ప్రతిరోజు 18,500 స్కూటర్లు.. చరిత్ర సృష్టించిన ఇండియా స్కూటర్ మార్కెట్.. మొత్తంగా ఎన్ని సేల్స్ అంటే?
భారతీయ స్కూటర్ పరిశ్రమకు మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరం బాగా గుర్తిండిపోతుంది. ఈ ఏడాది అమ్మకాల్లో 17 శాతం గణనీయమైన వృద్ధితో, మొత్తం 68.53 లక్షల స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇది ఈ రంగానికి ఒక రికార్డ్ స్థాయిగా చెప్పవచ్చు. ఇంతమంది వినియోగదారులు ఒకే ఏడాదిలో స్కూటర్‌లను కొనుగోలు చేయడం అంటే అరుదైన విషయం. ఈ గణంకాలకు ప్రధాన కారణం ప్రముఖ బ్రాండ్లు కొత్తగా, మరింత ఆకర్షణీయంగా స్కూటర్ మోడళ్లను విడుదల చేయడంతోమ పాటు, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో స్కూటర్లకు డిమాండ్ పెరగడం బాగా కలిసొచ్చింది. ఉద్యోగాలు, విద్య, వాణిజ్య అవసరాల కోసం స్కూటర్ బాగా అనుకూలంగా ఉంటుంది. అందుకే గత ఆర్థిక సంవత్సరంలో సేల్స్ బాగా పెరిగాయి.
అలాగే, ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగం కూడా ఈ వృద్ధికి గట్టిగా తోడ్పడింది. బ్యాటరీ టెక్నాలజీ ఇప్పుడు మెరుగుపడిన తర్వాత, ప్రజలు ఎక్కువగా ఈకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఈ మార్పును వేగవంతం చేశాయి. ప్రస్తుతం మార్కెట్లో చాలా మోడళ్లు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. డిజైన్‌లు, ధరలు, మైలేజ్, ఫీచర్ల కారణంగా స్కూటర్లకు డిమాండ్ పెరిగింది.

ఈజీ ప్రయాణాలకు ప్రత్యామ్నాయంగా మారిన స్కూటర్‌లు, మార్కెట్‌లో దుమ్ములేపుతున్నాయి. దీనివల్ల భారత దేశంలోని స్కూటర్ పరిశ్రమ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కొత్త అమ్మకాల రికార్డును నమోదు చేసింది. ఈ మొత్తం అమ్మకాల్లో హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. గత సంవత్సరం మార్కెట్ వాటా 43.33 శాతం నుండి కొద్దిగా తగ్గి 41.50 శాతం అయినా, హోండా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంలో ఏ మాత్రం వెనుక పడలేదు.
2025 ఆర్థిక సంవత్సరంలో హోండా ఏకంగా 28.4 లక్షల స్కూటర్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం కంటే 12 శాతం వృద్ధి. హోండా ఈ అమ్మకాలు సాధించడానికి ప్రధానంగా యాక్టివా 110, యాక్టివా 125, డియో 110, డియో 125 వంటి వేరియంట్లు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యాక్టివా, భారత వినియోగదారులకు బెస్ట్ స్కూటర్‌గా ఉంది. ఇది హోండాకు స్కూటర్ విభాగం అమ్మకాలను పెంచడానికి దోహదం చేసింది.

ఇదే క్రమంలో TVS, Suzuki బ్రాండ్లు తమదైన దూకుడు చూపించి, అమ్మకాల పరంగా కొత్త మైలురాయిలను సాధించాయి. టీవీఎస్ గతంలో 25 శాతం మార్కెట్ వాటాతో నిలిచిన సంస్థ, ఈ సంవత్సరం గణనీయంగా దూసుకెళ్లి 26 శాతానికి చేరుకుంది. ఈ కంపెనీ మొత్తం 18.3 లక్షల స్కూటర్ విక్రయాలను నమోదు చేసింది. గత సంవత్సరం కంటే ఇది 25 శాతం వృద్ధి. ఇది సంస్థకు బలమైన అమ్మకాలు అని చెప్పవచ్చు.
టీవీఎస్ కంపెనీ ఈ మేరకు అమ్మకాలను నమోదు చేయాడానికి ప్రధానంగా N-Torq,జూపిటర్ 110, జూపిటర్ 125, జెస్ట్ లాంటి మోడళ్లు కీలక పాత్ర పోషించాయి. ఇవి వాటికి ఉన్న ప్రత్యేకతల కారణంగా మార్కెట్లో అందరిని ఆకట్టుకుంటున్నాయి. అలాగే, టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ iQube కూడా గత సంవత్సరం దుమ్ము రేపింది. ఎలక్ట్రిక్ మార్కెట్లో ఇది 44 శాతం వృద్ధితో 2.73 లక్షల యూనిట్ల అమ్మకాల రికార్డును నెలకొల్పింది.

మరోవైపు, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో అదరగొట్టింది. ఇది మొత్తం అమ్మకాల్లో 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఓవరాల్‌గా 10.24 లక్షల స్కూటర్లు భారతీయ రోడ్లపైకి వచ్చాయి. వీటిలో ప్రధానంగా సుజుకి యాక్సెస్ మోడల్ కీలక పాత్ర పోషించింది. బ్రాండ్ విలువను పెంచడంలో ఇది ప్రధాన మోడల్. మైలేజ్, స్టైలిష్ లుక్, ఫీచర్స్ వంటి వాటితో ఇది ఫ్యామిలీ స్కూటర్‌గా మారింది.
2024-25 ఆర్థిక సంవత్సరం భారత స్కూటర్ మార్కెట్‌లో యమహా, బజాజ్ ఆటో వంటి తయారీదారులు కూడా గణనీయమైన పురోగతిని నమోదు చేశారు. యమహా 13 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఇంకొకవైపు, బజాజ్ ఆటో గత సంవత్సరం పోలిస్తే 140 శాతం అమ్మకాల వృద్ధిని సాధించింది. బజాజ్ వ్యూహాత్మక మోడల్స్‌తో పాటు ఎలక్ట్రిక్ రంగంలో పెట్టిన అడుగులు ద్వారా తన అమ్మకాలు పెరగడానికి దోహదం చేసింది.

ఈ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాల్లో కీలక పాత్ర పోషించినట్లు డేటాను తెలుస్తుంది. ఇది మొత్తం స్కూటర్ అమ్మకాల్లో 11 శాతం వాటాను కలిగి ఉంది. ఒక్క సంవత్సరంలోనే కంగా 7.73 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడు పోయాయి. ప్రత్యేకంగా ఏథన్ ఎనర్జీ కంపెనీ అమ్మకాల్లో 44 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ గణంకాలను చూసినట్లయితే ప్రజలంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరిస్తున్నారని తెలుస్తుంది.
ఇప్పటివరకు అత్యధికంగా స్కూటర్లు విక్రయించబడిన సంవత్సరంగా Fy2018 నిలిచింది. ఈ కాలంలో 67.1 లక్షల స్కూటర్ల విక్రయాలు జరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 1.33 కోట్లకు పైగా స్కూటర్లు విక్రయమవడం ద్వారా ఈ విభాగం తన సత్తా చాటింది. ఇది దాదాపు రెట్టింపు వృద్ధి, అంటే ప్రతి నెల సగటున 5.71 లక్షల స్కూటర్లు అమ్ముడవుతుండగా, రోజుకి సగటున 18,500 స్కూటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా అక్టోబర్ నెలలో సెలవుల సీజన్‌లో 7.21 లక్షలకు పైగా స్కూటర్లు అమ్ముడయ్యాయి, ఇది ఏడాదిలో అత్యధికమైన అమ్మకాల నెల. ఆఫర్లు, ఫెస్టివల్ డిస్కౌంట్లు, కొత్త మోడళ్ల కారణంగా ఈ నెలలో సేల్స్ పెరిగాయి. అంతేకాదు, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా 6 లక్షల మార్క్‌ను దాటింది. మిగతా ఎనిమిది నెలల్లో కూడా ప్రతి ఒక్క నెలలో 5 లక్షల మార్క్ దాటడం ద్వారా, మార్కెట్‌లో స్కూటర్ల డిమాండ్ చూపించింది.
అయితే డిసెంబర్ మాత్రం కొద్దిగా అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ నెలలో 4.18 లక్షల స్కూటర్ల అమ్మకాలు జరిగాయి. ఇందుకు ముఖ్యమైన కారణం, కొత్త సంవత్సరంలో వాహన కొనుగోలు చేయాలనే వినియోగదారుల ధోరణి. ఇది సాధారణంగా ప్రతి ఏడాది డిసెంబర్‌లో కనిపించే ట్రెండ్. అలాగే ఈ సారి కూడా అలాగే కనిపించింది. మొత్తంగా చూస్తే, 2025 ఆర్థిక సంవత్సరం స్కూటర్ మార్కెట్‌కు ఓ గోల్డెన్ ఛాప్టర్ లాంటిదే.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








