రూ.68 వేలకే పేద-మిడిల్ క్లాస్ వారి బండి! ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 612 కి.మీలు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది
భారతీయ టూవీలర్ మార్కెట్లో హోండా షైన్ (Honda Shine) తన స్థానాన్ని మరోసారి బలోపేతం చేసుకుంది. చాలా కాలంగా మధ్యతరగతి వినియోగదారుల ఆదరణను పొందుతూ వస్తున్న ఈ మోడల్, తన అద్భుతమైన పనితీరు, మైలేజ్, విశ్వసనీయతతో లక్షలాది మందిని ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన *మే 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం, హోండా షైన్ దేశంలోని టాప్ 10 మోటార్‌సైకిళ్ల జాబితాలో రెండవ స్థానాన్ని సంపాదించింది. ఇది కంపెనీ ఊహించిన స్థాయిని మించి వచ్చిన ఘనతగా చెప్పవచ్చు. వినియోగదారుల నమ్మకాన్ని పొందిన ఈ బైక్, సాధారణ ప్రయాణం కోసం కాకుండా, రోజువారీ అవసరాలకు తగ్గట్టు బాగా ఉపయోగపడుతుంది. ఇది దేశీయ ఫ్యామిలీ వినియోగదారుల బైక్. దీనిపై పెట్టిన ప్రతి రూపాయికి లాభం చేకూర్చేలా ఇది తన పెర్ఫామెన్స్‌ను అందిస్తుంది.
తాజాగా కంపెనీ వెల్లడించిన సేల్స్ నివేదిక ప్రకారం, మే నెలలో హోండా షైన్ 1,58,271 యూనిట్లు అమ్ముడు పోయింది. అదే మునుపటి ఏడాది మేలో అమ్ముడైన యూనిట్లు 1,49,054గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది దాదాపు 6.18 శాతం వృద్ధిని సాధించటం ఈ బైక్‌కు మరో గర్వకారణం. ఇది కేవలం హోండా బ్రాండ్‌కు మాత్రమే కాదు, మధ్యతరగతి ప్రజలకు నమ్మకమైన ప్రయాణ భాగస్వామిగా మారినట్టు సూచిస్తోంది.

అలాగే, ఈ జాబితాలో హీరో స్ప్లెండర్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, బజాజ్ పల్సర్ మూడవ స్థానంలో నిలిచింది. అయినప్పటికీ, హోండా షైన్ స్థిరంగా రెండవ స్థానంలో నిలవడం, దాని పనీతీరు, నాణ్యత, విశ్వాసానికి నిదర్శనంగా చెప్పొచ్చు. హోండా షైన్ ప్రస్తుతం దేశీయంగా రెండు వేరియంట్లలో షైన్ 100, షైన్ 125 రూపంలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. అందుబాటు ధరలో మెరుగైన పెర్ఫామెన్స్ కోరుకునే వినియోగదారులకు షైన్ 100 బెస్ట్ ఆప్షన్.
మరింత శక్తివంతమైన ప్రయాణ అనుభవాన్ని కోరేవారికి షైన్ 125 టాప్-ఎండ్ మోడల్‌ను హోండా అందిస్తోంది. షైన్ 100 బైక్ గురించి వివరంగా చెప్పుకుంటే, ఇది ఒక ఆకర్షణీయమైన డిజైన్‌తో, ఫంక్షనాలిటీకి ప్రధాన ప్రాధాన్యతనిచ్చే విధంగా రూపొందించబడింది. దీని ధర రూ.68,000 (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. ఇది మధ్యతరగతి వినియోగదారులకు బడ్జెట్‌కు అనుగుణంగా ఉంటోంది. బైక్‌కు మినిమలిస్టిక్ లుక్స్ ఉన్నా, కలర్స్ మాత్రం విభిన్నత కనిపిస్తుంది.

బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ ఆరెంజ్, బ్లాక్ విత్ గ్రే, బ్లాక్ విత్ గ్రీన్ వంటి ఐదు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. ఇది 98.98cc పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయడంతో, రైడింగ్ అనుకూలంగా ఉంటుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 9 లీటర్లు.
హోండా షైన్ 125 బైక్ రూ. 84,000(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది. వినియోగదారుల అవసరాలను బట్టి డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ మోడల్ 123.94cc పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవతుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది. హోండా ప్రకారం, ఈ బైక్ లీటరుకు సగటుగా 55 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించగలదు.

ఫీచర్ల విషయానికి వస్తే, షైన్ 125 పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తోంది, ఇందులో స్పీడ్, ఫ్యూయల్ లెవెల్, ట్రిప్, టైమ్ లాంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అదనంగా, బైక్‌లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉండటం యువతను మరింత ఆకర్షించే అంశం. సిటీ రైడింగ్‌లో అదనపు కంఫర్ట్ కోసం డిస్క్ బ్రేక్ వేరియంట్ ఉంది.


Click it and Unblock the Notifications








