బడ్జెట్ బైక్స్ కోసం చూస్తున్నారా? లక్ష రూపాయల లోపు బెస్ట్ బైక్స్ ఇవే! మైలేజ్,స్టైల్, పర్ఫార్మెన్స్‌లో బెస్ట్

గతంలో మీ చేతిలో లక్ష రూపాయలు ఉంటే, ఆకట్టుకునే హీరో కరిష్మా 220 లాంటి ప్రీమియం బైక్‌నే సులభంగా సొంతం చేసుకోవచ్చు. ఆన్-రోడ్ ధరగా సుమారు రూ. 85,000 చెల్లిస్తే చాలు. బైక్ మీ ఇంటికి చేరిపోయేది. అయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, రూపాయి విలువ తగ్గడం, వస్తువుల ఉత్పత్తి నిర్వహణ వ్యయం పెరగటం మొదలగు కారణాల వలన లక్ష రూపాయల బడ్జెట్ ఇప్పుడు కేవలం కమ్యూటర్ బైక్స్ కొనుగోలుకే సరిపోతుంది. ఈ ధరలో కొత్త బైకును కొనుగోలు చేయాలని చూసిన అలాంటి మోడళ్లు ఇప్పుడు మార్కెట్లో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మీ చేతిలో రూ.1 లక్ష బడ్జెట్ ఉన్నా కూడా దానికి అనుగుణంగా మీకు కావాల్సి ఫీచర్స్‌తో చూడదగిన మోడళ్ల సంఖ్య గణనీయంగా తక్కువైపోయింది.

అన్ని వర్గాల వినియోగదారుల్నీ ఆకర్షించేలా బైక్ మార్కెట్ రోజురోజుకీ విస్తరిస్తోంది. ముఖ్యంగా రూ.1 లక్ష బడ్జెట్‌లో బైక్ కొనే అవకాశాలు తగ్గిపోయాయని చాలా మంది భావిస్తున్నప్పటికీ, మార్కెట్లో మంచి పనితీరు, డిజైన్, మైలేజ్ కలిగిన కొన్ని మోడళ్లు ఇప్పటికి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వాటిలో కమ్యూటర్ బైక్‌ల నుండి స్పోర్టీ బైక్‌ల వరకు అనేక మోడళ్లు ఉన్నాయి. వాటి వాటిలో కొన్ని మోడళ్లు గురించి కింది కథనంలో తెలుసుకుందాం.

India Top 5 Motorcycles Under Rs 1 Lakh Bajaj Pulsa

Bajaj Pulsar 125: బజాజ్ పల్సర్ 125 దాని క్లాసిక్, ఐకానిక్ లుక్ కారణంగా సంవత్సరాలు గడుస్తున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు, ఈ సిరీస్‌లోని ఎంట్రీ లెవల్ మోడల్ అయిన పల్సర్ 125 రూ. 85,178 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది లక్ష లోపు బైక్. ఇది 124.4cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది, ఇది స్మూత్ రైడింగ్‌తోపాటు, లీటరుకు సుమారు 51 కి.మీ మైలేజ్ ఇవ్వగలదు.

రోజువారి అవసరాల కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫీచర్స్ కూడా దీనిలో చాలా ఉన్నాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు వంటి ఆధునిక ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ 11.5 లీటర్లు. బైక్ బరువు 140 కిలోలు. ఇది 2,055 మిమీ పొడవు, 755 మిమీ వెడల్పు, 1,060 మిమీ ఎత్తు, 1,320 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంది.

India Top 5 Motorcycles Under Rs 1 Lakh

TVS Raider 125: స్పోర్టీ లుక్స్‌తో పాటు మోడరన్ ఫీచర్లను కలిగి ఉన్న వాటిలో టీవీఎస్ రైడర్ 125 ఒకటి. దీని కట్-ఎడ్జ్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ రూ. 90,000 నుండి రూ.1,02,000(ఎక్స్-షోరూమ్) మధ్యలో వివిధ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇది 124.8cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. కేవలం పవర్‌ఫుల్‌గానే కాకుండా, లీటరుకు 56 కి.మీ వరకూ మైలేజ్ ఇవ్వగల సామర్థ్యం కూడా కలిగి ఉంది.

ఇది డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌ల్యాంప్, ఇన్‌బిల్ట్ రైడ్ మోడ్‌లు వంటి అన్ని తక్కువ ధరకే లభించడం చాలా ఆశ్చ్యకరం అని చెప్పవచ్చు. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఇది న్యాయం చేస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ 10 లీటర్లు, అంటే రెగ్యులర్ రైడింగ్‌లో పెద్దగా టెన్షన్ ఉండదు. బైక్ బరువు 123 కిలోలు మాత్రమే కావడం వల్ల ట్రాఫిక్‌లోనూ, పట్టణ రైడింగ్‌లోనూ హ్యాండ్లింగ్ సూపర్‌గా ఉంటుంది.

