ఒక లీటర్ పెట్రోల్‌తో 70 కిలోమీటర్లు..! రోజూ ఆఫీస్ వెళ్లే వాళ్లకు పర్ఫెక్ట్ బైకులు ఇవే!

భారత మార్కెట్లో బైక్ కొనాలనుకునే వారు ఎక్కువగా చూసే అంశం, ధర తక్కువగా ఉండాలి, మైలేజ్ ఎక్కువగా రావాలి. ఎందుకంటే మన దేశంలో బైక్ అనేది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, ప్రతిరోజూ ఉద్యోగానికి, చదువుకు, ఇంటి పనులకు వెళ్లే వారికి జీవిత భాగస్వామిలాంటిది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే బైక్‌నే ఎక్కువ మంది కోరుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ ఫ్రీడమ్ 125, హీరో HF 100, హోండా షైన్ 100 ల బెస్ట్. ఇవి తక్కువ సర్వీస్ ఖర్చు, చవకైన మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ సులభంగా దొరకడం వంటి కారణాల వల్ల ప్రజల మనసును గెలుచుకున్నాయి. ఈ పండుగ సమయంలో కొత్త బైక్ కొనే వారికి వీటి గురించిన వివరాలు ఈ కథనంలో చూద్దాం.

Hero HF 100: హీరో HF 100 బైక్ భారతదేశంలో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మోడల్‌. ఇది ప్రత్యేకంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణాలు చేసే వారికి సరిగ్గా సరిపోయే బైక్‌గా నిలుస్తుంది. సింపుల్‌గా కనిపించినప్పటికీ దృఢమైన పనితీరు, నమ్మకమైన మైలేజ్‌తో ఆకట్టుకుంటుంది. దీని ధర కేవలం రూ. 48,857 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్ బైక్ కావాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక.

India Best Mileage Bikes Hero Hf 100 Honda Shine 100 Bajaj Freedom 125 Details

ఇది 97.2 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది సుమారు 8 bhp పవర్‌ను, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా దీని మైలేజ్ ప్రధాన హైలైట్, సాధారణ పరిస్థితుల్లో ఇది 70 kmpl వరకు మైలేజ్ అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కిక్ స్టార్టర్, ఇంజిన్ కట్-ఆఫ్ విత్ సైడ్ స్టాండ్ అలర్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

Bajaj Freedom 125: బజాజ్ ఫ్రీడమ్ 125 భారత మార్కెట్లో విప్లవాత్మక బైక్‌. ఇది దేశంలోని మొదటి CNG ఆధారిత మోటార్‌సైకిల్, అంటే ఇంధన వ్యయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఇది నిజమైన గేమ్ ఛేంజర్. తక్కువ ఖర్చు, ఆధునిక డిజైన్, పర్యావరణానికి అనుకూలమైన టెక్నాలజీ. ఈ మూడు లక్షణాలతో ఇది బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఈ బైక్ ధర రూ. 90,976 నుండి రూ. 1.07 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

India Best Mileage Bikes Hero Hf 100 Honda Shine 100 Bajaj Freedom 125 Details

ఇంజిన్ విషయానికి వస్తే, బజాజ్ ఫ్రీడమ్ 125లో 124.58 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ + CNG డ్యూయల్ ఫ్యూయల్ ఇంజిన్ అమర్చబడింది. అంటే రైడర్ తన అవసరానికి అనుగుణంగా పెట్రోల్ లేదా సిఎన్‌జి రెండింటిలో ఏదైనా ఉపయోగించవచ్చు. దీని ద్వారా ఫుల్ ట్యాంక్‌లో సుమారు 330 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందుతుంది, ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ మైలేజ్ రేంజ్‌లలో ఒకటి.

Honda Shine 100: హోండా షైన్ 100 ప్రస్తుతం భారతదేశంలోని తక్కువ ధరలో లభించే, ఎక్కువ మైలేజ్ ఇచ్చే మోటార్‌సైకిళ్లలో ప్రముఖ స్థానం దక్కించుకుంది. దీని ధర రూ. 63,191 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. ఇంజిన్ విషయానికి వస్తే, హోండా షైన్ 100లో 98.98 సీసీ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది. ఇది సుమారు 7.38 bhp పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

India Best Mileage Bikes Hero Hf 100 Honda Shine 100 Bajaj Freedom 125 Details

ఇది సుమారు 65 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుంది. ఫీచర్ల పరంగా కూడా హోండా షైన్ 100 సాదాసీదాగా కనిపించినప్పటికీ, అనేక ఉపయోగకరమైన ఫీచర్లు కలిగి ఉంది. ఇందులో ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సైడ్-స్టాండ్ సెన్సార్, సింగిల్-పీస్ కంఫర్టబుల్ సీటు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫీచర్లు ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 21, 2025, 18:18 [IST]
English summary
India best mileage bikes hero hf 100 honda shine 100 bajaj freedom 125 details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+