ఏ ఊరిలోనైనా కనిపించే స్కూటర్లు ఇవే! మే నెలలో భారత్‌లో దుమ్ములేపిన టాప్ మోడళ్లు.. మీ దగ్గర ఏది ఉంది?
ప్రస్తుతం భారత మార్కెట్లో స్కూటర్లకు డిమాండ్ భారీగా ఉంది. గతంలో బైకులకు ఎక్కువ ప్రధాన్యత ఇచ్చే వారు. కానీ ఇప్పుడు ధోరణి మొత్తం మారిపోయింది. డిమాండ్ మేరకు మార్కెట్లోకి కొత్త కొత్త స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. సౌకర్యం, సరళత, మైలేజ్ ఇవన్నీ కలిపి స్కూటర్లను ఓ నమ్మకమైన వాహనంగా మార్చాయి. ఇందుకే మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద టూవీలర్ వాహన మార్కెట్లలో ఒకటిగా ఎదిగింది. ముఖ్యంగా, మే 2025 నెలలో జరిగిన స్కూటర్ అమ్మకాలు చూస్తే ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నెలలో, ఒక్కో స్కూటర్ మోడల్ దాదాపు లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. వాటిలో ఒకటి ఏకంగా 1.9 లక్షల యూనిట్లు అమ్ముకొని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
మరో మోడల్ కూడా 97 వేల యూనిట్ల అమ్మకాలతో దూసుకొచ్చింది. ఇక టాప్-10 లో నిలిచిన అన్ని స్కూటర్లను కలిపితే మొత్తం 5,49,157 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత నెల లేదా గత ఏడాదితో పోల్చితే కూడా ఓ గణనీయమైన వృద్ధిని సూచిస్తుంది. ఇంతటి భారీ సంఖ్యలో అమ్మకాలు జరగడమంటే, ప్రజలు తమ రోజువారీ అవసరాలకు స్కూటర్లను ఎంతగా ఆధారపడుతున్నారో స్పష్టమవుతుంది.

నగరాల్లో ట్రాఫిక్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేందుకు, ఇంటి పనులకోసం షాపింగ్‌కు వెళ్లేందుకు ఇలా ఎన్నో సందర్భాల్లో స్కూటర్లు ఉపయోగకరంగా ఉంటాయి. మొత్తం మీద, మే 2025 నెల స్కూటర్ మార్కెట్‌కి మరొక మైలురాయిలాంటిది. ఈ ట్రెండ్ చూస్తే, రాబోయే రోజుల్లో స్కూటర్లపై భారతీయుల ప్రేమ మరింతగా పెరిగే అవకాశమే కనిపిస్తోంది. పవర్‌ఫుల్ బైక్‌ల పట్ల ఉన్న అభిమానం ఒకవైపు ఉంటే, ప్రతి ఇంట్లోనూ స్కూటర్ ఉండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది!
2025 మే నెలలో స్కూటర్ మార్కెట్ ఒక్కసారి తిరిగి ఊపందుకుంది. మళ్లీ ఒకసారి హోండా యాక్టివా తన సత్తా చూపించింది. ఈ స్కూటర్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. కానీ, గణాంకాల ప్రకారం చూస్తే, 2024 మే నెలతో పోల్చితే యాక్టివా అమ్మకాలు కొంత తగ్గాయి. గత ఏడాది మేలో హోండా ఏకంగా 2,16,352 యూనిట్లు విక్రయించింది. కానీ ఈసారి అదే మోడల్ 1,90,713 యూనిట్ల వద్ద ఆగిపోయింది.

అంటే దాదాపు 25,639 యూనిట్ల తేడా. ఇది హోండా యాక్టివాకు స్వల్ప వెనుకడుగే అయినా, మొత్తంగా స్కూటర్ విభాగంలో ఈ మోడల్‌కి ఉన్న ఆదరణ మాత్రం ఇప్పటికీ మిగిలే ఉంది. ఈ విభాగంలో మిగిలిన బ్రాండ్లు మాత్రం గట్టిగానే పోటీ ఇస్తున్నాయి. హోండా తరువాత స్థానం దక్కించుకున్నది TVS జూపిటర్. మే 2025లో జూపిటర్‌ను ఏకంగా 97,606 మంది ఎంచుకున్నారు. ఇది 2024 మే నెలతో పోలిస్తే పెద్ద పెరుగుదలే.
అప్పట్లో జూపిటర్ అమ్మకాలు 75,838 యూనిట్ల దగ్గరే నిలిచాయి. అంటే ఈసారి దాదాపు 21,768 యూనిట్ల పెరుగుదల కనిపించింది. ఇది TVS మోటార్‌కి వచ్చిన విశ్వాసాన్ని, వినియోగదారుల నమ్మకాన్ని చూపించే అద్భుత సంకేతం. మూడవ స్థానంలో నిలిచిన స్కూటర్ సుజుకీ యాక్సెస్ 125. ఇది కూడా వినియోగదారుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. మే 2025లో 75,778 యూనిట్లు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా పవర్, మైలేజ్, స్టైల్‌తో యాక్సెస్ ఆకర్షిస్తోంది.

నాలుగవ స్థానంలోకి వచ్చినది TVS XL. ఇది సాధారణంగా మినీ మోటార్ బైక్‌గా పరిగణించబడినా, మార్కెట్‌లో స్కూటర్ల స్థానంలోకి కూడా రావడం వల్ల చేర్చడం జరిగింది. మే 2025లో ఇది 37,264 యూనిట్లు అమ్ముడైంది. ఐదవ స్థానంలో TVS iQube, ఎలక్ట్రిక్ విభాగంలో ఒక దుమ్ము రేపిన స్కూటర్. ఇది మే 2025లో 27,642 యూనిట్లు అమ్ముడవగా, 2024లో 17,230 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. ఇది 10,412 యూనిట్ల పెరుగుదల.


Click it and Unblock the Notifications








