ఈ బైక్ ధర చాలా తగ్గబోతోంది! పైగా బరువు తగ్గి, మైలేజ్ పెరుగుతుంది.. జావా లవర్స్ ఇది మిస్సవ్వకూడదు

జావా మోటార్ సైకిల్స్ (jawa motorcycles) చాలా కాలంగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన టూవీలర్స్‌ను విడుదల చేస్తుంది. తాజాగా విడుదల చేసిన '42 FJ' మోడల్‌ ఇప్పుడు బైక్ ప్రేమికుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది సెప్టెంబర్ 2024లో లాంచ్ అయిన జావా 42 సిరీస్‌కు కొనసాగింపు కాగా, సరికొత్త డిజైన్, సాంకేతికత పరంగా కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌‌లతో మార్కెట్లోకి వచ్చింది. సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో కూడిన ఈ బైక్, డబుల్ ఎగ్జాస్ట్ పైపులు కలిగిన రూపంలో మొదట పరిచయం కావడం వలన చాలా మంది యువత దృష్టిని ఇది ఆకర్షించింది. రెండు వైపులా పైపులు రావడం ఈ సెగ్మెంట్‌లో ఉన్న బైక్‌లలో చాలా రేర్‌గా ఉంటే, జావా ఈ ఫీచర్‌తో 42 FJ ను ప్రత్యేకంగా నిలిపింది.

ఈ బైక్‌ను తాత్కాలికంగా డబుల్ ఎగ్జాస్ట్ డిజైన్‌లో మాత్రమే విడుదల చేసి, తర్వాత దీన్ని ఒక వైపు మాత్రమే ఎగ్జాస్ట్ పైపు ఉండేలా విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుకు కారణం, ఇటీవల వెలువడిన కొన్ని ఫోటోల్లో 42 FJ బైక్ కేవలం ఒకవైపు మాత్రమే ఎగ్జాస్ట్ పైపు కలిగి ఉండటం కనిపించింది. ప్రత్యేకంగా, ఎరుపు రంగు నంబర్ ప్లేట్‌తో ఉన్న ఈ బైక్ రోడ్లపై కనిపించింది.

Jawa 42 Fj Single Exhaust Bike Spotted

సాధారణంగా వాహన తయారీ సంస్థలు తమ కొత్త మోడళ్లను రోడ్డుపై పరీక్షించేందుకు తీసుకెళ్లినప్పుడు, వీటిపై తాత్కాలిక ఎరుపు రంగు నంబర్ ప్లేట్ అమర్చడం అనేది సాధారణంగా కనిపిస్తుంది. షోరూమ్ అవసరాలు, అంతర్గత వినియోగం, లేదా రోడ్ టెస్టింగ్ కోసం ఇలా చేస్తుంటరు. ఈ నేపథ్యంలో తాజాగా జావా మోటార్ సైకిల్స్ కొత్త 42 FJ బైక్‌ను సింగిల్ ఎగ్జాస్ట్ పైపుతో రోడ్డుపై పరీక్షించిన ఫోటోలో తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఇప్పటివరకు మార్కెట్లో డబుల్ ఎగ్జాస్ట్ డిజైన్‌తో కనిపించిన 42 FJ బైక్, ఇప్పుడు ఒక్క ఎగ్జాస్ట్ పైపుతో కనిపించడమంటే, కంపెనీ తన భారత వినియోగదారులను ఆకర్షించడానికి ఈ కొత్త ప్రయోగం చేస్తుందని అర్ధం అవుతుంది. ముఖ్యమైన విషయమేమిటంటే, రెండు ఎగ్జాస్ట్ పైపులను తొలగించి ఒకదాన్ని మాత్రమే ఇవ్వడం వల్ల బైక్ మొత్తం బరువు గణనీయంగా తగ్గుతుంది. ఈ మార్పు కేవలం లుక్‌లోనే కాకుండా, పనితీరులోనూ స్పష్టంగా కనిపించనుంది.

Jawa 42 Fj Single Exhaust Bike

బరువు తగ్గించబడిన బైక్‌ను రైడ్ చేయడం మరింత సులభం అవుతుంది. స్పోర్టీ ఫీల్‌తో పాటు, మెరుగైన హ్యాండ్లింగ్‌ను ఈ సరికొత్త 42 FJ అందించగలదన్న నమ్మకాన్ని జావా పేర్కొంటుంది. క్లాసిక్ డిజైన్‌కు లేటెస్ట్ ట్యూనింగ్‌తో వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు మారుతున్న డిజైన్ తప్పనిసరిగా ఆకట్టుకోనుంది. సింగిల్ ఎగ్జాస్ట్ పైప్‌తో కూడిన 42 FJ ఇంజిన్ పనితీరును మరింత మెరుగవుతుంది.

ఎగ్జాస్ట్ పైపుల సంఖ్యను రెండు నుండి ఒకటికి తగ్గించడం వల్ల, బైక్ తేలికపడే అవకాశం ఉంది. దీంతో మైలేజీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో మార్పు చేసినా, ఇంజిన్, గేర్‌బాక్స్ సెటప్ విషయంలో జావా ఎలాంటి మార్పులు చేయనట్లు తెలుస్తుంది. అంటే, ప్రస్తుత 42 FJ బైక్‌కు ఉపయోగించిన అదే మెకానికల్ సెటప్‌ను కొత్త వెర్షన్‌కి కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

Jawa 42 Fj Single Exhaust Bike Spotted On While Testing In India

ప్రస్తుతం అమ్ముడవుతున్న జావా 42 FJ బైక్‌లో 334cc సామర్థ్యం కలిగిన సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 28.7 bhp పవర్, 29.62 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ముందు భాగంలో 18-అంగుళాల వీల్ ఉండగా, వెనుక భాగంలో కొంచెం చిన్నదైన 17-అంగుళాల వీల్ ఉంటుంది. కొత్త మోడల్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, April 20, 2025, 11:00 [IST]
English summary
Jawa 42 fj single exhaust bike spotted on while testing in india details
Read more on: #jawa motorcycles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+