మిడిల్ క్లాస్ హీరో.. సత్తా చాటిన హోండా యూనికార్న్.. ఎందుకంత డిమాండో తెలుసా?

భారతదేశపు అగ్రగామి, విశ్వసనీయమైన ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హోండా స్కూటర్ అండ్ మోటార్‌సైకిల్ ఇండియా తన బైక్‌లు, స్కూటర్‌లతో దేశీయ మార్కెట్‌లో బలమైన స్థానాన్ని కలిగి ఉంది. హోండా విడుదల చేసే ప్రతి వాహనం దాని ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన సాంకేతికత, విశ్వసనీయతతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా పవర్ ఫుల్ ఇంజిన్‌ను కలిగి లుక్, పర్ఫామెన్స్ కలగలిసిన హోండా యూనికార్న్ మోటార్‌సైకిల్ మధ్యతరగతి ప్రజల హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా, ఈ మోడల్ మార్చి 2025 నెలలో ఊహించని స్థాయిలో అమ్మకాలు సాధించి, ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక కొత్త రికార్డును సృష్టించింది.

Honda Unicorn Sales 2025

గత నెల (మార్చి-2025)లో హోండా కంపెనీ ఏకంగా 29,363 యూనిట్ల యూనికార్న్ బైక్‌లను విక్రయించడం నిజంగా ఒక అద్భుతమైన విజయం. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ అమ్మకాలు ఏకంగా 52.76 శాతం పెరిగాయి. 2024 మార్చిలో కేవలం 19,221 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకుముందు నెల అయిన ఫిబ్రవరి 2025లో కూడా యూనికార్న్ 28,932 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది.

నెలవారీగా చూస్తే కూడా 1.48 శాతం వృద్ధి కనిపించడం ఈ బైక్‌కు మార్కెట్‌లో ఉన్న స్థిరమైన డిమాండ్‌ను తెలియజేస్తోంది. ఆటోమొబైల్ నిపుణులు ఈ ఏప్రిల్ నెలలో కూడా హోండా యూనికార్న్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హోండా యూనికార్న్‌లో అంత ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇది మధ్యతరగతి ప్రజల అభిమాన బైక్ అయిందో తెలుసుకుందాం.

Honda Unicorn Side

హోండా యూనికార్న్ ఒకప్పుడు యూత్ డ్రీమ్ బైక్‌గా ఉండేది. దాని అద్భుతమైన డిజైన్, పవర్ ఫుల్ ఇంజిన్, మంచి రైడింగ్ ఎక్సపీరియన్స్ ఎందరో బైక్ ప్రేమికులను ఆకర్షించాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో లభించడం ఈ బైక్ అతిపెద్ద విజయ రహస్యం. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.20లక్షలుగా ఉంది. ఈ ధరలో లభిస్తున్న ఇతర 160సీసీ బైక్‌లతో పోలిస్తే యూనికార్న్ అనేక అధునాతన ఫీచర్లను అందిస్తోంది.

ఈ కొత్త హోండా యూనికార్న్ 162.71సీసీ OBD-2B ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్ 7,500 rpm వద్ద 13.18 PS గరిష్ట హార్స్‌పవర్‌ను, 5,250 rpm వద్ద 14.58 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది నగర రోడ్లపై, హైవేలపై కూడా స్మూత్ రైడింగ్ ఎక్సపీరియన్స్ అందిస్తుంది.

Honda Unicorn Sales Front

ముఖ్యంగా దీని మైలేజ్ లీటరుకు 50 కిలోమీటర్ల వరకు ఉండడం వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఇది ఒక గొప్ప ప్రయోజనంగా చెప్పవచ్చు. కొత్త యూనికార్న్ మరింత ఆకర్షణీయమైన, ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ముందు భాగంలో అమర్చిన LED హెడ్‌లైట్ బైక్‌కు ఒక ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది. రాత్రిపూట ప్రకాశవంతమైన కాంతిని ఇస్తుంది.

ఈ బైక్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది, తద్వారా వినియోగదారులు తమ అభిరుచికి తగ్గ రంగును ఎంచుకోవచ్చు. ఈ బైక్‌లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్. ఇది స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

అలాగే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం USBటైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించబడింది. ఇది యువతకు చాలా ఉపయోగకరమైన ఫీచర్. సేఫ్టీ దృష్ట్యా సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. ఇది ప్రమాదవశాత్తు ఇంజిన్ స్టార్ట్ కాకుండా నివారిస్తుంది. ఈ కొత్త యూనికార్న్ మోటార్‌సైకిల్ దాదాపు 139 కిలోగ్రాముల బరువు ఉంటుంది. 13లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది, ఇది లాంగ్ రైడ్‌లకు అనుకూలంగా ఉంటుంది.

ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, కొత్త హోండా యూనికార్న్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌ను, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. ఈ సస్పెన్షన్ సెటప్ రహదారిపై కూడా రైడింగ్ కంఫర్ట్‌ను అందిస్తుంది, గుంతలు, ఇతర అడ్డంకులను సులభంగా అధిగమించడానికి సహాయపడుతుంది.

దీనితో పాటు రైడర్ల సేఫ్టీ కోసం సింగిల్ ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు అందించారు. ఇవి అత్యవసర పరిస్థితుల్లో బైక్‌ను సురక్షితంగా ఆపడానికి సహాయపడతాయి. మొత్తం మీద, హోండా యూనికార్న్ అందుబాటు ధరతో మధ్యతరగతి ప్రజల హృదయాలను గెలుచుకుంది. మార్చి 2025లో నమోదైన రికార్డు స్థాయి అమ్మకాలు ఈ బైక్‌కు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

Article Published On: Wednesday, April 30, 2025, 10:12 [IST]
English summary
Honda unicorn achieves unprecedented sales milestone in march 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+