India Top 5 Motorcycles Under Rs 1 Lakh Honda Sp125

Honda SP125: ఆకర్షణీయమైన డిజైన్, మంచి మైలేజ్‌కి హోండా ఎస్‌పీ125 బాగా సెట్ అయ్యే మోడల్. ఇది డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. డ్రమ్ వేరియంట్ ధర రూ.89,468, డిస్క్ వేరియంట్ ధర రూ.93,468. ఇవన్నీ కూడా ఎక్స్-షోరూమ ధరలు. ఇది 124cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది, లీటరు పెట్రోల్‌కు 60 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుందని హోండా పేర్కొంటోంది.

రోజూ ఆఫీస్, మార్కెట్, చిన్న ప్రయాణాల కోసం వెళ్తే ఫ్యూయల్ కెపాసిటీ అనుకూలంగానే ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే, SP125 సైలెంట్ స్టార్ట్ ACG సిస్టమ్, స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్, డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని కలిగి ఉంది. ఇవి రైడింగ్‌ను స్మూత్‌గా, మోడరన్‌గా అనిపించేలా చేస్తాయి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11.2 లీటర్లు. బరువు కేవలం 116 కిలోలు. దీంతో ట్రాఫిక్‌లో కూడా సులువుగా మేనేజ్ చేయవచ్చు.

India Top 5 Motorcycles Under Rs 1 Lakh xtreme-125

Hero Xtreme 125R: రూ.1 లక్ష లోపు ధరలో స్టైలిష్, స్పోర్టీ బైక్ కోసం వెతుకుతున్న వారికి హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ సెట్ అవుతుంది. ఇది కేవలం పవర్‌ఫుల్ బైక్‌ మాత్రమే కాదు, స్టైల్, మైలేజ్, ఫీచర్లు అన్నింటిలోనూ కస్టమర్ల నమ్మకాన్ని నిలబెడుతుంది. ఇది రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బేసిక్ IBS వేరియంట్ ధర రూ.96,425 కాగా, అడ్వాన్స్డ్ ABS వేరియంట్ ధర రూ.1,00,100 (ఎక్స్-షోరూమ్).

ఇది 125cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో లీటరుకు 66 కి.మీ మైలేజ్ ఇస్తుంది. రోజు ప్రయాణాలకు ఇది మంచి మైలేజ్ అవుతుంది. ఇది LED హెడ్‌లైట్లు, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంకా స్పోర్టీ స్ప్లిట్ సీట్ డిజైన్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ బైక్, యువతను లక్ష్యంగా చేసుకొని డిజైన్ చేయబడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దాని డైనమిక్ బాడీ లైన్‌లు, మ్యాట్,యు గ్లోసీ ఫినిష్ కలర్ టోన్లు ఆకట్టుకుంటాయి.

Hero Splendor Plus: భారతదేశంలో మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ బైక్ ఇదే. ఏన్ని ఏళ్లు అయినప్పటికి మార్కెట్లో ఉన్న క్రేజ్ తగ్గలేదు. రూ.77,176 నుంచి రూ.80,176 వరకు ఎక్స్-షోరూమ్ ధరలో అనేక వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ధర తక్కువే కాకుండా, పనితీరు కూడా నమ్మకంగా ఉండటంతో, ప్రతి ఇంట్లో ఒక స్ప్లెండర్ ఉండడం ఇప్పటికీ కనిపిస్తుంది. ఇది 97.2 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

ఇది 70 కి.మీ/లీటర్ వరకు మైలేజ్ ఇవ్వగలదు. పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో మధ్యతరగతి ప్రజలకు ఒక గొప్ప వరం లాగా కనిపిస్తుంది. డెలివరీ బాయ్స్, చిన్న వ్యాపారులు, రోజూ ఆఫీస్‌కు బైక్‌పై వెళ్తున్న ఉద్యోగులు, అందరికీ బెస్ట్‌ చాయిస్‌గా నిలుస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్(IBS), ట్యూబ్‌లెస్ టైర్లు, ఎలక్ట్రిక్ స్టార్ట్, ఇంకా క్లాసిక్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, April 25, 2025, 7:25 [IST]
English summary
India top 5 motorcycles under rs 1 lakh bajaj pulsar tvs raider honda sp125 more
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+