జూన్ 2025 టాప్ 10 టూవీలర్స్ లిస్ట్: ఎన్నో మోడళ్లు వచ్చినా.. గ్రామాల్లో, పట్టణాల్లో అందిరికి ఇదే కావాలి!

ప్రపంచ వ్యాప్తంగా టూవీలర్ అమ్మకాల్లో భారత్ కీలక స్థానాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ రోజువారీ రవాణా అవసరాల కోసం బైక్‌లు, స్కూటర్లను ఎన్నుకుంటున్నారు. ఈ దృక్పథం జూన్ 2025 నెల టూవీలర్ అమ్మకాల గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెలలో కొన్ని లక్షల సంఖ్యలో భారత్‌లో టూవీలర్స్‌ను ప్రజలు కొనుగోలు చేశారు. అయితే ఈ టైంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూవీలర్స్‌ను ఒకసారి చూద్దాం. జూన్ 2025లో అత్యధికంగా విక్రయమైన 2-వీలర్‌గా మళ్లీ హీరో స్ప్లెండర్ (Hero Splendor) బైక్ నిలిచింది. ఒకే నెలలో 3,31,057 యూనిట్లు అమ్ముడవడం, ఈ మోడల్‌కు మార్కెట్లో ఇప్పటికీ ఎంతటి స్థిరమైన ఆదరణ ఉన్నదో చెప్పకనే చెబుతుంది. ఇది కేవలం నంబర్ల విషయమే కాదు, దీని వెనుక ఉన్న విశ్వాసం, ఆర్ధికత, మైలేజ్ ఈ విజయానికి కారణాలుగా నిలిచాయి.

జూన్ 2024లో అమ్ముడుపోయిన స్ప్లెండర్ బైక్స్ సంఖ్య 3,05,586గా ఉండగా, ఈ ఏడాది జూన్‌లో అది 25,471 యూనిట్లు పెరిగి, 8.34 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనించదగ్గ విషయం. బడ్జెట్ ధర, నిర్ధారిత పనితీరు, సర్వీస్ నెట్‌వర్క్.. ఇవన్నీ కలిసి స్ప్లెండర్‌ను మళ్లీ టాప్‌లో నిలిపాయి. హీరో స్ప్లెండర్ తర్వాత రెండవ స్థానంలో హోండా యాక్టివా(Honda Activa) నిలిచింది. జూన్ 2025లో యాక్టివా సేల్స్ 1,83,265 యూనిట్లకు చేరాయి.

India Best Two wheelers

ఇది భారత్‌లో స్కూటర్ విభాగంలో ఏమాత్రం తగ్గని క్రేజ్ ఉన్నదనే దానికి నిదర్శనం. సులభమైన రైడింగ్, మెయింటెనెన్స్ ఫ్రీ నేచర్, బ్రాండ్ ఇమేజ్ వంటి అంశాలు యాక్టివాను మహిళలతో పాటు అన్ని వయస్సుల వారికి దగ్గరచేశాయి. అయితే ఈ మోడల్ అమ్మకాల పరంగా గత ఏడాదితో పోల్చితే తగ్గుదలను నమోదు చేసింది. 2024 జూన్‌లో 2,33,376 యూనిట్లు అమ్ముడవగా 50,111 యూనిట్ల తేడా కస్టమర్ల మూడ్ మారిందనే సంకేతాన్ని ఇస్తోంది.

ఇక మూడవ స్థానంలో ఉన్న హోండా షైన్ బైక్ విషయానికొస్తే, ఇది కూడా గతేడాది కంటే తక్కువ అమ్మకాలే నమోదు చేసింది. 2024 జూన్‌లో 1,62,674 షైన్ బైక్‌లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 1,43,218కు పరిమితమైంది. ఫలితంగా, అమ్మకాల్లో 19,456 యూనిట్ల తగ్గుదల చోటుచేసుకుంది. ఇది మిడ్-రేంజ్ కమ్యూటర్ బైక్స్ విభాగంలో పోటీ మరింత తీవ్రమవుతున్నదన్న సంకేతం.

India Top 10 Two wheelers

జాబితాలో 4వ, 5వ స్థానాల్లో నిలిచినవి TVS జూపిటర్, హీరో HF డీలక్స్. ఇవి కూడా గత ఏడాది కన్నా తక్కువ సంఖ్యలో అమ్ముడుపోయాయి. TVS జూపిటర్ 2024 జూన్‌లో 1,07,980 యూనిట్లు అమ్ముడవ్వగా, 2025 జూన్‌లో ఆ సంఖ్య 72,100 కి పడిపోయింది. హీరో HF డీలక్స్ గతేడాది 1,00,878 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి 89,941 యూనిట్లకు పరిమితమైంది. ఇవి చూస్తే, వినియోగదారుల ప్రాధాన్యతలు క్రమంగా మారుతున్నాయని చెప్పొచ్చు.

ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంతో లేదా కొత్త ఫీచర్ల కోసం ఎదురు చూస్తూ, కొంత మంది కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక EV సెంటిమెంట్ ప్రభావం కూడా కొన్ని మోడళ్లపై పడిందని భావించవచ్చు. 6వ స్థానంలో బజాజ్ పల్సర్ తన స్థిరమైన ఫాలోయింగ్‌తో నిలిచింది. ఈ నెలలో మొత్తం 88,452 యూనిట్లు విక్రయించి స్పోర్టీ బైక్ లవర్స్‌కు తమ ఫేవరెట్ వాహనంగా నిలిచింది.

Honda Shine Sales

7వ స్థానంలో సుజుకి యాక్సెస్ స్కూటర్ ఉంది. మొత్తం 51,555 యూనిట్లు అమ్ముడవ్వడం ద్వారా, స్కూటర్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. 8వ స్థానంలో టీవీఎస్ అపాచీ 41,386 యూనిట్ల, 9వ స్థానంలో టీవీఎస్ ఎక్స్‌ఎల్ (Moped) 33,349 యూనిట్లు, 10వ స్థానంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ 29,172 యూనిట్ల అమ్మకాలతో, ప్రీమియం సెగ్మెంట్‌లో తన స్థిర స్థానాన్ని నిలబెట్టుకుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 22, 2025, 10:03 [IST]
English summary
India top 10 two wheelers sold out in june 2025 full details check here
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+