ఆదివారం చికెన్ కోసం ఎగబడినట్లు ఈ కంపెనీ టూవీలర్స్‌కు జనాల నుంచి భారీ డిమాండ్.. 2025 ఏప్రిల్ సేల్స్ రిపోర్ట్
భారత ఆటోమొబైల్ మార్కెట్లో టూవీలర్స్ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇటీవల ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో ఈ కాలంలో దేశంలోని ప్రముఖ టూవీలర్ తయారీదారులు తమ సేల్స్ వివరాలను విడుదల చేశారు. దీని ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రారంభ నెలలో, భారతీయ టూవీలర్ మార్కెట్‌లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గతంతో పోలిస్తే వ్యాపార పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో, అనేక కంపెనీటు తమ వాహనాలను అప్‌డేట్స్ చేయడం ప్రారంభించాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, హోండా ఈ నెలలో టూవీలర్ అమ్మకాల పరంగా మంచి అమ్మకాలను సాధించింది. ఈ కంపెనీ 4,22,931 యూనిట్ల టూవీలర్స్‌ను విక్రయించింది. హోండా తన బైకులు,స్కూటర్లను OBD2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయడం కూడా సేల్స్ పెరగడానికి దోహదపడింది.
ఈ మార్పులు, వినియోగదారుల నమ్మకాన్ని మరింత బలపరచడంతో పాటు, కంపెనీకి అమ్మకాల పరంగా దూకుడు తీసుకొచ్చాయి. నెలవారీగా హోండా అమ్మకాలు 5.36 శాతం పెరిగాయి. అంతేకాక, గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ఈ వృద్ధి 12 శాతం ఉండటం గమనార్హం. అంటే, ఒకసారి తీసుకున్న సాంకేతిక నిర్ణయాలు, మార్కెట్‌ను ఎంతగా ప్రభావితం చేయగలవో హోండా సక్సెస్ స్టోరీ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

హోండా తరువాత టీవీఎస్ మోటార్స్ మరోసారి తన స్థిరమైన అమ్మకాలతో టూవీలర్ మార్కెట్‌లో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఈ నెలలో కంపెనీ మొత్తంగా 3,23,647 యూనిట్లను విక్రయించింది. ముఖ్యంగా హీరో మోటోకార్ప్ విక్రయాల్లో పడిపోయిన ప్రభావం టీవీఎస్‌కు ప్రయోజనం చేకూర్చింది, దీని వలన కంపెనీ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకగలిగింది. గణంకాల ప్రకారం, టీవీఎస్ ఈ నెలలో 8.74 శాతం నెలవారీ వృద్ధిని సాధించింది.
ఇది ఊహించని స్థాయిలో బలమైన వృద్ధి. అంతేకాక, వార్షికంగా చూస్తే 1.26 శాతం వృద్ధి నమోదవడం కూడా మార్కెట్‌లో స్థిరమైన ఆధిపత్యాన్ని సూచిస్తుంది. కంపెనీ ఈ విధంగా బలమైన అమ్మకాలను నమోదు చేయడానికి టీవీఎస్ అపాచీ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. దీని యూత్‌ఫుల్ డిజైన్, మోటోరేసింగ్ ఇన్‌స్పిరేషన్, శక్తివంతమైన పనితీరు వంటి అంశాల వలన, అపాచీ మోడల్స్ వినియోగదారుల హృదయాలను గెలుచుకున్నాయి.

2025 ఆర్థిక సంవత్సరంలో అపాచీ సిరీస్ మొత్తం 4 లక్షల యూనిట్ల అమ్మకాలనట్లు దాటినట్లు సమాచారం, ఇది టీవీఎస్‌కు ఒక మైలురాయి విజయంగా నిలిచింది. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే, iQube ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను దీనిలో చేర్చబడలేదు. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ టూవీలర్స్‌లలో ఒకటి. ఒకవేళ వీటి అమ్మకాలు కూడా చేర్చితే టీవీఎస్ అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
సాధారణంగా ఇండియా టూవీలర్ మార్కెట్లో ఎప్పుడు ముందు స్థానంలో ఉండే హీరో మోటోకార్ప్ ఈసారి క్షీణతను ఎదుర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెలలో కంపెనీ 2,88,254 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది హోండా, టీవీఎస్ వంటి ప్రధాన పోటీదారుల కంటే తక్కువగా ఉండటంతో, కంపెనీకి మార్కెట్ ర్యాంకింగ్స్‌లో తక్కువ స్థానం పొందాల్సి వచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే, హీరో అమ్మకాల్లో 43 శాతానికి పైగా తగ్గింది.

