పేరు మాత్రం ఇండియన్... కానీ అమెరికన్ బండి.. హార్లీ-డేవిడ్‌సన్ దీని ముందు జుజుబీ
ఇండియన్ మోటార్‌సైకిల్.. పేరు చూస్తే 'ఇండియన్' అని ఉంది కానీ, ఇది పక్కా అమెరికన్ బైక్ కంపెనీ. అసలు ఈ కంపెనీకి 'ఇండియన్' అనే పేరు ఎలా వచ్చిందనేది ఒక ఆసక్తికరమైన కథ. యూరప్‌లో పుట్టిన మోటార్‌సైకిళ్లను మొట్టమొదటగా అమెరికాలో తయారు చేసి, అమ్మడం మొదలుపెట్టినప్పుడు పెట్టిన పేరే ఇండియన్ మోటార్‌సైకిల్.
అమెరికాలో బైకుల అమ్మకాల్లో ముందున్న ఈ కంపెనీ, ఇండియాలో కూడా తన కొన్ని బైకులను విక్రయిస్తోంది. ఇప్పుడు ఇండియాలో అమ్ముడవుతున్న ఇండియన్ బైకులు ఏంటి, వాటి ధరలు ఎంత అనే వివరాలను కంపెనీ ప్రకటించింది.

ఇండియన్ మోటార్‌సైకిల్ అనే పేరు చూడగానే, భారత మార్కెట్‌కు తగిన తక్కువ ధర బైకులను ఈ అమెరికన్ కంపెనీ తయారు చేస్తుందని అనుకోవద్దు. హార్లీ-డేవిడ్‌సన్ బైకులకు సమానంగా, కొన్ని లక్షల రూపాయల ధరలతో ఇండియన్ మోటార్‌సైకిళ్లు అమ్ముడవుతున్నాయి.
దానికి తగ్గట్టుగానే ఈ బైకులు చాలా పవర్‌ఫుల్‌గా, అద్భుతమైన లుక్స్‌తో ఉంటాయి. ఇండియాలో అమ్ముడవుతాయని ఇండియన్ మోటార్‌సైకిల్ కంపెనీ ప్రకటించిన బైకులలో చీఫ్, చీఫ్‌టైన్, ఛాలెంజర్, స్ప్రింగ్‌ఫీల్డ్, పర్సూట్, రోడ్‌మాస్టర్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇండియన్ బైకులు ఉన్నాయి.

వీటిలో అతి తక్కువ ధరతో ప్రకటించిన బైక్ ఇండియన్ చీఫ్. దీని ఎక్స్-షోరూం ధరలు రూ.23.52 లక్షల నుండి ప్రారంభమవుతాయి. అంటే, ఇది ఇండియాలో అతి తక్కువ ధరలో లభించే ఇండియన్ బైక్. మొత్తం ఆరు రకాల వేరియంట్లలో లభించే ఇండియన్ చీఫ్ బైక్‌లో 1,890సీసీ, వి-ట్విన్ ఇంజిన్ ఉంటుంది.
దీని తర్వాత తక్కువ ధర కలిగిన ఇండియన్ బైక్ ఛాలెంజర్. దీని ఎక్స్-షోరూం ధరలు రూ.36.12 లక్షల నుండి మొదలవుతాయి. మొత్తం నాలుగు రకాల వేరియంట్లలో లభించే ఛాలెంజర్ బైక్‌లో 1,768సీసీ లిక్విడ్-కూల్డ్ వి-ట్విన్ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. అయితే, ఛాలెంజర్ బైక్ డార్క్ హార్స్ వెర్షన్‌లో 1,834సీసీ ఇంజిన్ ఉంటుంది.

దీని తర్వాత తక్కువ ధరలో చీఫ్‌టైన్ బైక్ రూ.37.11 లక్షల నుండి లభిస్తుంది. పాత కాలపు లుక్స్ ఉన్న బైకులను ఇష్టపడే వారికి చీఫ్‌టైన్ మంచి ఎంపిక. నాలుగు రకాల వేరియంట్లలో లభించే ఈ బైక్‌లో కూడా ఇండియన్ చీఫ్ బైక్‌లో ఉన్న 1,890సీసీ ఇంజిన్ నే ఉంటుంది. అదే సమయంలో కొన్ని వేరియంట్లలో 1,834సీసీ ఇంజిన్ ఆప్షన్ కూడా అందిస్తున్నారు.
ఇండియన్ స్ప్రింగ్‌ఫీల్డ్ బైక్ ఎక్స్-షోరూం ధరలు రూ.41.96 లక్షల నుంచి, పర్సూట్ బైక్ ధరలు రూ.43.19 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇండియాలో అత్యంత ఖరీదైన ఇండియన్ బైక్‌గా రోడ్‌మాస్టర్ సుమారు రూ.48.49 లక్షల ధరతో అమ్ముడవుతోంది. ఈ ఇండియన్ బైకుల్లో చాలా టెక్నికల్ ఫీచర్లు, ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు ఒకదానికొకటి షేర్ చేసుకున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఇక్కడ చెప్పిన ధరలన్నీ బైక్ ఎక్స్-షోరూం ధరలు మాత్రమే. ఆన్-రోడ్ ధరలు ఇంకా కొన్ని లక్షలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్థాయిలో లక్షల రూపాయల విలువైన ఇండియన్ బైకులు ఇండియాలో అమ్ముడవుతున్నాయి. దాదాపు రూ.50 లక్షల విలువైన ఇండియన్ రోడ్‌మాస్టర్ బైక్‌ను ఎంతమంది కొంటారో చూడాలి.


Click it and Unblock the Notifications








