ఒక లీటరు పెట్రోల్‌తో 80 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్! పేదలకు అతి తక్కువ ధరలో బెస్ట్ బైక్స్!
రోజువారీ పనుల కోసం కొత్త బైక్ కొనాలని అనుకునే పేద, మధ్యతరగతి ప్రజలకు మొదట గుర్తొచ్చేది, ఏ బైక్ మైలేజీ ఎక్కువ ఇస్తుంది? అది నిజంగా ఎంతకాలం నమ్మకంగా ఉంటుంది అన్న సందేహమే. ఎందుకంటే ఈ వర్గం ప్రజలకు బైక్ అనేది కేవలం ప్రయాణానికి ఉపయోగించే వాహనం మాత్రమే కాదు, కుటుంబ బడ్జెట్‌లో పెద్ద భాగం కూడా. ఒకసారి డబ్బు వెచ్చించి కొనుగోలు చేసిన తర్వాత, అది ఎక్కువ కాలం బాగా నడవాలి, అలాగే పెట్రోల్ తక్కువ తాగుతూ ప్రతిరోజూ ఖర్చు తగ్గించాలి. ఇలాంటి సందర్భంలో బజాజ్ ప్లాటినా 100, TVS రేడియన్, హీరో HF 100 వంటి బైక్‌లు ఎక్కువగా ప్రస్తావనలోకి వస్తాయి. వీటన్నీ సాదాసీదా లుక్ ఉన్నప్పటికీ, అందులోని అసలు బలం మైలేజీ, నమ్మకమైన ఇంజిన్. వాటి గురించి ఈ కథనంలో చూద్దాం.
TVS Radeon: టీవీఎస్ రేడియన్ రోజువారీ ప్రయాణాలకు మాత్రమే కాకుండా, ఎక్కువ కాలం సులభంగా ఉపయోగించుకునేలా దీని నిర్మాణం ఉంది. రియంట్‌ను బట్టి రూ.59,880 నుండి రూ.84,534 (ఎక్స్-షోరూమ్) మధ్య లభిస్తుంది. ఇది 109.7cc పెట్రోల్ ఇంజిన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇది స్థిరమైన పనితీరును అందిస్తుంది. మైలేజీ పరంగా కూడా ఇది వినియోగదారులను నిరాశపరచదు, లీటరుకు సుమారు 73 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.

ఫీచర్ల విషయానికి వస్తే, రేడియన్ ఇప్పుడు పూర్తిగా అప్‌డేట్ అయింది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, ఎలక్ట్రిక్ సెల్ఫ్-స్టార్ట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి సౌకర్యాలు అందులో ఉన్నాయి. రైడింగ్ కంఫర్ట్ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక ట్విన్-షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ ఇవ్వబడింది. భద్రత కోసం డ్రమ్ బ్రేక్ వేరియంట్‌తో పాటు డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా లభిస్తుంది.
Bajaj Platina 100: బజాజ్ ప్లాటినా 100 పేరు వింటేనే చాలామంది బైక్ ప్రియులకు దగ్గరైన మోడల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి. తక్కువ ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అద్భుతమైన మైలేజీ వల్ల ఇది పట్టణాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగదారులకు నమ్మదగిన తోడుగా నిలుస్తోంది. ప్రస్తుతానికి దీని ధర సుమారు రూ.70,611 (ఎక్స్-షోరూమ్).

ఇది శక్తివంతమైన 102cc పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. 7500 rpm వద్ద 7.9 bhp హార్స్‌పవర్, 5500 rpm వద్ద 8.34 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉండటంతో సిటీ రైడింగ్, రోజువారీ ప్రయాణాలకు సరిపోతుంది. మైలేజీలో ఎప్పుడూ ముందుంటుంది. పరిస్థితులపై ఆధారపడి 75 నుండి 90 kmpl వరకు ఇస్తుంది. ఈ బైక్ 0 నుండి 60 kmph వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటుంది.
Hero HF 100: హీరో HF 100 సాధారణ ప్రజల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న బైక్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి దీని ధర రూ.60,118 (ఎక్స్-షోరూమ్)గా ఉంది, అందువల్ల అన్ని వర్గాల వినియోగదారులు దీన్ని సులభంగా కొనుగోలు చేయగలరు. ప్రతిరోజూ ఆఫీస్, మార్కెట్ లేదా చిన్న దూర ప్రయాణాలకు ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది. ఇది లీటరుకు సుమారు 70 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

ఇంజిన్ విషయానికి వస్తే, 97.2cc పెట్రోల్ ఇంజిన్‌తో ఇది నడుస్తుంది. Hero కుటుంబానికి చెందిన ఈ ఇంజిన్ నమ్మకంగా, ఎక్కువ కాలం పనిచేస్తుందని ఇప్పటికే మార్కెట్లో తన ముద్ర వేసింది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉండటం వల్ల సిటీ రైడ్స్‌లోనూ, పొడవాటి రోడ్లలోనూ సాఫీ అనుభవాన్ని ఇస్తుంది. ఫీచర్లలోనూ దీన్ని సాధారణ రైడర్ అవసరాలకు అనుగుణంగా రూపొందించారు.


Click it and Unblock the Notifications








