ఈ బైక్ కొనడానికి దేశవ్యాప్తంగా జనాలు షోరూమ్‌ల దగ్గర క్యూ కట్టారు! ఒక్క నెలలో ఇంతమంది కొన్నారా?
భారతీయ టూవీలర్ మార్కెట్లో ఎప్పటికప్పుడు అధిక డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మైలేజ్ బాగుండే, పనితీరు మెరుగ్గా ఉండే మోడల్స్‌ను వినియోగదారులు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటారు. ఈ కోవలోనే హీరో కంపెనీ నుండి వచ్చిన స్ప్లెండర్ (Splendor) బైక్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. సంవత్సరాల తరబడి భారతీయ రోడ్లపై దూసుకుపోతూ, తన పనితీరును నిరూపించుకున్న ఈ మోడల్, ఇప్పటికీ మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. ఇటీవల ఆటోమొబైల్ తయారీదారులు విడుదల చేసిన జూలై నెల అమ్మకాల గణాంకాలు దీనికి నిదర్శనం. హీరో స్ప్లెండర్ మరోసారి టాప్ 10 బైక్‌ల అమ్మకాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఒక్క జూలై నెలలోనే మొత్తం 2,46,715 యూనిట్లు అమ్ముడవడం ఈ బైక్ స్థిరమైన డిమాండ్‌కు నిదర్శనం.
గత సంవత్సరం ఇదే కాలంలో అమ్ముడైన 2,20,820 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది అమ్మకాలు సుమారు 11 శాతం పెరగడం గమనార్హం. ఈ వృద్ధి వెనుక ఉన్న ప్రధాన కారణాలు, బైక్ అందించే అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటనెన్స్ ఖర్చులు, నమ్మకమైన పనితీరు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు అన్ని వర్గాల వినియోగదారుల మనసులను గెలుచుకున్న ఈ మోడల్, సాధారణ వినియోగదారులకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా కూడా నిలుస్తోంది.

తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనం అందించే వాహనాల కోసం చూస్తున్న భారతీయ వినియోగదారుల కోసం స్ప్లెండర్ ఇప్పటికీ ఒక ఐడియల్ ఎంపికగా కొనసాగుతూనే ఉంది. జూలై నెలకు సంబంధించిన టాప్ 10 టూవీలర్ సేల్స్‌ను ఒకసారి చూసినట్లయితే హీరో స్ప్లెండర్ తర్వాత జూలై నెలలో అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా హోండా షైన్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ బైక్ జూలైలో మొత్తం 1,59,658 యూనిట్లను విక్రయించింది.
అయితే, షైన్ అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు 2.29 శాతం తగ్గడం గమనార్హం. ఇక మూడవ స్థానాన్ని బజాజ్ పల్సర్ సాధించింది. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరుతో యువతకు ఆకర్షణీయంగా ఉండే ఈ మోడల్ జూలైలో 79,817 యూనిట్లు అమ్ముడైంది. నాల్గవ స్థానంలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ నిలిచింది. ఈ బైక్ మొత్తం 71,477 యూనిట్ల అమ్మకాలతో మంచి వృద్ధిని నమోదు చేసింది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ఆదరణ పొందిన ఈ మోడల్ అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 53.30 శాతం పెరగడం విశేషం. ఐదవ స్థానంలో టీవీఎస్ అపాచీ ఉంది. స్పోర్ట్స్ సెగ్మెంట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఈ బైక్, గతేడాది జూలైలో 37,566 యూనిట్లు విక్రయించగా, ఈ ఏడాది అదే నెలలో 22.44 శాతం వృద్ధిని సాధించడం దీని ప్రజాదరణను ప్రతిబింబిస్తుంది. ఆరవ స్థానాన్ని హోండా యునికార్న్ దక్కించుకుంది.
సింపుల్ డిజైన్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం అందించే హోండా యునికార్న్ మోడల్ జూలైలో 33,572 యూనిట్ల అమ్మకాలతో 14.54 శాతం వృద్ధి సాధించింది. జాబితాలో ఏడవ స్థానాన్ని బజాజ్ ప్లాటినా దక్కించుకుంది. మైలేజ్ బైక్‌లలో వినియోగదారులకు నచ్చిన ఈ మోడల్, జూలైలో మొత్తం 29,424 యూనిట్లు విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 1.72 శాతం వృద్ధి సాధించడం దీని స్థిరమైన డిమాండ్‌ను సూచిస్తోంది.

ఎనిమిదవ స్థానంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 నిలిచింది. లాంగ్ రైడ్‌లను ఇష్టపడే బైక్ లవర్స్‌కి ఈ మోడల్ ఒక ఫేవరెట్. జూలైలో మొత్తం 26,516 యూనిట్లు అమ్ముడవడం దీని స్థిరమైన మార్కెట్ స్థాయిని మరోసారి నిరూపించింది. తొమ్మిదవ స్థానాన్ని టీవీఎస్ రైడర్ సాధించింది.
యూత్ ఆడియన్స్‌ను లక్ష్యంగా పెట్టుకుని వచ్చిన రైడర్ బైక్, జూలైలో 24,511 యూనిట్లు విక్రయించి, 0.15 శాతం స్వల్ప వృద్ధి నమోదు చేసింది. టాప్ 10 జాబితాలో పదవ స్థానాన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ బైక్ దక్కించుకుంది. అర్బన్ రైడింగ్‌కు అనువైన ఈ బైక్, జూలైలో 18,373 యూనిట్ల అమ్మకాలతో తన స్థానం నిలబెట్టుకుంది.


Click it and Unblock the Notifications








