లీటర్ పెట్రోల్‌తో 90 కి.మీలు.. ఫుల్ ట్యాంక్‌తో 700 కి.మీ పైనే.. రూ.70 వేలకే అదిరిపోయే బైక్

బజాజ్ ప్లాటినా (Bajaj Platina) పేరు వినగానే మనసులోకి వచ్చే మొదటి విషయం తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్. 2006లో తొలిసారిగా మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ బైక్, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం చిన్న విషయం కాదు. మారుతున్న ట్రెండ్స్, పెరుగుతున్న పోటీ మధ్య ప్లాటినా ఎందుకు తనదైన క్రేజ్‌ను కొనసాగించగలుగుతోంది అంటే, దాని వెనుక ఉన్న ప్రధాన కారణం సింప్లిసిటీ విత్ యూజ్‌ఫుల్ ఫీచర్స్. ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్లే వారైనా, కాలేజీకి వెళ్లే స్టూడెంట్ అయినా, లేదా చిన్న వ్యాపారం చూసుకునే వ్యక్తి అయినా... ప్లాటినా అందరికీ సరిపోయే ఒక ఆప్షన్‌గా మారింది. తక్కువ ధరలో దొరకడం, పెట్రోల్ ధరలు ఎంత పెరిగినా భారం కాకుండా 70 నుండి 90 కి.మీ. పైగా మైలేజ్ ఇవ్వగలగడం దీని నిజమైన బలం.

డిజైన్ పరంగా ప్లాటినా చాలా సింపుల్‌గా ఉంటుంది, కానీ అదే సింప్లిసిటీ రైడింగ్‌లో కంఫర్ట్‌ని ఇస్తుంది. పొడవాటి సీటు, సాఫ్ట్ సస్పెన్షన్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కలిపి ఇది ఒక జనాలు మెచ్చిన బైక్ అనే పేరుకు తగినట్టే నిలుస్తాయి. ప్రస్తుతం ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. ప్లాటినా 100 ధర రూ.70,643 వద్ద అందుబాటులో ఉంటే, మరింత శక్తివంతమైన ప్లాటినా 110 మాత్రం రూ.74,694(ఎక్స్-షోరూమ్) ధరలో దొరుకుతుంది.

India Mileage King Bajaj Platina Price Engine And Features All Top Things

ఈ బైక్‌లో 102 సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ DTS-i ఇంజిన్‌ను అమర్చారు. ఇది డైలీ యూజ్ కోసం కావలసినంత పవర్‌ను ఇస్తూనే, ఫ్యూయల్ ఎఫిషియెన్సీని కాపాడుతుంది. ప్లాటినాను ఎక్కడ నడిపినా ప్రత్యేకతను చూపిస్తుంది. మెట్రో సిటీల్లో ట్రాఫిక్‌లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇది ఈజీగా రన్ అవుతుంది. గట్టి ట్రాఫిక్‌లో తిప్పుకోవడమో, గ్రామీణ రోడ్లలో గుంతలు ఎదుర్కోవడమో ఏదైనా అయినా... బైక్ డ్రైవ్ చేయడం సౌకర్యంగా అనిపిస్తుంది.

సీటు ఎత్తు 807 మిల్లీమీటర్లు మాత్రమే ఉండటంతో చిన్నవాళ్లు, పెద్దవాళ్లు కూడా కంఫర్ట్‌గా రైడ్ చేయగలరు. దానికి తోడు మొత్తం బైక్ బరువు 117 కిలోలే కాబట్టి, హ్యాండ్లింగ్ చాలా సులభంగా ఉంటుంది. ఒక చేతితోనూ తిప్పేయగలమనేంత లైట్ వెయిట్ ఫీల్ ఇస్తుంది. ఫీచర్లు వస్తే ప్లాటినా సింపుల్‌గా ఉండేంత మాత్రాన పాతదనంగా అనిపించదు. గేర్ పొజిషన్ ఇండికేటర్ వలన బైక్ నడిపే వారికి మరింత ఈజీగా, క్లియర్‌గా అనిపిస్తుంది.

India Mileage King Bajaj Platina Price Engine And Features All Top Things

ముందుభాగంలో హాలోజన్ హెడ్‌లైట్, ఆకర్షణీయంగా కనిపించే LED డే టైమ్ రన్నింగ్ లైట్లు ఉండటంతో రాత్రివేళల డ్రైవింగ్‌లోనూ, పగటి పూట రైడ్‌లోనూ అదనపు భద్రత కలుగుతుంది. రైడర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఇచ్చారు, అంటే మొబైల్ ఛార్జింగ్ కోసం ఎక్కడైనా ఆగాల్సిన అవసరం లేదు. అలాగే సింపుల్ డిజైన్‌తో పాటు ఈ చిన్న చిన్న సౌకర్యాలు కలిపి ప్లాటినాను ఒక ప్రాక్టికల్ బైక్‌గా నిలబెడతాయి.

ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు, ఫుల్ ట్యాంక్‌తో 700-800 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ (135 mm ట్రావెల్), వెనుక భాగంలో SNS సస్పెన్షన్(110 mm) లాంగ్ రైడ్స్‌లో కూడా కంఫర్ట్‌ ఇస్తుంది. ఈ అన్ని అంశాలను కలిపి చూస్తే, ప్లాటినా ఎందుకు మైలేజ్ కింగ్‌గా పేరు తెచ్చుకుందో అర్థమవుతుంది. కొత్త కొత్త బైక్‌లు మార్కెట్లోకి వచ్చినా, ప్లాటినా మాత్రం అందరి నమ్మకాన్ని గెలుచుకుంటుంది.

India Mileage King Bajaj Platina Price Engine And Features All Top Things

More from DriveSpark

Article Published On: Thursday, August 21, 2025, 7:25 [IST]
English summary
India mileage king bajaj platina price engine and features all top things
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+