గ్రామాలు, పట్టణాలకు బెస్ట్.. ఈ స్కూటర్‌లతో రోడ్డుపైకి వస్తే అందరి చూపు మీపైనే.. పక్కనే బైక్ ఉన్నా చూడరు!

ప్రజల రోజువారీ ప్రయాణాల కోసం టూవీలర్ కచ్చింతగా ఉండాల్సిందే. ముఖ్యంగా బైక్‌ల కంటే స్కూటర్లు కంఫర్ట్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తాయి. ఇవి పురుషులు, స్త్రీలు ఇద్దరూ సులభంగా నడిపేందుకు అనువుగా ఉండటమే మాత్రమే కాకుండా లుక్స్ పరంగా ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో చాలా స్కూటర్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో దేన్ని ఎంచుకోవాలో తెలియక చాలా మంది ఆలోచనలో పడుతారు. అందుకే రెండు లక్షల రూపాయల లోపు ధరలో మార్కెట్‌లో ఉన్న కొన్ని టాప్ స్కూటర్ల గురించి మీకు అందించబోతున్నాము. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో చక్కగా నడిచే బలమైన స్కూటర్లు, పట్టణ స్టైల్‌కు తగ్గ మోడర్న్ లుక్‌ని కూడా కలిగి ఉంటాయి. వాటిలో కొన్ని టాప్ మోడళ్లను ఓసారి కింది కథనంలో పరిశీలిద్దాం.

Honda Dio 125: హోండా డియో 125 భారతీయ మార్కెట్లో ప్రసిద్ధ మోడల్‌గా ఉంది. ఇది స్టైలిష్ లుక్స్, నమ్మకమైన పనితీరు, ప్రీమియం ఫీచర్లతో 125cc విభాగంలో మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ మోడల్ 123.92cc పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. 8.28 PS హార్స్ పవర్, 10.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు దాదాపు 48 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది ప్రతిరోజు రైడింగ్‌కి బాగా సరిపోతుంది.

India Top 5 Premium Scooter Honda Dio

ఇది మరింత స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకుంటోంది. మార్కెట్‌లో స్పోర్ట్స్ రెడ్, పెర్ల్ నైట్‌స్టార్ బ్లాక్, పెర్ల్ సైరెన్ బ్లూ, ఇంకా పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే అనే నాలుగు స్టైలిష్ కలర్స్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తోంది, దీంతో ముందు డాష్‌లో స్పీడ్, మైలేజ్, ఫ్యూయల్ లెవెల్ మొదలైన సమాచారం అన్నీ క్లియర్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాయి.

బలమైన టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఇందులో ఉన్నాయి. వీటివల్ల రైడింగ్ స్మూత్ అనుభూతిని ఇస్తుంది. ధర విషయానికి వస్తే, కొత్త డియో 125 ఇప్పుడు రూ. 86,851 నుంచి రూ. 93,750 వరకు (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. ఇది డిస్క్, డ్రమ్ బ్రేక్‌లతో లభిస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లుగా ఉంది. ఈ స్కూటర్ బరువు 104 కిలోలు.

India Top 5 Premium Scooter Tvs Ntorq

TVS Ntorq 125: స్టైలిష్ లుక్స్‌తో పాటు లేటెస్ట్ టెక్నాలజీ, స్పోర్టీ రైడింగ్‌కి ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేకంగా వచ్చిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 బాగా ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ ధర రూ.86,841 నుండి రూ.1.06 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. ధర పరంగా చూస్తే, బడ్జెట్‌ఫ్రెండ్లీగా చెప్పొచ్చు. ఫీచర్లు పూర్తి ప్రీమియం అనిపించేలా ఉంటాయి. ఇది 124.8cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఇది 9.38 PS పవర్, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌కు దాదాపు 47 కి.మీల మైలేజ్ ఇస్తుంది. ట్రాఫిక్‌లో కూడా ఇది రయ్ మంటూ దూసుకుపోతుంది. కాల్, SMS అలెర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, స్టైలిష్ LED టెయిల్‌లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్‌ కలిగి ఉంది.

India Top 5 Premium Scooter Hero Xoom

Hero Xoom 160: హీరో జూమ్ 160 ప్రీమియం లుక్‌తో పాటు హై పర్ఫార్మెన్స్‌ను కోరుకునే రైడర్లకు సెట్ అవుతుంది. ధర రూ. 1.49 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది కేవలం నగర రైడింగ్‌లకు మాత్రమే కాకుంగా, ఇతర రోడ్లపై బైక్ తరహాలో కూడా బాగా నడుస్తుంది. దీనిలో 156cc సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 6,500 rpm వద్ద 14PS హార్స్ పవర్,13.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లీటర్ పెట్రోల్‌కు 40 కి.మీల మైలేజ్‌ను ఇస్తుంది. ఫీచర్స్ పరంగా, జూమ్ 160ని పూర్తిగా లేటెస్ట్ ట్రెండ్‌కి తగినట్లు డిజైన్ చేశారు. ఇది LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, i3S సిస్టమ్ (ఇంజిన్ ఆన్/ఆఫ్ ఆటోమేటిక్‌గా చేసే టెక్నాలజీ), సైలెంట్ స్టార్టర్, కీలెస్ ఇగ్నిషన్ వంటి పలు ఫీచర్లు కలిగి ఉంది. ఈ స్కూటర్ బరువు 142 కిలోల బరువు కలిగి ఉండగా, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 7 లీటర్లుగా ఉంది.

India Top 5 Premium Scooter Yamaha Aerox

Yamaha Aerox 155: యమహా ఏరోక్స్ 155 బైక్‌ల వలే పవర్, స్కూటర్‌ల వలే రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. ఇది 155cc లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజి‌న్‌లో లభిస్తుంది. ఇది 15PS పవర్, 13.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగరాల్లో రద్దీగా ఉన్న రోడ్లపై మాత్రమే కాకుండా హైవే రూట్‌లో కూడా సాఫీగా దూసుకుపోతుంది. ఇది ఒక లీటరు పెట్రోల్‌కు దాదాపు 48.62 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.

ఇది గ్రే వెర్మిలియన్, సిల్వర్, రేసింగ్ బ్లూ, మెటాలిక్ బ్లాక్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మస్కులర్ డిజైన్, LED హెడ్‌ల్యాంప్స్, టెయిల్ లైట్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నోటిఫికేషన్లు, కాల్ అలెర్ట్స్, రైడింగ్ స్టాట్స్ అన్నీకూడా ముందు ఉన్న డిస్‌ప్లేలో కనిపిస్తాయి. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.5 లీటర్లుగా ఉంది.

Suzuki Burgman Street: సుజుకీ బర్గ్‌మాన్ స్ట్రీట్ క్లాసికల్ మాక్సీ డిజైన్‌తో, సిటీ రైడింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. ఇది 124cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. 8.7 PS పవర్, 10 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పెట్రోల్‌కు దాదాపు 48 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుంది. రోజు ప్రయాణాలు చేసే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి.

ఇది పెర్ల్ మ్యాట్ షాడో గ్రీన్, పెర్ల్ మిరాజ్ వైట్, పెర్ల్ మ్యాట్ షాడో గ్రీన్, మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్ అనే పలు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. దీనిలో LED టెయిల్ లైట్స్, LED హెడ్‌లైట్లు, సైలెంట్ స్టార్టర్, , ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ వంటి పలు స్మార్ట్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఇవి ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 9, 2025, 13:10 [IST]
English summary
India top 5 premium scooters under rs 2 lakh honda dio ntorq xoom aerox burgman street
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+