ఛార్జింగ్ కోసం వెయిటింగ్ అవసరం లేదు..కేవలం 2నిమిషాల్లోనే బ్యాటరీ ఛేంజ్..రూ.57,750కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం రూ.106 పెట్టి లీటరు పెట్రోల్ కొడితే, పెట్రోల్ స్కూటర్ గరిష్టంగా 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కానీ ఈవీ అయితే, ఫుల్ ఛార్జ్‌పై 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వడంతో పాటు, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకునే అలవాటు ఉన్నట్లే, ఈవీని కూడా అలవాటు చేసుకుంటే ఇది చాలా లాభదాయకం.
ఈ మధ్య కాలంలో స్టార్టప్ కంపెనీలు భారతీయ వినియోగదారులను ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ల వైపు ఆకర్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు కేవలం ప్యాసింజర్ వెహికల్స్ మాత్రమే కాకుండా కమర్షియల్ అవసరాల కోసం కూడా ఈవీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

డెలివరీ ఉద్యోగాలు చేసే వారికి తక్కువ ఖర్చుతో వెహికల్ మెయింటెనెన్స్ చేసుకునేందుకు వీలుగా స్టార్టప్ బ్రాండ్‌లు తక్కువ ధరకే అద్భుతమైన మోడల్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లోకి ఇప్పుడు క్వాంటం బిజినెస్ ఎక్స్‌ఎస్ అనే కొత్త మోడల్ ప్రవేశించింది.
క్వాంటం ఎనర్జీ టెక్నాలజీ సహకారంతో, ఇండోఫాస్ట్ ఎనర్జీ బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్ సపోర్టుతో ఈ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. క్వాంటం బిజినెస్ ఎక్స్‌ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.57,750 మాత్రమే.

ఈ స్కూటర్‌ను బ్యాటరీ-యాస్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌లో విక్రయిస్తున్నారు కాబట్టి, కంపెనీ ఇంత తక్కువ ధరను అందించగలిగింది. ఫిక్స్‌డ్ బ్యాటరీ ఉన్న మోడల్స్‌తో పోలిస్తే ఈ మోడల్‌కు తక్కువ ప్రారంభ ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండడంతో ఇది కమర్షియల్ అవసరాలకు చాలా లాభదాయకంగా ఉంటుంది.
క్వాంటం బిజినెస్ ఎక్స్‌ఎస్ కొనుగోలుదారుల కోసం ఇండోఫాస్ట్ ఎనర్జీ నెలకు రూ.999 నుంచి ప్రారంభమయ్యే ఫ్లెక్సిబుల్ ఎనర్జీ ప్లాన్‌లు, రూ.1,499 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్‌లను అందిస్తోంది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనం కొనేటప్పుడు ఉండే అధిక ప్రారంభ ధర భారాన్ని తగ్గించుకోవచ్చు.

ఇండోఫాస్ట్ ఎనర్జీకి దేశవ్యాప్తంగా 1,100 కంటే ఎక్కువ బ్యాటరీ స్వాప్ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లను ఉపయోగించి కేవలం రెండు నిమిషాల్లో బ్యాటరీని మార్చుకోవచ్చు. దీనివల్ల ఛార్జింగ్ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం ఉండదు, రేంజ్ ఆందోళన సమస్య కూడా పరిష్కారమవుతుంది.
క్వాంటం ఎనర్జీ టెక్నాలజీ నైపుణ్యంతో రూపొందించబడిన ఈ బిజినెస్ ఎక్స్‌ఎస్ స్కూటర్ భారతీయ రోడ్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఇది మన్నిక, సామర్థ్యం, పర్యావరణ అనుకూలతను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
క్వాంటం ఎనర్జీతో భాగస్వామ్యం ద్వారా, ఇండోఫాస్ట్ నెట్‌వర్క్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,000 బిజినెస్ ఎక్స్‌ఎస్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత వచ్చే మూడు సంవత్సరాలలో 10,000 యూనిట్లను విక్రయించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ తక్కువ ధర కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్, రెండు కంపెనీల వృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
క్వాంటం బిజినెస్ ఎక్స్‌ఎస్, బిజినెస్ ఎక్స్ అనే పాత మోడల్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. కంపెనీ కొత్త మోడల్ మరిన్ని టెక్నికల్ వివరాలను ఇంకా విడుదల చేయలేదు.. కానీ అవి బిజినెస్ ఎక్స్ మోడల్‌కు సమానంగా ఉండే అవకాశం ఉంది.
బ్యాటరీ-యాస్-ఎ-సర్వీస్ లేని క్వాంటం ఎనర్జీ బిజినెస్ ఎక్స్ వేరియంట్ ధర రూ.95,009 గా ఉంది. ఈ స్కూటర్ 1.5 W పవర్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేకులతో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications








