మార్కెట్‌లో నిన్ను పడగొట్టే బండి ఇంకా పుట్టలేదు మామ..! రూ.100 కొట్టిస్తే చాలు.. బంగారం లాంటి బైక్!
భారతదేశంలో పేద, మధ్యతరగతి ప్రజల మనసును దోచుకున్న బైక్ ఏదైనా ఉందంటే, అది హీరో స్ప్లెండర్ (Hero Splendor) తప్ప మరొకటి కాదు. ఈ బైక్ గురించి మైలేజ్ కింగ్ అని చెబితే అతిశయోక్తి కాదు. తక్కువ ధరలో లభిస్తూ, లీటర్ పెట్రోల్‌కు అద్భుతమైన మైలేజ్ ఇచ్చే ఈ బైక్, దాదాపు మూడు దశాబ్దాలుగా సాధారణ భారతీయుడి జీవితంలో భాగమైపోయింది. రోజువారీ ప్రయాణాలకు సరైన ఎంపికగా భావించబడే హీరో స్ప్లెండర్, తన నమ్మకమైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు, మెరుగైన సౌకర్యాలతో ప్రత్యేక స్థానం సంపాదించింది. నగర రోడ్లపై గానీ, గ్రామీణ ప్రాంతాల దారులపై గానీ.. ఈ బైక్ సమానంగా పనితీరును ఇస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో కనీసం ఒక్క హీరో స్ప్లెండర్ కనిపించడం అసాధారణం కాదు.
తాజాగా విడుదలైన సెప్టెంబర్ 2025 అమ్మకాల గణాంకాలు కూడా ఈ బైక్ డిమాండ్‌ను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ నెలలో మొత్తం 3,82,383 యూనిట్లు కస్టమర్లకు పంపిణీ చేయబడ్డాయి. 2024లో ఇదే నెలలో అమ్ముడైన యూనిట్ల సంఖ్య 3,75,886, అంటే సంవత్సరానికి దాదాపు 1.73% వృద్ధి నమోదు అయింది. ఇది కొత్త బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చినా కూడా స్ప్లెండర్‌పై ఉన్న ప్రజల విశ్వాసం ఎంత బలంగా ఉందో చెబుతోంది.

హీరో కంపెనీ తరచుగా ఈ బైక్‌లో చిన్నచిన్న మార్పులు చేస్తూ, వినియోగదారుల అవసరాలను తీర్చే విధంగా కొత్త ఫీచర్లను జోడిస్తోంది. అదే సమయంలో, ధర మాత్రం సాధారణ వినియోగదారుల పరిధిలో ఉంచుతుంది. ఇంధన ధరలు పెరిగినా, రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నా, స్ప్లెండర్ యజమానులు టెన్షన్ లేకుండా డ్రైవ్ చేయగలగడం దీని ప్రధాన బలం. అందుకే హీరో స్ప్లెండర్ ఇప్పటికీ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో ఒకటిగా నిలుస్తోంది.
హీరో స్ప్లెండర్ గురించి మాట్లాడితే, ఇది రెండు ప్రధాన వేరియంట్లలో హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో సూపర్ స్ప్లెండర్ XTECలలో అందుబాటులో ఉంది. ముందుగా హీరో స్ప్లెండర్ ప్లస్ గురించి చెప్పుకుంటే, ఇది రూ. 73,902 నుంచి రూ. 76,437 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మధ్య ధరలో లభిస్తుంది. ఇందులో 97.2 సిసి పెట్రోల్ ఇంజిన్ అమర్చారు, ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

ఈ ఇంజిన్ 70 కి.మీ/లీటర్ వరకు అద్భుతమైన మైలేజ్ అందిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు అత్యంత ఆర్థికమైన ఎంపిక. అదనంగా, దీనిలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. 9.8 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో ఇది తక్కువ ఇంధన వ్యయంతో ఎక్కువ దూరం వెళ్లగలదు.
మరొక వెర్షన్ సూపర్ స్ప్లెండర్ XTEC గురించి మాట్లాడితే, ఇది కొంచెం పవర్‌ఫుల్ వేరియంట్. దీని ధర రూ. 81,998 నుండి రూ. 85,594(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇందులో 124.7 సిసి పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఇది 69 కి.మీ/లీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ వేరియంట్‌లో కూడా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

దీని 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఈ వేరియంట్లూ హీరో కంపెనీ నమ్మకాన్ని బలంగా నిలబెడుతున్నాయి . తక్కువ ధరకే అధిక మైలేజ్, ఆధునిక ఫీచర్లు, దీర్ఘకాలిక నాణ్యత..ఇవన్నీ కలిపి స్ప్లెండర్‌ను దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే బైక్‌గా నిలబెట్టాయి. అందుకే ఈ బైక్‌ను మార్కెట్లో నిన్ను పడగొట్టే బండి పుట్టలేదు మామా.. అంటూ సోషల్ మీడియా ఈ బైక్‌పై నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు.


Click it and Unblock the Notifications








