రోజూ ఉపయోగించే వారికి బెస్ట్ మైలేజ్ బైక్స్.. లీటరుకి 70కి.మీలు! గ్రామాలకైనా, పట్టణాలకైనా బెస్ట్
దేశంలో ప్రస్తుతం టూవీలర్ వాడకం చాలా ఎక్కువ అయింది. ఏ అవసరానికి బయటికి వెళ్లిన సరే టూవీలర్ లేకుండా వెళ్లలేము. ఒక గ్రామమైనా కావొచ్చు, ఒక బిజీ నగరమైనా కావొచ్చు.. రోజువారీ ప్రయాణాలకు టూవీలర్ ఒక మిత్రుడిగా మారిపోయింది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఎక్కువ మంది తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ మైలేజ్ ఇవ్వగల బైక్‌ల వైపు ఆశగా చూస్తున్నారు. పనికి మేలు, మైలేజ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కొన్ని మోడల్స్‌ను మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి నగర రోడ్లతో పాటు గ్రామాల్లో కూడా ప్రయాణించడానికి చాలా అనువుగా ఉంటాయి. ఇందులో TVS రేడియన్, హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా 110, హోండా SP 125, వంటి పలు బైక్‌లు బెస్ట్ ఎంపికగా నిలుస్తున్నాయి. మరి, ఈ బైక్‌ల ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
హీరో స్ప్లెండర్ ప్లస్: ఈ పేరు వినగానేనే ఎంతోకాలంగా భారతీయ రోడ్లపై విశ్వసనీయతకు నిలువెత్తు రూపంగా మారిన బైక్ గుర్తుకొస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల మార్గాలపై అయినా, పట్టణాల్లోని ట్రాఫిక్‌లో అయినా ఈ బైక్ అందరికీ సరిపడే సహాయకుడు.దీని ధర రూ.77,000 నుంచి రూ.79,000 (ఎక్స్-షోరూమ్) మధ్యగా ఉండటం వల్ల, ఇది మధ్యతరగతి వినియోగదారుల వాహన కలను తీరుస్తుంది.

సింపుల్ డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చు, దాదాపు లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీ ఇవన్నీ కలిపి ఈ బైక్‌ను ఒక హిట్ మోడల్‌గా నిలబెట్టాయి. ఇది కాలానుగుణంగా మారుతోంది. అందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. పని కోసం, ప్రయాణం కోసం, లేదా రోజూ స్కూల్, ఆఫీసుకు వెళ్లేందుకు అయినా స్ప్లెండర్ ప్లస్ ఓ మంచి బైకుగా నిలుస్తుంది.
TVS రేడియన్: ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు తక్కువ ధరలో అధిక మైలేజీ ఇవ్వగల బైక్‌గా టీవీఎస్ రేడియన్ నిలిచింది. ఈ బైక్ ధర రూ. 59,000 నుండి రూ. 83,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 109.7 cc సామర్థ్యం కలిగిన పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

TVS రేడియన్ దాదాపు 73 కి.మీ. వరకు లీటరుకు మైలేజీ ఇవ్వగలగడం దీని ప్రధాన ఆకర్షణ. దీనిలో డ్యూయల్ పాడ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సాహసోపేతమైన బిల్డ్ క్వాలిటీ, పటిష్టమైన బ్రేకింగ్ సిస్టం వంటి పలు ఇతర ఆకట్టుకునే ఉపయోగకరమైన ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇది గ్రామీణ మార్గాలకైనా, పట్టణ ట్రాఫిక్‌కి తట్టుకునేలా తయారు చేయబడి ఉంది. అందువల్ల, తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక ప్రయోజనం అందించే బైక్ కావాలనుకునేవారికి టీవీఎస్ రేడియన్ ఓ మంచి ఎంపిక. వినియోగదారుడికి అవసరమైన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని దీనిలో లేటెస్ట్ ఫీచర్స్ చాలా ఇచ్చారు. డిజైన్ చాలా వరకు కొత్తగా అనిపిస్తుంది. ఇతర మోడళ్లకు భిన్నంగా ఇది ఆకట్టుకుంటుంది.

బజాజ్ ప్లాటినా 110: "సామాన్యుల బండి" అని పిలవడం ప్లాటినా 110కి ఎంతగానో సరిపోతుంది. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ వేలాదిమంది ఈ బైక్‌పై నిత్యం నడుస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందాలనుకునే వారు ఈ బైక్‌ను పెద్ద ఎత్తున ఎన్నుకుంటున్నారు. ఈ మోడల్ ధర రూ.71,000 నుండి రూ.74,000 వరకు (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. దీనిలో 115 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉండటంతో ప్రయాణాల్లో తేలికగా ఉంటుంది.
హోండా SP 125: ఇది ఒక ప్రసిద్ధ బైక్, దీని ధర రూ. 92,000 నుండి రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్). ఇది 123 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. లీటర్ పెట్రోల్‌కు దాదాపు 60 కి.మీ. వరకు మైలేజీని అందిస్తుంది. ఇది డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సైలెంట్ స్టార్టర్‌తో సహా వివిధ అంశాలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








