దేశ ప్రజల మనసును గెలుచుకున్న హోండా.. హీరో, టీవీఎస్, బజాజ్, సుజుకి, రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ కూడా చూసేయండి!
భారతదేశ టూవీలర్ మార్కెట్‌కు జూలై 2025కు మంచి ఊపు వచ్చింది. కొనుగోలుదారుల నమ్మకంతోపాటు, పండుగ సీజన్ ముందస్తు ఆశలతో జూలై నెల మొత్తం అమ్మకాల్లో మంచి వృద్ధిని నమోదుచేసింది. దేశీయ దిగ్గజ తయారీదారుల మధ్య గత నెలలో విపరీతమైన పోటీ నెలకొంది. కొత్త మోడళ్ల రాకతో పాటు, పాత మోడళ్ల అమ్మకాలతో గత నెల ఎంతో ఆసక్తిగా గడిచిపోయింది. మొత్తం టూవీలర్ సేల్స్ పరంగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) సంస్థ అత్యధికంగా అమ్మకాలను నమోదు చేసి ఈ సెగ్మెంట్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచింది. మరో దిగ్గజ కంపెనీ హీరో మోటోకార్ప్ తో పోల్చితే హోండా మెరుగైన ప్రదర్శనను కనబరిచింది. దేశీయ మార్కెట్‌గానీ, ఎగుమతుల గానీ చూసినప్పటికీ హోండా యొక్క అమ్మకాల ఊపు స్పష్టంగా కనిపించింది.
గతంలో హీరో మోటోకార్ప్ నంబర్ వన్ పొజిషన్‌ను కొనసాగించినా, ఈసారి హోండా దానిని వెనక్కు నెట్టింది. జూలై 2025లో 6 ప్రముఖ సంస్థలు హోండా, హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్ ఆటో, సుజుకి, రాయల్ ఎన్‌ఫీల్డ్ గణనీయమైన అమ్మకాలను కనబర్చాయి. ఆరు బ్రాండ్లు కలిపి 14,99,010 యూనిట్ల దేశీయ విక్రయాలను నమోదు చేశాయి. గత సంవత్సరం అదే నెలలో విక్రయించిన 13,71,560 యూనిట్లతో పోల్చితే ఇది 9.29 శాతం వృద్ధి.

అంతేకాదు, ఈ జూలై విక్రయాలు జూన్ 2025లో నమోదైన 14,95,168 యూనిట్లతో పోల్చితే స్వల్పంగా అయినా 0.26 శాతం వృద్ధి చూపించాయి. ఈ గణాంకాలు భారతదేశంలో టూవీలర్ వాహన పరిశ్రమ కొత్త దిశగా వెళ్తోందని స్పష్టంగా సూచిస్తున్నాయి. కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడం, మైలేజ్‌కి ప్రాధాన్యం ఇవ్వడం, సరసమైన ఫైనాన్సింగ్ ఎంపికలు అందించడం వలన వినియోగదారుల ఆసక్తి తిరిగి పెరుగుతోంది.
జూలై 2025లో హోండా సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన హీరో మోటోకార్ప్‌ను వెనక్కి నెట్టింది. జూలై నెలలో హోండా అమ్మకాలు 4,66,331 యూనిట్లు నమోదు కాగా, అదే సమయంలో హీరో మోటోకార్ప్ 4,12,397 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంటే హోండా 53,934 యూనిట్ల తేడాతో హీరోపై ఆధిక్యత సాధించింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే జూలై 2024లో హోండా అమ్మకాలు 4,39,118 యూనిట్లు.

జూన్ 2025లో నమోదైన 3,88,812 యూనిట్ల నుంచి చూసుకుంటే, హోండా 19.94 శాతం నెలవారీ వృద్ధి సాధించింది. ఇక మూడో స్థానంలో Tvs 2025 జూలై నెలలో 3,08,720 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. జూన్‌లో 2,81,012 యూనిట్లను విక్రయించగా, నెలవారీగా చూసినట్లయితే ఇది 9.86 శాతం వృద్ధి. జూలై 2025లో బజాజ్ అమ్మకాల పరంగా కొంత వెనకడుగు వేసింది. దేశీయ మార్కెట్లో కేవలం 1,39,279 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
ఇది గత నెలతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. జూన్ 2025లో బజాజ్ 1,49,317 యూనిట్లు అమ్మింది. కానీ జూలైలో ఇది 6.72 శాతం తగ్గింది. నెలవారీగా ఈ తరహా తగ్గుదల కంపెనీకి ఓ హెచ్చరికగా చెప్పవచ్చు. కొత్త మోడళ్ల రాక లేకపోవడం, ముఖ్యంగా హోండా, హీరో, TVS వంటి బ్రాండ్‌ల నుంచి తీవ్రమైన పోటీ, వినియోగదారుల ప్రాధాన్యతలు స్కూటర్లు మరియు మైలేజ్ బైకులవైపు మారడం కారణంగా బజాజ్ సేల్స్ తగ్గాయి.

సుజుకి కంపెనీకి సంబంధించి జూలై 2025లో కంపెనీ 96,029 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా విశేషమైన ఫలితాలను నమోదు చేసింది. జూలై 2025లో 76,254 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇది జూలై 2024 లో 61,208 యూనిట్లు మాత్రమే ఉండేది. దీంతో కంపెనీకి 24.58 శాతం వృద్ధి లభించింది.


Click it and Unblock the Notifications








