దేశంలోనే మొట్టమొదటి హై ఓల్జేజీ బైక్.. మార్కెట్లో ఇంత కంటే వేగంగా ఛార్జ్ అయ్యేది మరొకటి లేదు
మన దేశంలో ఈవీ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కంపెనీలు వారి అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త వాహన మోడల్స్ ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో స్కూటర్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున స్టార్టప్ బ్రాండ్లు కూడా వివిధ రకాల ఎలక్ట్రిక్ బైక్ లను ప్రవేశపెడుతున్నాయి.
బుల్లెట్ల ఘోష, గర్జించే స్పోర్ట్స్ బైక్‌ల శబ్దాల మధ్య ఈ మోడల్స్ నిశ్శబ్ధంగా కదులుతుండడం చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు అని వాటిని పనితీరు పరంగా పెట్రోల్ బైకులకు ఏ మాత్రం తీసిపోవు. ఆల్ట్రావయోలెట్ F77 ప్రస్తుతం మార్కెట్లో సంచలన సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే రాప్టీ హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ బైక్ కూడా మార్కెట్ ను దున్నేసేందుకు రెడీ అవుతుంది.

మార్కెట్లో మరే ఇతర ఎలక్ట్రిక్ బైకుకు లేనటువంటి ఫీచర్ రాఫ్టీ టీ30ఈవీకి ఉంది. ఇది భారతదేశపు మొట్టమొదటి హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ బైక్. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే టెక్నాలజీని ఉపయోగించి ఈ బైక్ ను డెవలప్ చేశారు. ఈ మోడల్ ఇప్పుడు హై వోల్టేజ్ టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి ARAI సర్టిఫికేషన్ కూడా పొందింది.
హై వోల్టేజ్ టెక్నాలజీని ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలో ఫస్ట్ టైం ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు కూడా వచ్చింది. హై వోల్టేజ్ టెక్నాలజీ రాఫ్టీ T30 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎలక్ట్రిక్ కార్ల కోసం CCS2 DC ఫాస్ట్ ఛార్జింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటానికి సహాయపడుతుంది.

CCS2 ఛార్జింగ్‌తో పాటు, EV హై-వోల్టేజ్ టెక్నాలజీ ఫాస్ట్ ఛార్జింగ్ వేగం, పవర్ ఫుల్ ఆన్-బోర్డ్ ఛార్జర్, లైట్ వెయిట్ ఇంటర్నల్ ఛార్జింగ్ కేబుల్ తో సహా అనేక ఆఫ్షన్లను అందిస్తుంది. రాఫ్టీ T30 ఎలక్ట్రిక్ బైక్ గతేడాది ప్రారంభంలో రూ. 2.39 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ అయింది. రాఫ్టీ ఎలక్ట్రిక్ బైక్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
అప్పటి నుండి T30 ఎలక్ట్రిక్ బైక్ కోసం 8,000 కంటే ఎక్కువ బుకింగ్స్ నమోదైనట్లు కంపెనీ చెబుతుంది. ఈ వాహనాన్ని మొదటగా చెన్నై, బెంగళూరులలో విక్రయిస్తారు. ఈ బ్రాండ్ రాఫ్టీ EVని కేరళతో సహా దశలవారీగా మార్కెట్ చేయాలని యోచిస్తోంది. రాఫ్టీ హై వోల్టేజ్ బైక్ డెలివరీలు 2025-26 మొదటి త్రైమాసికం నుంచి చెన్నై, బెంగుళూరులలో ప్రారంభం అవుతాయి.

రాఫ్టీ కొత్త ఎలక్ట్రిక్ బైక్ దేశీయ మార్కెట్లో 250-300 సిసి పెట్రోల్ బైక్‌లకు పోటీగా నిలువనుంది. T30 నాలుగు కలర్ ఆఫ్షన్లలో లభిస్తుంది. అవి హారిజన్ రెడ్, ఆర్కిటిక్ వైట్, మెర్క్యురీ గ్రే, ఎక్లిప్స్ బ్లాక్. దాని డిజైన్ ఏదైనా ఇది ఎట్రాక్టివ్ డిజైన్ కలిగి ఉంది. దీనిలో LED హెడ్‌లైట్లు, LED DRLలు, LED టెయిల్ లైట్లు, ముందు వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
ఆటోమోటివ్ గ్రేడ్ లైనక్స్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా కస్టమ్-బిల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. రియల్ టైంలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150కి.మీ.వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ IP67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌ను కూడా ఉపయోగిస్తుంది. పెట్రోల్ బైక్‌లు దీని డెలివరీ తర్వాత ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇది కేవలం 3.5 సెకన్లలో 0 నుండి 60 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.

చెన్నైకి చెందిన ఎలక్ట్రిక్ స్టార్టప్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాఫ్టీ తన లేటెస్ట్ T30 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ బ్యాటరీ వారంటీని అందిస్తోంది. ఇంత వేగంగా ఛార్జింగ్ అందించడంతో కస్టమర్లు దీనిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ కార్ల ఛార్జర్‌లకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో కూడా ఈ బైక్ ను ఛార్జ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








