ఒక పెద్ద సూట్‌కేసే పెట్టొచ్చు.. అధిక స్టోరేజ్ ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా? దానిలో సామాన్లు పెట్టుకోవడానికి ఎక్కువ స్థలం ఉండాలని కోరుకుంటున్నారా? అలాంటి వారి కోసం మార్కెట్లో చాలా స్కూటర్లు ఉన్నాయి. భారతదేశంలో స్కూటర్లు కొనే చాలామంది వాటిని ప్రాక్టికల్ అవసరాల కోసమే ఎంచుకుంటారు. అంటే, ఎక్కువ వస్తువులను సురక్షితంగా తీసుకెళ్లగలిగే సదుపాయం స్కూటర్లలో ఒక ముఖ్యమైన ఫీచర్.
ఇటీవల కాలంలో మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరిగిపోతుది. ప్రస్తతం మార్కెట్లో అధిక స్టోరేజ్ ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.

1. ఓలా ఎస్1
ఓలా కంపెనీ తమ జెన్2 అప్‌డేట్‌లో ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్టోరేజ్ కెపాసిటీని 34 లీటర్లకు పెంచింది. ఇదే సామర్థ్యాన్ని తమ జెన్3 మోడల్స్‌లో కూడా కొనసాగిస్తోంది. అయితే, జెన్1 మోడల్‌లో ఇది 36 లీటర్లుగా ఉండేది. ఆ తర్వాతి అప్‌డేట్‌లో తగ్గించడం గమనార్హం.
ఓలా ఎస్1 స్కూటర్లు వివిధ రకాల వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లు రూ. 66,999 నుండి రూ. 1.48 లక్షల మధ్య ధరలలో (ఎక్స్-షోరూమ్) అమ్ముడవుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఈ స్కూటర్లను డిజైన్ చేశారు.

2. ఏథర్ రిస్టా
ఏథర్ కంపెనీకి చెందిన రిస్టా ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా జెన్2 మోడల్ లాగే అదే 34 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. అయితే, ఓలా స్కూటర్లలో పూర్తి ఫేస్ హెల్మెట్‌ను పెట్టి సీటును మూయడం కొంచెం కష్టం. కానీ, ఏథర్ రిస్టా స్టోరేజ్ సదుపాయం ఎక్కువ లోతుగా ఉండటం వల్ల అందులో పెద్ద హెల్మెట్‌ను కూడా సులువుగా పెట్టి లాక్ చేయవచ్చు.
ఏథర్ రిస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్ బ్యాటరీకి 8 సంవత్సరాల వరకు వారంటీ లభిస్తుంది. ఈ స్కూటర్ రూ. 99,999 నుండి రూ. 1,14,500 ధరలలో (ఎక్స్-షోరూమ్) విక్రయించబడుతోంది.

3. బజాజ్ చేతక్
బజాజ్ కంపెనీ ఇటీవలనే చేతక్ 3001 అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ అంతకు ముందు కంపెనీ అమ్మిని 2903 వేరియంట్‌కు బదులుగా వచ్చింది. ఈ స్కూటర్‌లో 35 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ప్రస్తుతం చేతక్ సిరీస్‌లో 3001, 3501, 3502, 3503 అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఈ స్కూటర్ మార్కెట్‌లో రూ. 1.09 లక్షల నుండి రూ. 1.44 లక్షల ధరలలో (ఎక్స్-షోరూమ్) విక్రయించబడుతోంది. ఓలా స్కూటర్లకు పోటీగా బజాజ్ చేతక్ అమ్మకాలు కూడా బాగా జరుగుతున్నాయి.

4. కైనెటిక్ డీఎక్స్
కైనెటిక్ వాట్స్ అండ్ వేల్స్ కంపెనీ నుండి కైనెటిక్ డీఎక్స్ అనే పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ పేరు గతంలో ఉన్న పెట్రోల్ స్కూటర్‌ను గుర్తుచేస్తుంది. ఈ స్కూటర్‌లో 37 లీటర్ల భారీ స్టోరేజ్ సదుపాయం ఉంది.
ఈ స్కూటర్‌లో సీటు కింద యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, చిన్న చిన్న వస్తువులను పెట్టుకోవడానికి కంపార్ట్‌మెంట్‌లు వంటి అదనపు సౌకర్యాలు ఉన్నాయి. ఈ స్కూటర్ డీఎక్స్ మరియు డీఎక్స్ + అనే వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ ఇటీవలే పరిచయం చేయబడింది. కాబట్టి రోడ్లపైకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు.

5. రివర్ ఇండీ
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యధిక స్టోరేజ్ సదుపాయం రివర్ ఇండీలోనే ఉంది. దీనికి ఏకంగా 43 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే రివర్ కంపెనీ ఈ స్కూటర్‌ను తయారు చేసింది. ఈ స్కూటర్‌లో మొదటిసారిగా టాప్ బాక్స్ స్టోరేజ్ సదుపాయం కూడా ఉంది. ఇది స్టోరేజ్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.
భారతదేశంలో టూ-వీలర్లలో ఎక్కువ స్టోరేజ్ సౌకర్యం ఒక ముఖ్యమైన అవసరం. పైన చెప్పిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ విషయంలో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఎక్కువ స్టోరేజ్ అందించడం వల్ల ఈ స్కూటర్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే వీటి అమ్మకాలు కూడా బాగా జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications








