330 కి.మీ మైలేజ్ బైక్.. రూ.90 వేలకే! ఆఫీసుకు వెళ్లే ప్రతి ఒక్కరికి సరిపడే బైక్
ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైకుగా బజాజ్ ఫ్రీడమ్ 125 (bajaj Freedom 125) ఆటోమొబైల్ రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును సాధించింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల మధ్య, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే బైకుల కోసం చూస్తున్న వారికి ఇది నిజంగా పరిష్కారంగా నిలుస్తోంది. పర్యావరణానికి మేలు చేస్తూనే, ఖర్చులను తగ్గించే ఈ బైక్, కొత్తగా టూవీలర్ కావాలనుకునే వారికి ఎంతో డబ్బును ఆదా చేయగలదు. బజాజ్ ఫ్రీడమ్ 125 డిజైన్ విషయానికి వస్తే, ఇది లేటెస్ట్ లుక్‌తో పాటు ప్రాక్టికల్ యూజ్‌ఫుల్ ఫీచర్లతో వస్తోంది. బలమైన బాడీ స్ట్రక్చర్, కంఫర్టబుల్ సీటింగ్, డైలీ కమ్యూట్‌కి అనువైన రైడింగ్ పొజిషన్ వంటి ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి. కేవలం స్టైలిష్ లుక్ మాత్రమే కాకుండా, ఉపయోగకరమైన అంశాలు కూడా ఇందులో ప్రధాన ఆకర్షగణ.
పనితీరు పరంగా కూడా ఈ బైక్ సగటు వినియోగదారుని పూర్తిగా సంతృప్తి పరచగలదు. CNG, పెట్రోల్ రెండింటిపై నడిచే డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్ ఉండటం వలన, అవసరానికి తగ్గట్టుగా ఇంధనాన్ని ఎంచుకోవచ్చు. ఇది కేవలం ఖర్చు తగ్గించడమే కాకుండా, పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ధర విషయంలో కూడా బజాజ్ ఫ్రీడమ్ 125 మధ్యతరగతి వినియోగదారుల కోసం పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

దీని ప్రారంభ వేరియంట్ ధర రూ.90,976 (ఎక్స్-షోరూమ్)గా ఉండగా, టాప్ వేరియంట్ రూ.1.11 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. ఈ ధర రేంజ్‌లో అందించే ఫీచర్లు, మైలేజ్ మరియు పనితీరు నిజంగా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. రోజువారీ ఆఫీస్ ప్రయాణం, పట్టణంలో చిన్న దూర ప్రయాణాలు, ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి బజాజ్ ఫ్రీడమ్ 125 ఒక ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.
ఫ్రీడమ్ 125 తన క్లాస్‌లో శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో 124.58cc, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్/CNG ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజిన్ 8000 rpm వద్ద గరిష్టంగా 9.5 bhp శక్తిని, 5000 rpm వద్ద 9.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది, దీని వలన గేర్ మార్పులు సాఫీగా, సులభంగా ఉంటాయి. మైలేజ్ పరంగా ఇది గేమ్‌ఛేంజర్ బైక్.

పెట్రోల్, CNG రెండింటితోనూ నడిచే ఈ బైక్ ఒక్కసారి పూర్తిగా ట్యాంక్ నింపితే 330 కి.మీ.ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని వలన రోజువారీ ప్రయాణాల్లో పెట్రోల్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది సిటీ రైడింగ్‌కి సరిపడేలా రూపొందించబడింది. గరిష్ట వేగం గంటకు 90 కి.మీ.లు ఉండగా, కేవలం 7.85 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ.ల వేగం అందుకోవడం దీని ప్రత్యేకతను చూపిస్తుంది.
కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 పలు ఫీచర్స్‌ను కలిగి ఉంది. దీని పూర్తి LCD ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనిలో స్పీడ్, రియల్-టైమ్ మైలేజ్, గేర్ పొజిషన్ వంటి ముఖ్యమైన సమాచారం స్పష్టంగా చూపబడుతుంది, ఇది రైడర్‌కు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్ల పరంగా కూడా ఈ బైక్ ఆధునిక టచ్‌ను కలిగి ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ సౌకర్యం ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో సులభంగా కనెక్ట్ కావచ్చు.

అంతేకాదు, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అందుబాటులో ఉండటం వలన, ప్రయాణం మధ్యలో ఫోన్ బ్యాటరీ గురించి ఆందోళన అవసరం ఉండదు. భద్రతా పరంగా కూడా బజాజ్ ఫ్రీడమ్ 125 ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రైడర్‌కు స్థిరమైన, సురక్షితమైన రైడింగ్ అనుభవం ఇవ్వడానికి ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక లింక్డ్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను అందించింది. రోడ్డు పరిస్థితులు ఏవైనా గరిష్ట స్థిరత్వాన్ని అందించేలా ఈ సస్పెన్షన్ వ్యవస్థ రూపొందించబడింది.


Click it and Unblock the Notifications








