి ఈ సెగ్మెంట్‌లో కూడా సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను సైతం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ప్రీమియం మోడళ్లను భారత్‌లో విడుదల చేయడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రీమియం క్రూయిజర్‌ను తీసుకొస్తుంది.

ఇండియాలోకి రాబోతున్న కొత్త మోడల్ రెబెల్ 300(rebel 300). ఈ కొత్త బైకును కంపెనీ వచ్చే ఏడాది ప్రారంభంలో అమ్మకానికి అందుబాటులోకి తీసుకు వస్తుందని తెలుస్తుంది. దేశంలో ఇప్పటికే హోండా CB300R అనే మోడల్‌ను విక్రయిస్తుండగా, కొత్తగా తీసుకురాబోతున్న రెబెల్ 300 బైక్ కూడా దీని మాదిరిగానే అదిరిపోయే స్టైలిష్ లుక్‌తో, అధునాతన ఫీచర్స్‌తో వస్తుంది. ప్రీమియం విభాగంలో కొంత మార్కెట్ కలిగి ఉండటం కంపెనీ కలిసి వచ్చే అవకాశం.
ప్రస్తుతం దేశంలో యూత్ ఎక్కువగా ఇలాంటి మోడళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో చాలా కాలంగా టూవీలర్స్ విడుదల అవుతూనే ఉన్నాయి. కస్టమర్ల నుంచి వస్తున్న ఆదరణ నేపథ్యంలో హోండా కూడా ప్రీమియం మోటార్‌సైకిళ్లపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి అమ్మకాలను పెంచుకోవాలని చూస్తుంది. హోండా రెబెల్ 300 క్రూయిజర్‌తో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది 286cc లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

ఈ ఇంజిన్ నాలుగు వాల్వ్‌లతో కూడిన DOHC సెటప్, 10.7:1 కంప్రెషన్ రేషియో అలాగే 38 mm థొరెటల్ బాడీతో వస్తుంది. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జోడించారు. 500 rpm వద్ద 19.03 bhp పవర్‌ను, 7000 rpm వద్ద 17.55 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర ప్రయాణాలకు, హైవే రోడ్లకు రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 120 కి.మీగా ఉంది.
దీని ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే, 11.3 లీటర్ల వరకు ఉంటుంది. రైడింగ్‌లో రక్షణ అందించానికి డ్యూయల్-ఛానల్ ABS సిస్టంతో వస్తుంది. అలాగే, ముందు, వెనుక వీల్స్‌కు సింగిల్ డిస్క్ సెటప్‌ను అందించారు. ఈ బైకును ఇండియాలోని తన తయరీ ప్లాంట్‌లో నిర్మించనున్నట్లు తెలుస్తుంది. స్థానిక వినియోగదారులకు అనుగుణంగా ఇది కొత్త అప్‌డేట్స్ వస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








