ఈ బైక్స్‌ను ఒకసారి కొనేస్తే ఏళ్ళ తరబడి టెన్షన్ లేదు! లీటరుకు 70–90 మైలేజ్ ఇచ్చే ఇండియా బెస్ట్ మోడళ్లు
రోజువారీ ప్రయాణాలకు సరిపడే కొత్త మోటార్‌సైకిల్ కోసం చూస్తున్నారా? అయితే భారత మార్కెట్లో 100cc సెగ్మెంట్ ఇప్పటికీ అత్యంత పాపులర్‌గా కొనసాగుతోంది. కారణం చాలా సింపుల్.. సరసమైన ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అలాగే అద్భుతమైన మైలేజీ. ప్రతిరోజూ ఆఫీస్‌కు, స్కూల్ రన్స్‌కు, లేదా చిన్న చిన్న పనులకు వెళ్లేవారికి ఈ బైక్‌లు నిజంగా బెస్ట్ చాయిస్‌గా మారాయి. ఈ కేటగిరీలో ప్రస్తుతం ఎక్కువగా కొనుగోలు అవుతున్న మోడళ్లలో బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్ 100, హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో HF డీలక్స్ అనే నాలుగు బైక్‌లు ముందంజలో ఉన్నాయి. ప్రతీ మోడల్‌కి తనదైన ప్రత్యేకత ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. తక్కువ ధరకే మంచి మైలేజ్, డైలీ యూజ్‌కు సరిపోయే పనితీరు ఇవన్నీ కలిసి వీటికి మాస్ మార్కెట్లో గట్టి క్రేజ్‌ని తీసుకొచ్చాయి. వీటి గురించిన వివరాలు ఈ కింది కథనంలో..
Bajaj Platina 100: బజాజ్ ప్లాటినా 100 ప్రస్తుతం భారతీయ కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యంత విశ్వసనీయమైన బైక్‌లలో ఒకటిగా నిలిచింది. తక్కువ ధరలో మైలేజ్, కంఫర్ట్, మెయింటెనెన్స్ ప్యాకేజీ కావడమే దీని విజయ రహస్యం. ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 65,407 మాత్రమే కావడంతో పేద, మధ్యతరగతి వినియోగదారులు కూడా పెద్ద ఒత్తిడి లేకుండా సులభంగా దీన్ని కొనుగోలు చేయగలుగుతున్నారు.

దీనిలో ఉన్న 102cc పెట్రోల్ ఇంజిన్ రోజువారీ ప్రయాణాల్లో సరిపడా పవర్‌ను ఇస్తూ ఫ్యూయల్ ఎఫిషియెన్సీని దెబ్బతీయకుండా పని చేస్తుంది. అలాగే, ఇందులో 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఇవ్వడం వల్ల నగర ట్రాఫిక్‌లోనూ, ఓపెన్ రోడ్‌లోనూ గేర్ షిఫ్టింగ్ స్మూత్‌గా అనిపిస్తుంది. మైలేజీ విషయానికి వస్తే ప్లాటినాకు ప్రత్యామ్నాయం దొరకడం చాలా కష్టం. రియల్ టైమ్ రోడ్లపై కూడా ఇది 90 కి.మీ/లీటర్ వరకు మైలేజ్ ఇవ్వగలదు.
Honda Shine 100: హోండా షైన్ 100 భారతీయ కమ్యూటర్ బైక్ మార్కెట్లో వేగంగా పాపులర్ అవుతున్న మోడళ్లలో ఒకటి. హోండా బ్రాండ్‌కి ఉన్న నమ్మకంతో పాటు సరసమైన ధరలో లభించడం దీన్ని ప్రతి వర్గం వినియోగదారుడి చేరువ చేసింది. ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 65,561 మాత్రమే కావడం వల్ల రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు సులభంగా దీనిని కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నారు.

పనితీరుకు వస్తే, హోండా అందించిన 98.98cc పెట్రోల్ ఇంజిన్ నగర రైడింగ్‌కి కావాల్సిన శక్తిని సమతూకంగా అందిస్తుంది. దీని 4-స్పీడ్ గేర్‌బాక్స్ స్మూత్‌గా పనిచేసి రైడర్‌కి ఎలాంటి జర్క్‌లు లేకుండా సులువైన రైడింగ్ అనుభవం ఇస్తుంది. ఫ్యూయల్ ఎఫిషియెన్సీ విషయంలో కూడా ఈ బైక్ తన మాట నిలబెట్టుకుంటూ 65 కిలోమీటర్లు/లీటర్ వరకు మైలేజ్ అందిస్తుంది.
Hero Splendor Plus: హీరో స్ప్లెండర్ ప్లస్ భారత రోడ్లపై దశాబ్దాలుగా పరుగులు తీస్తూ సామాన్య ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కమ్యూటర్ బైక్. విశ్వసనీయత, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అద్భుతమైన మైలేజీ, ఈ మూడు స్ప్లెండర్‌ను ఎప్పటిలాగే టాప్ సెల్లర్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం దీని ధర రూ. 73,902 నుండి రూ. 76,437 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

Hero HF Deluxe: హీరో HF డీలక్స్ భారతీయ రోజువారీ ప్రయాణాలకు అత్యంత నమ్మదగిన, అందుబాటు ధరలో లభించే బైక్‌లలో ఒకటి. దీని ధర రూ. 55,992 నుండి రూ. 68,485 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండడం వల్ల బడ్జెట్‌ను దాటి కాకుండా మంచి పనితీరుతో కూడిన కమ్యూటర్ బైక్ కావాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది. ఇది 97.2cc పెట్రోల్ ఇంజిన్‌తో లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








