రూ.70 వేలకే 90 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్.. ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 850 కి.మీల పైనే!

రోజువారీ జీవితంలో బైకులు మనకు ఒక భాగంలా మారిపోయాయి. ఉద్యోగానికి, పిల్లలను స్కూల్‌కి, షాపింగ్‌కి, లేదా చిన్న చిన్న పనులు చేసుకోవాలి అంటే బైక్ లేకుండా ఊహించలేం. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లోనూ, రోడ్లు చిన్నగా ఉండే పట్టణాల్లోనూ బైకే సులభమైన పరిష్కారం. బైక్‌లకు మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇవి అద్భుతమైన మైలేజ్ ఇస్తాయి. ఒక లీటర్ పెట్రోల్‌లో 60 నుండి 70 కిలోమీటర్ల వరకు వెళ్లగలిగే బైకులు మార్కెట్లో ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతున్న ఈ కాలంలో, ఇంత మైలేజ్ ఇవ్వడం వినియోగదారులకు చాలా పెద్ద ప్రయోజనం. అలాగే, బైకులు పెర్ఫామెన్స్ పరంగా కూడా నమ్మకంగా ఉంటాయి. చిన్న ఇంజిన్ బైకులైనా, సిటీ ట్రాఫిక్‌లో చక్కగా పరిగెడతాయి. పెద్ద ఇంజిన్ బైకులు అయితే హైవేలపై స్పీడ్, స్టాబిలిటీ ఇవ్వగలవు. దీని వల్ల యంగ్ జనరేషన్ కూడా బైకులపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది.

ఇవన్నీ కాకుండా, బైకుల ధర కూడా చాలా అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ లెవల్ బైకులు రూ.70,000-80,000 మధ్యలోనే లభిస్తుండగా, ప్రీమియం మోడల్స్ కూడా తక్కువ ధరలో వస్తున్నాయి. EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండటంతో, బైక్ కొనుగోలు చేయడం సాధారణ కుటుంబానికి కూడా పెద్ద సమస్య కాదు. అయితే కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి బాగా సెట్ అయ్యే బజాజ్ ప్లాటినా గురించి ఈ కథణంలో చూద్దాం.

India Best Mileage Bike Bajaj Platina Price Engine And Design Details

కొత్త బజాజ్ ప్లాటినా 100 బైక్ ఇప్పుడు చాలా ఆఫర్‌లో ఉంది. ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 70,611 మాత్రమే, ఇది ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలకు కూడా సులభంగా పొందగల బైక్‌గా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం టూవీలర్స్‌పై GST రేటును 28% నుండి 18% కి తగ్గించడమే ఈ బైక్ ధరపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. సెప్టెంబర్ 22 నుండి ఈ సవరించిన రేట్లు అమల్లోకి రానున్నాయి.

జీఎస్టీ సవరణతో ప్లాటినా 100 ధర మరింత తగ్గనుంది. ప్లాటినా 100 ప్రత్యేకతలు గణించాలి అంటే, ఇది అద్భుతమైన మైలేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బైక్ 75 నుండి 90 కి.మీ మైలేజీ ఇవ్వగలదు. ఈ మైలేజీ భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా, రోజువారీ ప్రయాణాలకు చక్కగా సరిపోతుంది. 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 850 కి.మీల పైనే ప్రయాణిస్తుంది.

India Best Mileage Bike Bajaj Platina Price Engine And Design Details

పర్ఫామెన్స్ పరంగా కూడా ప్లాటినా 100 ప్రత్యేకం. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. ఇది కేవలం 9 సెకన్లలో 0 నుండి 60 కి.మీ వేగంను అందుకుంటుంది. సిటీ ట్రాఫిక్‌లోనూ, చిన్న దూర ప్రయాణాల్లోనూ బైక్ బాగా ఉపయోగపడుతుంది. బజాజ్ ప్లాటినా 100 కేవలం తక్కువ ధరలో అందుబాటులో ఉండటం మాత్రమే కాదు, తన శక్తివంతమైన పవర్‌ట్రెయిన్, లేటెస్ట్ ఫీచర్లతో కూడా వినియోగదారులను ఆకర్షిస్తోంది.

ఇందులో ఇచ్చిన 102 సిసి పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 7.9 bhp శక్తిని(7500 rpm వద్ద), 8.34 Nm పీక్ టార్క్‌ను(5500 rpm వద్ద) ఉత్పత్తి చేస్తుంది. దీని శక్తిని సమర్థవంతంగా రోడ్డు మీదకు తీసుకురావడానికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. డిజైన్ విషయానికి వస్తే, ప్లాటినా 100 సింపుల్‌గా ఉన్నా స్టైలిష్ లుక్‌ను కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్, LED DRLలు, టెయిల్ ల్యాంప్ దీన్ని మరింత మోడర్న్‌గా నిలబెడతాయి.

India Best Mileage Bike Bajaj Platina Price Engine And Design Details

More from DriveSpark

Article Published On: Thursday, September 11, 2025, 16:40 [IST]
English summary
India best mileage bike bajaj platina price engine and design details
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+