హోండా షైన్ దెబ్బకు టీవీఎస్, బజాజ్ బెంబేలు.. షోరూముల్లో కిటకిటలాడుతున్న జనాలు

కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? మైలేజ్, తక్కువ ధర, ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలా? అయితే, హోండా షైన్ (Honda Shine) గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. టీవీఎస్ (TVS), బజాజ్ (Bajaj) వంటి కంపెనీలకు షాక్ ఇస్తూ హోండా షైన్ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఇంతకీ ఈ బైక్‌లో ఏముంది? ఎందుకని షోరూముల్లో జనం కిటకిటలాడుతున్నారు? చూద్దాం.

టీవీఎస్, బజాజ్ తలలపై పిడుగు పడినట్లు చేస్తోంది హోండా షైన్. భారత మార్కెట్లో హోండా షైన్ (Honda Shine) బైక్ చాలా పాపులర్. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుండటంతో 2025 ఏప్రిల్ నెలలో హోండా షైన్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

Honda Shine 125

తాజాగా విడుదలైన ఈ బైక్ సేల్స్ రిపోర్ట్ (Sales Report) ప్రకారం చూస్తే హోండా సంస్థ 2024 ఏప్రిల్ నెలలో కేవలం 1,42,751 షైన్ బైక్‌లను మాత్రమే విక్రయించింది. కానీ, 2025 ఏప్రిల్ నెలలో ఈ సంఖ్య 1,68,908 కు పెరిగింది.

ఇది 18.3 శాతం వృద్ధి కావడం విశేషం. ఈ అద్భుతమైన వృద్ధి కారణంగా, 2025 ఏప్రిల్ నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 టూవీలర్‌ల జాబితాలో (Top 10 Two Wheelers) హోండా షైన్ 3వ స్థానాన్ని సంపాదించింది.

Honda Shine 100

మొదటి 2 స్థానాల్లో వరుసగా హీరో స్ప్లెండర్ (Hero Splendor), హోండా యాక్టివా (Honda Activa) ఉన్నాయి. హోండా షైన్ బైక్, భారత మార్కెట్లో 100 సీసీ (cc), 125 సీసీ (cc) అనే మొత్తం 2 ఇంజిన్ ఆప్షన్లలో (Engine Options) అమ్ముడవుతోంది.

వీటిలో హోండా షైన్ 100 సీసీ బైక్ ఒకే ఒక్క వేరియంట్‌లో అమ్ముడవుతోంది. దాని ధర రూ. 70,521 గా ఉంది. మరోవైపు, హోండా షైన్ 125 బైక్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 87,748 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 92,499 గా ఉంది.

Honda Shine 100side

ఈ వార్తలో ఇచ్చిన ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు ( Ex-showroom Price) మాత్రమే. అంతేకాకుండా, హోండా షైన్ 100, హోండా షైన్ 125 బైక్‌లు OBD2B నిబంధనలకు అనుగుణంగా ఉన్న మోడళ్ల ధరలు గమనించాల్సి ఉంటుంది.

హోండా షైన్ 100 బైక్‌లో 98.98 సీసీ, 4-స్ట్రోక్ ఇంజిన్ అమర్చబడి ఉంది. దీనికి 4-స్పీడ్ గేర్ బాక్స్ యాడ్ చేశారు. మరోవైపు, హోండా షైన్ 125 బైక్‌లో 123.94 సీసీ, 4-స్ట్రోక్ ఇంజిన్ అందించారు. దీనికి 5-స్పీడ్ గేర్ బాక్స్ జత చేయబడింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100), హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe) వంటి బైక్‌లకు హోండా షైన్ 100 ఒక గొప్ప ప్రత్యామ్నాయం. మరోవైపు, టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125), బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125) వంటి బైక్‌లకు హోండా షైన్ 125 ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 27, 2025, 9:27 [IST]
English summary
Honda shine drops a bomb on tvs bajaj price so low showrooms are packed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+