స్కూటర్ల రేట్లు రూ.5,000-రూ.7,000 తగ్గాయ్! యాక్టివా, జూపిటర్.. టాప్ స్కూటర్లపై లుక్కేయండి

భారతదేశంలో స్కూటర్లకు ఉన్న డిమాండ్‌ ఎంతగానో ప్రత్యేకం. తక్కువ ఖర్చుతో అందరికి అందుబాటులో ఉండే ఈ వాహనాలు రోజువారీ జీవితంలో ఒక ప్రధాన భాగంగా మారిపోయాయి. ఉద్యోగాలకు వెళ్లడమో, షాపింగ్‌ చేయడమో, పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడమో ఏదైనా పని స్కూటర్‌తో సులభంగానే పూర్తి చేయవచ్చు. అందుకే పురుషులు, మహిళలు ఎవరైనా సౌకర్యంగా డ్రైవ్ చేయగలిగే వాహనాలుగా ఇవి ఎప్పటినుంచో ప్రాచుర్యం పొందాయి. ఇకపై ఈ స్కూటర్లకు మరింత డిమాండ్‌ పెరగడానికి మరో కీలక కారణం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిఎస్‌టి విధానం ప్రకారం, ఇప్పటివరకు 28 శాతం పన్ను కిందకి వచ్చే అనేక వాహనాలపై రేటు 18 శాతానికి తగ్గించబడింది. ఈ కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

దీని ఫలితంగా, భారతీయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్‌ ఉన్న టాప్ కంపెనీల స్కూటర్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటివరకు ధరల కారణంగా కొంతమంది కొనలేకపోయినా, రాబోయే రోజుల్లో పేద, మధ్యతరగతి వినియోగదారులకు స్కూటర్లు మరింత అందుబాటులోకి రానున్నాయి. స్కూటర్ మార్కెట్‌లో ఈ మార్పు పెద్ద ఎత్తున ప్రభావం చూపనుంది. కొత్త ధరలతో అందుబాటులో ఉండబోతున్న టాప్ స్కూటర్ల గురించి ఈ కథనంలో చూద్దాం.

India Best Top 10 Scooters Prices Drop After Gst Reduction Details Inside

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్లలో 125cc మోడళ్లు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి. పనితీరుతో పాటు, మంచి మైలేజ్ కలిగిన వీటి డిమాండ్ ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. తాజాగా ప్రభుత్వం వాహనాలపై జిఎస్‌టి రేటును 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో, ఈ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. హోండా యాక్టివా 125 ప్రస్తుతం రూ.81,000 ధరకు లభిస్తుండగా, కొత్త పన్ను రేట్ల ప్రకారం ఇది రూ.74,250కు అందుబాటులోకి వస్తోంది.

అంటే వినియోగదారులు రూ.6,750 వరకు ఆదా చేసుకోగలరు. అదే విధంగా, టీవీఎస్ జూపిటర్ 125 ధర రూ.77,000 నుండి రూ.70,667కు తగ్గింది, తేడా రూ.6,333. సుజుకి యాక్సెస్ 125 కూడా తగ్గింపుతో మరింత అందుబాటులోకి వచ్చింది. ఇది రూ.79,500 నుండి రూ.72,889కు తగ్గి, మొత్తం రూ.6,611 తగ్గింది. స్టైలిష్ లుక్స్‌తో యువతలో ఆదరణ పొందిన టీవీఎస్ ఎన్టార్క్ 125 ధర కూడా భారీగా తగ్గింది.

India Best Top 10 Scooters Prices Drop After Gst Reduction Details Inside

పాత ధర రూ.85,000 కాగా, ఇప్పుడు ఇది రూ.77,778కే లభిస్తోంది. అంటే రూ.7,222 తగ్గింపు. అలాగే, సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 ధర రూ.82,000 నుండి రూ.75,556కు పడిపోగా, హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 రూ.76,500 నుండి రూ.70,111కు తగ్గింది. యమహా ఫాసినో 125 ధర రూ.76,000 నుండి రూ.70,667కు చేరింది. ఫ్యామిలీ వినియోగదారుల కోసం అనువైన హీరో డెస్టినీ స్కూటర్ రూ.74,500 నుండి రూ.69,111కు తగ్గింది.

ఇక ప్రీమియం లుక్స్, స్పోర్టీ డిజైన్‌తో ఆకర్షించే అప్రిలియా ఆర్ఎస్ ఆర్ 125 కూడా భారీ తగ్గింపుతో లభిస్తోంది. పాత ధర రూ.95,000 కాగా, ఇప్పుడు ఇది రూ.88,148కే దొరుకుతోంది. అంటే వినియోగదారులు రూ.6,852 వరకు ఆదా చేసుకోగలరు. మొత్తం మీద, జిఎస్‌టి తగ్గింపు ప్రభావంతో 125cc స్కూటర్లు అన్నీ గణనీయంగా తగ్గాయి. దీంతో పేద, మధ్య తరగతి వినియోగదారులకు ఇవి మరింత అందుబాటులోకి వచ్చాయి.

India Best Top 10 Scooters Prices Drop After Gst Reduction Details Inside

మోడల్ ప్రస్తుత ధర (రూ.) కొత్త ధర (రూ.) తేడా (రూ.)
యాక్టివా 125 81,000 74,250 6,750
జూపిటర్ 125 77,000 70,667 6,333
యాక్సెస్ 125 79,500 72,889 6,611
మాస్ట్రో ఎడ్జ్ 125 76,500 70,111 6,389
ఎన్‌టార్క్ 125 85,000 77,778 7,222
డుయో 125 72,000 65,778 6,222
బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 82,000 75,556 6,444
ఫాసినో 125 76,000 70,667 5,333
డెస్టినీ 125 74,500 69,111 5,389
అప్రిలియా SR 125 95,500 88,148 6,852

ఇప్పటివరకు 28 శాతం పన్ను విధించబడిన వాహనాలపై కేంద్ర ప్రభుత్వం రేటును 18 శాతానికి తగ్గించడంతో, ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా స్కూటర్ల విషయంలో, ఈ తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం 125సీసీ స్కూటర్ల ధరలు సగటున రూ.5,000 నుండి రూ.7,000 వరకు తగ్గాయి. ఈ స్థాయి తగ్గింపు వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 11, 2025, 11:44 [IST]
English summary
India best top 10 scooters prices drop after gst reduction details inside
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+