గత నెలలో కూడా కంపెనీ వృద్ధి గణాంకాలు నిలకడగా లేకపోవడం గమనార్హం. ఈ కంపెనీ టూవీలర్స్ అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం ఇతర తయారీదారులు పోటా పోటీగా ఆకట్టుకునే ఫీచర్స్‌తో పలు మోడళ్లను విడుదల చేయడం వలన హీరోకు గట్టి పోటీ ఎదురైంది. అలాగే, సరఫరా గొలుసు మార్పులు, నిర్వహణ వ్యూహాల్లో మార్పులు చేసేందుకు అనేక తయారీ కేంద్రాల్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల అమ్మకాలపై ప్రత్యక్ష ప్రభావం పడింది.
ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికి కూడా వాహన రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం అదే కాలంలో 5.05 లక్షల వాహనాలు నమోదయ్యాయి, అంటే, మార్కెట్‌లో ఈ కంపెనీ బైకులు, టూవీలర్స్‌కు డిమాండ్ తగ్గలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఏర్పడిన తగ్గింపు అమ్మకాలు కేవలం హీరో కంపెనీ ఉత్పత్తి, సరఫరాలో ఏర్పడిన అంతరాల వల్లే ఇది వచ్చింది. త్వరలో ఈ అంతరం తగ్గిపోవడం వలన తిరిగి అమ్మకాల్లో పుంజుకునే అవకాశం ఉంది.

2026 ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల(ఏప్రిల్)లో బజాజ్ ఆటో 1,88,615 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది రికార్డు స్థాయి అమ్మకాలుగా నిలిచింది. గత నెలతో పోలిస్తే 2.69 శాతం వృద్ధి. అలాగే గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం గణనీయమైన పెరుగుదల. బజాజ్ ఆటో అమ్మకాలు పెరగడానికి ప్రధానంగా పల్సర్ NS400Z బైక్ కీలక పాత్ర పోషించింది. ఈ స్పోర్టీ మోడల్ యువతకు బాగా నచ్చింది.
అయితే, బజాజ్ అమ్మకాల్లో చేతక్ EV డేటా చేర్చలేదు. దీని తరువాత సుజుకి ఏప్రిల్ నెలలో 95,214 వాహనాలను విక్రయించింది. ఇది గత నెలతో పోలిస్తే 9.95 శాతం అమ్మకాల్లో తగ్గుదల, వార్షిక ప్రాతిపదికన 8.11 శాతం వృద్ధి సాధించడం విశేషం. ముఖ్యంగా, కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన యాక్సెస్ స్కూటర్ మోడల్‌ను అప్‌డేట్ చేసి విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెరిగాయి.
అలాగే, ప్రీమియం విభాగంలో బర్గ్‌మాన్ స్ట్రీట్ స్కూటర్‌కు ఇచ్చిన అప్‌డేట్స్ కూడా కంపెనీ అమ్మకాలు పెరగడానికి దోహదం చేశాయి. ఇక బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ విషయానికి వస్తే, 2025 ఏప్రిల్ నెలలో అమ్మకాల్లో కొంత వెనకడుగు వేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో చేసిన అమ్మకాలతో పోలిస్తే, ఈ సంవత్సరం కంపెనీ మొత్తం 76,002 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది దాదాపు 3.6 శాతం తగ్గుదల.
ఒకప్పుడు స్థిరమైన అభివృద్ధిని కొనసాగించిన బ్రాండ్‌కు ఇది కొంత నిరుత్సాహకరమైన అంశంగా కనిపించినప్పటికీ, వార్షిక ప్రాతిపదికన మాత్రం 1.2 శాతం వృద్ధిని నమోదు చేయడం ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అమ్మకాలను పెంచుకోవడానికి తన మోడళ్లను క్రమంగా అప్‌డట్ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే హంటర్ 350 మోడల్‌కు కంపెనీ మరింత కొత్తగా మార్చి విడుదల చేసింది.
ఈ గణాంకాల ఆధారంగా చూస్తే, భారతదేశ టూవీలర్ వాహన మార్కెట్ రోజు రోజుకు మరింత గట్టి పోటీతో నిండి పోతున్నదని స్పష్టమవుతుంది. వినియోగదారుల అవసరాలు వేగంగా మారుతుండటంతో, తయారీ సంస్థలు కొత్త ఫీచర్లు, టెక్నాలజీలు పరిచయం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








