ఇండియా బెస్ట్ స్కూటర్ ఇదే! లీటర్‌కు 55 కి.మీ మైలేజ్..రూ.80 వేలే.. పదేళ్ల పాటు ఎలాంటి టెన్షన్ లేదు

రోజూ ఆఫీసుకెళ్లే ఉద్యోగి కావొచ్చు, కుటుంబ అవసరాల కోసం స్కూటర్‌ చూడే గృహిణి కావొచ్చు, హోండా యాక్టివా (Honda Activa) అందరికీ సరిపోయేలా రూపొందించబడింది. 2001లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ స్కూటర్, అప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది మంది నమ్మకాన్ని గెలుచుకుంటూ, నంబర్ వన్ స్థానం దక్కించుకుంది. భారత స్కూటర్ మార్కెట్‌లో యాక్టివా పేరు చెబితే, ప్రతి ఇంటి ముందుకొచ్చే వాహనం ఇదే. అందరికీ సులభంగా నడపగలిగే డిజైన్, బలమైన, నమ్మకమైన ఇంజిన్, తక్కువ నిర్వహణ ఖర్చులు.. ఇవన్నీ కలిపి దీన్ని ప్రత్యేకం చేశాయి. పల్లెలోనూ, పట్టణంలోనూ సమానంగా కనిపించే ఈ స్కూటర్‌ సాధారణ ప్రయాణ సాధనాన్ని మించి, జీవనశైలిలో భాగమైంది. ప్రారంభంలో సాధారణ మోడల్‌గా వచ్చిన యాక్టివా, ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కాలానుగుణ మార్పులు పొందుతూ ముందుకు సాగింది.

డిజైన్‌లో మార్పులు, కొత్త సాంకేతికతలు, మెరుగైన ఫీచర్లు.. ఇలా ప్రతి కొత్త వెర్షన్‌లో మరింత వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు రూపాంతరం చెందుతూ ఎప్పుడూ సమయానుకూలంగా మారింది. అందుకే ఇన్నాళ్లుగానూ హోండా యాక్టివా స్కూటర్‌ అనగానే నమ్మకానికి, సౌకర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో యాక్టివా 110, 125 సీసీ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ మోడల్ అయిన యాక్టివా-ఇ కూడా ఈ మధ్య లాంచ్ అయింది.

India Best Scooter Honda Activa Variants In India Price Mileage And All Top Things

కొత్తగా స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి హోండా యాక్టివా 110 నిజంగా సరైన ఎంపికగా నిలుస్తుంది. ఇందులో అమర్చిన 109.51 సిసి సామర్థ్యం గల ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తాజా OBD-2B ఎమిషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది 7.9 bhp పవర్‌ను, 9.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. శక్తి, పనితీరు పరంగా ఈ ఇంజిన్ తన కేటగిరీలో విశ్వసనీయంగా నిలుస్తుంది.

రోడ్డుపై సాఫీగా నడవడం, సిటీ ట్రాఫిక్‌లో ఈజీ హ్యాండ్లింగ్ ఇవ్వడం దీని హైలైట్స్. అంతేకాదు, లీటరుకు 50 నుండి 55 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలిగే సామర్థ్యం ఉండటం దీన్ని మరింత బెస్ట్‌గా మారుస్తుంది. ధర విషయానికొస్తే, ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.81,000గా నిర్ణయించారు. సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు కలిపి యాక్టివా 110ని కొత్త కొనుగోలు దారుల కోసం మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాయి.

India Best Scooter Honda Activa Variants In India Price Mileage And All Top Things

మరింత శక్తివంతమైన రైడింగ్ అనుభవం కోరుకునే వారికి హోండా యాక్టివా 125 అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. రోజువారీ ప్రయాణాలు మాత్రమే కాకుండా, లాంగ్ డ్రైవ్స్‌కి కూడా తగిన శక్తి, సౌకర్యం కలిగిన స్కూటర్ కావాలనుకుంటే ఇది సరైన ఆప్షన్. హోండా యాక్టివా 125లో 123.92 సిసి సామర్థ్యం గల ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. తాజా ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండటమే కాకుండా, సాఫీగా నడిచే పనితీరు అందిస్తుంది.

ఈ ఇంజిన్ 8.4 bhp శక్తిని, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. శక్తి పరంగా చూస్తే సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవే రైడ్‌లలోనూ తగినంత బలాన్ని అందిస్తుంది. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగం చేరుకోగలగడం దీని సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. మైలేజీ పరంగా సుమారు 47 కిలోమీటర్ల లీటరుకు అందించడం దీన్ని ఆర్థికంగా కూడా ఆకర్షణీయంగా మారుస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.94,000 నుంచి రూ.97,000 వరకు ఉంటుంది.

India Best Scooter Honda Activa Variants In India Price Mileage And All Top Things

ఫీచర్ల విషయానికి వస్తే, LED హెడ్‌ల్యాంప్, డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ కీ సిస్టమ్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. డిజైన్ పరంగా కూడా యాక్టివా 125 మరింత స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. యాక్టివా E కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.1.17 లక్షల నుండి రూ.1.52 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్‌తో 102 కి.మీ. ప్రయాణించగలదు.

More from DriveSpark

Article Published On: Sunday, August 24, 2025, 14:30 [IST]
English summary
India best scooter honda activa variants in india price mileage and all top things
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+