ఈ కొత్త బైక్ మిస్ అవ్వకండి.. ఆఫీసు, మార్కెట్, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
హోండా షైన్ (Honda Shine).. ఈ పేరు వినగానే ఎంతమందికో నమ్మకం, నాణ్యత, మంచి మైలేజ్ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు అదే పేరు, అదే నమ్మకాన్ని కొత్త రూపంలో తీసుకొచ్చింది హోండా. ఈ రోజు దేశరాజధాని న్యూఢిల్లీ నగరంలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో, కంపెనీ కొత్తగా హోండా షైన్ 100 డీఎక్స్ (Honda Shine 100 DX) మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది కేవలం పాత షైన్‌కు కొనసాగింపుగా కాకుండా, యువతరాన్ని ఆకట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. కొత్త Shine 100 DX మోడల్‌ను చూస్తేనే ఆకర్షణ మొదలవుతుంది. ఫ్రంట్‌లో ఉన్న కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, దానికి తగ్గట్టే సైడ్ బాడీపై ఉల్లాసంగా మెరుస్తున్న గ్రాఫిక్స్.. వీటితో ఇది స్టైలిష్ లుక్‌ను పొందింది. హోండా బ్రాండింగ్ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ మెరిసిపోతుంటుంది. మొత్తం బైక్‌కి ప్రీమియం అట్టిట్యూడ్ కనిపిస్తుంది.
కొత్త Honda Shine 100 DX వెర్షన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Shine 100 కంటే మరింత ప్రీమియంగా తీర్చిదిద్దబడింది. ఫీచర్లు, డిజైన్, స్టైలింగ్ విషయాల్లో ఈ బైక్ హోండా స్టాండర్డ్‌కి తగ్గట్లే ఆధునికతను కలిగి ఉంది. కొత్త మోడల్‌కి ఆకర్షణీయమైన డిజైన్ మాత్రమే కాదు, బిల్డ్ క్వాలిటీ, ఫినిషింగ్ కూడా ప్రీమియం లెవల్‌లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మోడల్‌కి సంబంధించి ధరను హోండా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

కానీ మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, దీని ధర రూ. 75,000 నుంచి రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. దీని ద్వారా ఇది ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ సెగ్మెంట్‌లో ఉన్న ఇతర మోడళ్లకు కాస్త ఎక్కువ ధరతో, కానీ బెటర్ స్టైల్, ఫీచర్లు కలిగిన ఎంపికగా నిలవనుంది. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నవారి కోసం ఆగస్టు 1, 2025 నుండి బుకింగ్‌లు అధికారికంగా ప్రారంభమవుతాయని హోండా ఇప్పటికే ప్రకటించింది.
బైక్ సెగ్మెంట్‌లో హోండా మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు రంగంలోకి దిగినట్లే. బైక్‌లో ఉన్న అప్‌డేటెడ్ డిజైన్ ఎలిమెంట్లు, గ్రాఫిక్స్, టెక్నాలజీ దానిని కేవలం ఓ కమ్యూటర్ బైక్‌గా కాకుండా, స్టైలిష్ సెగ్మెంట్ బైక్‌గా మార్చాయి. కొత్త దానిలో ప్రధానంగా ఫ్యూయల్ ట్యాంక్ సాధారణ మోడల్ కంటే మరింత పెద్దగా ఉంటుంది. యువతరాన్ని ఆకర్షించే విధంగా చాలా స్పోర్టీగా బోల్డ్ గ్రాఫిక్స్ కలిగి ఉంది.

Shine 100 DXలోని మరో ముఖ్యమైన అప్‌డేట్, కొత్త LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది బైక్‌కు కొత్త రూపాన్ని అందిస్తుంది. స్పీడ్, ఫ్యూయల్ స్టేటస్, ట్రిప్ మీటర్ వంటి సమాచారం డిజిటల్‌గా చూపించేలా ఉంటుంది. హెడ్‌లైట్ కౌల్‌పై క్రోమ్ ఇన్సర్ట్‌లు ప్రీమియంగా కనిపిస్తాయి. బైక్‌కి యధాతధంగా 98.98cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి, మంచి పికప్, మైలేజ్‌ను అందిస్తుంది.
మరో విషయం ఏమిటంటే ఈ ఇంజిన్‌ను OBD2Bకి అనుగుణంగాల అప్‌గ్రేడ్ చేశారు. ఇది 7,500 rpm వద్ద 7.28 bhp శక్తిని, 5,000 rpm వద్ద 8.04 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ CBS (కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్), డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. దీనికి టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.

హోండా షైన్ 100 DX బుకింగ్ ప్రక్రియను ఆగస్టు 1, 2025 నుండి ప్రారంభించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఆ తేదీ తర్వాత, డెలివరీలు దేశవ్యాప్తంగా దశలవారీగా ప్రారంభమవుతాయి. ఈ కొత్త మోడల్‌కి ఇప్పటికే మార్కెట్‌లో ఆసక్తి పెరుగుతుండటం గమనార్హం. హీరో స్ప్లెండర్ మోడల్‌కి ప్రత్యక్ష పోటీగా షైన్ 100 DX బైక్ నిలబోతుంది.


Click it and Unblock the Notifications








