రూ.65 వేలకే 90 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్! కేవలం 100 కొట్టిస్తే చాలు.. రోజూ ఆఫీసు వెళ్లేవారికి బెస్ట్

బజాజ్ ప్లాటినా (Bajaj Platina) 2006లో మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, మార్కెట్లో తన ప్రత్యేక స్థానం నిలబెట్టుకుంటోంది. ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్లే వారైనా, కాలేజీకి వెళ్లే స్టూడెంట్ అయినా, లేదా చిన్న వ్యాపారం చూసుకునే వ్యక్తి అయినా, ప్లాటినా అందరికీ సులభంగా సరిపోయే, నమ్మకమైన ఆప్షన్‌గా మారింది. తక్కువ ధరలో అందుబాటులో ఉండటం, పెట్రోల్ ధరలు పెరిగినా భారం కాకుండా, 70 నుండి 90 కి.మీ. వరకు మైలేజ్ ఇవ్వగలగడం, ఈ బైక్ నిజమైన బలం. డైలీ రైడ్ కోసం అవసరమయ్యే సమర్థత, ఇంధన సామర్థ్యం, తక్కువ ఖర్చులు ప్లాటినాకు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. మారుతున్న ట్రెండ్స్, పెరుగుతున్న పోటీ మధ్య కూడా, ప్లాటినా తన క్రేజ్‌ను కోల్పోలేదు.

దాని సింప్లిసిటీ విత్ యూజ్‌ఫుల్ ఫీచర్స్, సులభమైన రైడింగ్ అనుభవం, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, యువత, ఉద్యోగులు, వ్యాపార వ్యాపారస్తులకు ప్లాటినా బాగా ఉపయోగపడుతుంది. తాజాగా జీఎస్టీ 2.0 అమల్లోకి రావడంతో వాహనాల ధరలు చాలా వరకు తగ్గాయి. దాంతో కొత్తగా బైకులు కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ పండుగ టైంలో కొత్త బైకు కొనాలని ఆలోచనలో ఉన్నవారికి బజాజ్ ప్లాటినా బెస్ట్ ఆప్షన్‌గా ఉంది.

India Best Mileage Bike Bajaj Platina Price Engine And All Top Things Details

సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి రావడంతో, బజాజ్ ప్లాటినా ధరల్లో తగ్గింపు వచ్చింది. ఇప్పుడు ఈ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. సింపుల్, నమ్మకమైన ప్లాటినా 100 ఎక్స్-షోరూమ్ ధర రూ.65,437 వద్ద లభిస్తే, మరింత శక్తివంతమైన ప్లాటినా 110 మాత్రం రూ.69,212 వద్ద కొనుగోలు చేయవచ్చు. డిజైన్ పరంగా ప్లాటినా చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ ఈ సింప్లిసిటీ, రైడింగ్‌లో అద్భుతమైన కంఫర్ట్‌ను ఇస్తుంది.

ప్లాటినా 100, ప్లాటినా 110 రెండు వేరియంట్లు ఆదరణ పొందుతున్నాయి. ప్లాటినా 100లో 102 సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ DTS-i ఇంజిన్ అమర్చారు. దీని ప్రత్యేకతే మైలేజ్. రోడ్డు పరిస్థితులను బట్టి లీటర్ పెట్రోల్‌తో సగటున 70 కి.మీ. నుండి గరిష్టంగా 90 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను ఫుల్ చేస్తే, 700 నుండి 800 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.

India Best Mileage Bike Bajaj Platina Price Engine And All Top Things Details

రోజువారీ ప్రయాణాల్లో భరోసా ఇస్తుంది. డిజైన్ విషయానికి వస్తే, ప్లాటినా 100 ఎంత సింపుల్‌గా కనిపించినా, అందులోని ఫీచర్లు రైడర్‌కి అవసరమైన సౌకర్యాలన్నీ ఇస్తాయి. ముందుభాగంలో హాలోజన్ హెడ్‌లైట్, LED డే టైమ్ రన్నింగ్ లైట్లు రాత్రివేళల్లో స్పష్టమైన లైటింగ్ ఇవ్వడమే కాకుండా, పగటిపూట రైడ్‌లోనూ అదనపు భద్రత కల్పిస్తాయి. అంతేకాదు, ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే USB ఛార్జింగ్ పోర్ట్ ప్లాటినాలో ఉండటం ఒక పెద్ద ప్లస్ పాయింట్.

మొబైల్ ఫోన్ ఛార్జ్ కోసం ఎక్కడైనా ఆగాల్సిన అవసరం లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చు. ఇక ప్లాటినా 110 విషయానికి వస్తే, ఇది మరింత శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుంది. 115.45 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ దీనికి అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 8.6 bhp పవర్‌ను 7000 rpm వద్ద, 9.81 Nm టార్క్‌ను 5000 rpm వద్ద అందిస్తుంది.

India Best Mileage Bike Bajaj Platina Price Engine And All Top Things Details

5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన ఈ ఇంజిన్ సిటీ రైడింగ్‌కే కాకుండా హైవే ట్రిప్స్‌కి కూడా సరిపోయేంత స్మూత్‌గా పనిచేస్తుంది. తక్కువ వైబ్రేషన్స్, స్మూత్ గేర్ షిఫ్ట్స్, దీర్ఘకాలిక నమ్మకమైన పనితీరు ఇవన్నీ ప్లాటినా 110ని మరింత ప్రాక్టికల్ ఆప్షన్‌గా నిలబెడతాయి. చివరగా చెప్పాలంటే, ప్లాటినా 100 తన అద్భుతమైన మైలేజ్‌తో ఆకట్టుకుంటే, ప్లాటినా 110 అదనపు పవర్, స్మూత్ పెర్ఫార్మెన్స్‌తో రైడర్లను మెప్పిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 25, 2025, 9:30 [IST]
English summary
India best mileage bike bajaj platina price engine and all top things details
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+