రూ.100 పెట్రోల్ కొట్టిస్తే చాలు.. రోజువారీ ప్రయాణాలకు బెస్ట్, మార్కెట్లో రూ.88 వేలకు దొరుకుతుంది

భారతదేశంలో టూవీలర్ మార్కెట్‌కి ఎప్పటికీ ఒక స్థిరమైన డిమాండ్ ఉంటుంది, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సులభంగా ఉపయోగించుకునే, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను జనాలు బాగా ఇష్టపడుతుంటారు. ఈ తరహా బైకులు కేవలం రవాణా అవసరాలకే కాదు, కుటుంబం, ఉద్యోగం, వ్యవసాయ పనులు వంటి అనేక రోజువారి పనుల్లో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ కాలంలో, తక్కువ ఫ్యూయల్ వినియోగంతో ఎక్కువ ప్రయాణం చేయగలిగే బైక్‌లు అందరికి బాగా నచ్చుతాయి. ఈ నేపథ్యంలోనే హీరో మోటోకార్ప్ అందించిన సూపర్ స్ప్లెండర్ XTEC మోడల్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది సాధారణ మోటార్‌సైకిల్ మాత్రమే కాదు, ఆధునిక సాంకేతికతను గ్రామీణ రోడ్లపై కూడా నమ్మకంగా నడిచేలా రూపొందించిన మోడల్.

సూపర్ స్ప్లెండర్ XTEC దాని ఇంజిన్ మైలేజ్, పనితీరుతో రోజువారీ ప్రయాణాల కోసం ఒక ఉత్తమ ఎంపికగా నిలబెట్టింది. హీరో సూపర్ స్ప్లెండర్ XTEC ధర పరంగా ఎక్స్-షోరూమ్ ధర కనిష్టంగా సుమారు రూ.88 వేల నుంచి రూ.92 వేల వరకు ఉంది. కస్టమర్ల అవసరాలను బట్టి, డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది, అందువల్ల భద్రత, పనితీరులో వినియోగదారులు తమకు నచ్చిన ఎంపికను చేసుకోవచ్చు.

India Best Mileage Bike Hero Super Splendor Xtec Price

పనితీరు పరంగా, శక్తివంతమైన 124.7 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.72 పీఎస్ హార్స్‌పవర్‌ను, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 న్యూటన్ మీటర్ల పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. శక్తిని సమర్థవంతంగా రోడ్డు మీదికి తీసుకురావడానికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ పనిచేస్తుంది. సరైన డ్రైవింగ్ పరిస్థితుల్లో, లీటరుకు 69 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. రూ.100 పెట్రోల్ కొట్టించిన రోజు తిరగడానికి సరిపోద్ది.

ప్రధానంగా తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో సూపర్ స్ప్లెండర్ XTEC, ఎక్కువ దూరం ప్రయాణించాలని ఆశించే వారి కోసం ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇది 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంది. దీంతో రోజువారి ప్రయాణాలతో పాటు, ఎక్కువ దూరం ప్రయాణించిన అదేపనిగా పెట్రోల్ నింపాల్సిన అవపరం కూడా లేదు. ఇది రైడర్లకు అవసరమయ్యే అనేక ఫీచర్స్‌ను కలిగి ఉంది.

Best Mileage Bike Hero Super Splendor Xtec

హీరో సూపర్ స్ప్లెండర్ XTEC రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా చూపించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయం ఉండటం వలన మొబైల్ ఫోన్‌తో సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. రోజువారీ ప్రయాణాల్లో పెట్రోల్ ఆదా చేయడానికి ఐడిల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ ఉపయోగపడుతుండగా, సేఫ్టీ కోసం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ఇంజిన్-కిల్ స్విచ్ వంటి ఫీచర్లు అమర్చబడ్డాయి.

డిజైన్ విషయానికి వస్తే, ఇది మరింత ఆధునికంగా, స్టైలిష్‌గా ఉంటుంది. ముందుభాగంలో అమర్చిన LED హెడ్‌ల్యాంప్ రాత్రి సమయంలో అద్భుతమైన లైటింగ్‌ను అందించడమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ LED DRL దీన్ని మరింత స్పోర్టీ లుక్‌లో చూపిస్తుంది. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ బైక్‌కి రోడ్ ప్రెజెన్స్‌ను పెంచడమే కాకుండా, దాని మొత్తం డిజైన్‌కి ఒక ప్రీమియమ్ టచ్‌ను ఇస్తాయి.

India Best Mileage Bike Hero Super Splendor Xtec

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 8, 2025, 9:30 [IST]
English summary
India best mileage bike hero super splendor xtec price and all top things
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+