అరుదైన బైక్‌ను విడుదల చేసిన జావా.. అదృష్టం అంటే ఈ బైక్‌ను సొంతం చేసుకున్న వాళ్లదే
ఇండియాలో రెట్రో క్లాసిక్ టూవీలర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఈ సెగ్మెంట్‌లో దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉంటుంది. మార్కెట్లోకి ఈ కంపెనీకి పోటీగా చాలా టూవీలర్ తయారీదారులు వచ్చినప్పటి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను మాత్రం ఎవరు దాటలేకపోయారు. అయితే దీనికి పోటీగా రెట్రో క్లాసిక్ టూవీలర్స్‌ను విడుదల చేస్తూ భారత్‌లో ప్రసిద్ధ కంపెనీగా అవతరించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ నెమ్మదిగా ఇక్కడి మార్కెట్లో వాటాను పెంచుకుంటున్న జావా కొత్తగా అదిరిపోయే బైక్‌ను మార్కెట్లోకి దింపింది. దీని పేరు 'జావా 350 లెగసీ (jawa 350 legacy)'. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గతంలో విడుదల అయిన క్లాసిక్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న మోడల్. ఈ బైక్‌కు పోటీ ఇప్పటి వరకు ఏది రాలేకపోయంది. అయితే దీనిని ఎదుర్కోవడానికి జావా తన 50 లెగసీని విడుదల చేసింది.
350cc ఇంజిన్ విభాగంలో ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా ఈ కొత్త మోడల్ బలమైన ప్రత్యర్థి అవుతుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. జావా 350 లెగసీ ఎడిషన్ ప్రారంభ ధర రూ.1,98,950 (ఎక్స్-షోరూమ్). ఆన్‌రోడ్ వచ్చే సరికి మరింత ఎక్కువగా ఉంటుంది. రెట్రో క్లాసిక్ టూవీలర్స్‌ను భారతీయ ప్రజలు చాలా ఆదరిస్తారు. మార్కెట్లోకి ఇతర మోడళ్లు లాంచ్ అయినప్పటికీ కూడా వీటి సేల్స్ మాత్రం అనుకున్నంత ఆశాజనకంగానే ఉంటున్నాయి.

ఈ క్రమంలో 350 లెగసీ ఎడిషన్ అందరిని ఆకట్టుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఈ బైక్‌ను కంపెనీ కేవలం 500 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇది పరిమిత ఎడిషన్‌గా వినిమయోగదారులకు అందుబాటులో ఉంటుంది. కొనుగోలు దారులకు ఈ బైక్ క్రోమ్, సాలిడ్ వేరియంట్లలో లభిస్తుంది. కస్టమర్లకు నచ్చే విధంగా పలు కలర్ వేరియంట్లలో అందిస్తున్నారు. దీన్ని దేశవ్యాప్తంగా జావా డీలర్‌షిప్‌లలో కొనచ్చు.
జావా 350 లెగసీ ఎడిషన్ వైబ్రెంట్ మిస్టిక్ ఆరెంజ్, అబ్సిడియన్ బ్లాక్, టైమ్‌లెస్ మెరూన్, కమాండింగ్ బ్లాక్, స్టన్నింగ్ డీప్ ఫారెస్ట్ వంటి కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇది టూర్స్ ప్లాన్ చేసే వారికి అత్యంత అనువైన బైక్. రైడర్లకు టూరింగ్‌కు అనుకూలంగా ఉండేలా అదనంగా ఉపకరణాలను సైతం జోడించారు. పిలియన్ బ్యాక్‌రెస్ట్, టూరింగ్ వైజర్, ప్రీమియం క్రాష్ గార్డ్ వంటి వాటిని బైక్‌కు అందిస్తున్నారు.

ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే, 334cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 22.5 bhp పవర్, 28.1 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు. ఈ బైక్ ల్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో వచ్చింది. దీని ఇంజిన్ పనితీరు అద్భుతంగా ఉంటుందని జావా పేర్కొంటుంది. పొడవైన వీల్‌బేస్,వె డల్పు టైర్లతో రైడర్లకు కంఫర్ట్ సౌకర్యాన్ని అందిస్తుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ 178 mmగా ఉంది. సస్పెన్షన్ మెరుగ్గా ఉంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్వర్లను కలిగి ఉంది. బ్రేకింగ్ గురించి చూసినట్లయితే రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, అదనపు రక్షణ కోసం డ్యూయల్-ఛానల్ ABS సిస్టం వంటివి ఉన్నాయి. ఈ జావా 350 లెగసీ ఎడిషన్ భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా CB350 వంటి వాటికి బలమైన పోటీని ఇస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








