తగ్గేదేలే... నువ్వా-నేనా? హంటర్ 350 Vs జావా 42 FJ.. ఫ్యాన్స్ కోసం పవర్‌ఫుల్ కంపారిజన్
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రసిద్ధ మోడల్ హంటర్ 350ని మళ్లీ కొత్తగా అప్‌డేట్ చేసి భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2022లో తొలిసారి ప్రవేశపెట్టిన ఈ బైక్, ఇప్పుడు కొత్త ఫీచర్లతో, ఇంకా ఆకర్షణీయమైన రూపంతో రీ-ఎంట్రీ ఇచ్చింది. హంటర్ 350 అనేది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, ఇది స్టైల్, హ్యాండ్లింగ్ వంటి పలు ప్రత్యేకతల కలయిక. ఈ బైక్, కంపెనీకి అత్యధిక విక్రయాలను తీసుకువచ్చిన క్లాసిక్ 350, బుల్లెట్ 350 మోడళ్లతో సమానంగా నిలిచే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా యువతలో దీనికి విపరీతమైన ఆదరణ ఉంది. హంటర్ 350 ప్రత్యేకత ఏమిటంటే, ఇది ట్రెడిషనల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ డిజైన్‌ను మోడ్రన్ టచ్‌తో కలిపి రైడర్లను అట్రాక్ట్ చేస్తుంది.
మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు పోటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హంటర్ 350కి కఠినంగా ఉంటుంది. వాటిలో ప్రముఖమైనది జావా 42 (JAWA 42). జావా బ్రాండ్ గురించి బైక్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది కూడా క్లాసిక్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్, అధునాత రైడింగ్ అనుభవంతో మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. జావా బ్రాండ్‌కి భారతీయ యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది.

కొద్ది కాలం పాటు కనిపించకుండ పోయిన ఈ బ్రాండ్, తిరిగి "జావా 42" పేరుతో తన రీ ఎంట్రీని బలంగా ఇచ్చింది. పేరులో 42 అనే సంఖ్య ఉన్నా, ఇది 300సీసీ శ్రేణిలోకి వచ్చే బైక్. ఈ బైక్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు గట్టి పోటీగా నిలుస్తోంది, ముఖ్యంగా హంటర్ 350కు బలమైన పోటీ దారుగా నిలుస్తూ అమ్మకాల్లో నువ్వా నేనా అన్నట్లుగా దూసుకుపోతున్నాయి.
రెండు కంపెనీలూ తమ బైక్‌లను తాజాగా అప్‌డేట్ చేసి విడుదల చేశాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన హంటర్ 350ను తక్కువ స్థాయిలో కొత్త మార్పులతో తీసుకురాగా, జావా మాత్రం 42 మోడల్‌ను మరింత పూర్తిగా అప్‌డేట్ చేసింది. సెప్టెంబర్ 2024లో మార్కెట్లోకి విడుదల అయిన కొత్త జావా 42 బైక్ పేరును జావా 42 FJగా మార్చారు. అలాగే, దీని ఇంజిన్‌ను కూడా పూర్తి మార్చేశారు.

జావా 42 తాజా మోడల్ ఇప్పుడు మెరుగైన డిజైన్, మోడరన్ ఫీచర్లు అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్‌తో వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో కొత్త 2025 హంటర్ 350 బైక్, జావా 42 FJ బై కోనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. వీటి ఇంజిన్, ధర, మైలేజ్, ఇతర ఫీచర్స్ మధ్య ఉన్న సారూప్యతలు, తేడాల గురించి కింది కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.
డిజైన్: హంటర్ 350 బైక్, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇతర మోడళ్లతో పోలిస్తే కొంచెం తేలికగా, వేగంగా స్పందించేలా, స్టైలిష్‌గా కూడా ఉంటుంది. దీని ఆకట్టుకునే డిజైన్ చాలా మంది యువతలను ఆకర్షిస్తుంది. 2025 అప్‌డేట్‌లో రూపంలో పెద్ద మార్పులు ఏమీ చేయకపోయినా, కొన్ని కొత్త విజువల్ గ్రాఫిక్స్ హంటర్‌కి కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఇది రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ అనే 3 కొత్త కలర్స్‌లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.
ఇక జావా 42 FJ విషయానికి వస్తే, సాధారణ జావా 42 మోడల్‌తో పోలిస్తే, కొత్తది మరింత అగ్రెసివ్ డిజైన్, బోల్డ్ గ్రాఫిక్స్, స్ట్రీట్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇది కేవలం క్లాసిక్ మోడల్‌లి కాకుండా, సిటీ రైడింగ్ కోసం మంచి లుక్‌తో ముందుకు వచ్చింది. ముఖ్యంగా యూత్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ, స్పోర్టియర్ హ్యాండిలింగ్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, రెడీ టు రేస్ స్టాన్స్‌తో దీన్ని డిజైన్ చేశారు.
ఇంజిన్: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇంజిన్ తాజా OBD-II ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ అయింది. దాని పవర్ డెలివరీలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది అంతకుముందులాగే 349cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 20.2 Bhp పవర్, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఈ ఇంజిన్‌కు జోడించారు. ఇంకా కొత్త స్లిప్ & అసిస్ట్ క్లచ్‌ను జత చేయడం జరిగింది.
ఇదిలా ఉండగా, జావా 42 FJ అయితే మెకానికల్‌గా మరింత అప్‌డేట్ అయింది. . పాత 294.7cc ఇంజిన్‌ను మార్చి, ఇప్పుడు దీనిలో 334cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది గరిష్టంగా 28.7 bhp పవర్, 29.62 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్ కూడా ఉంది. మొత్తానికి జావా 42 FJ బైక్ మరింత శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్ అవుతుంది.
సస్పెన్షన్ & బ్రేక్‌లు: 2025 హంటర్ 350 బైక్‌లో చేసిన కీలకమైన మార్పుల్లో ఒకటి వెనుక సస్పెన్షన్ సెటప్. గత మోడల్‌లో ఉన్న సన్నని కాయిల్స్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకొని, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈసారి అదే సెటప్‌కు అదనపు కాయిల్స్‌ను జోడించింది. దీని వలన ప్రమాదకరంగా గడ్డకట్టు రోడ్లపై కూడా బైక్ మృదువుగా వెళ్తుంది.
ఈ బైకులో ముందు భాగంలో 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్ అందించారు. దీని వలన హ్యాండ్లింగ్ మరింత మెరుగవుతుంది. బ్రేకింగ్ వ్యవస్థ విషయానికి వస్తే, హంటర్ 350 ముందు వీల్‌లో డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంది. ఇది సింగిల్-ఛానల్ ABS తో వస్తుంది, ఇది సాధారణంగా నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే, హైవేలు, స్పీడుగా ప్రయాణించే సందర్భాల్లో ఇది కొద్దిగా తక్కువ సేఫ్టీని కలిగించవచ్చు.
ఇదిలా ఉండగా, జావా 42 FJ బైక్‌లో సస్పెన్షన్ మరింత లేటెస్ట్‌గా ఉంటుంది. ముందు 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక 5-వే ప్రీలోడ్ సర్దుబాటు చేయగల షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంటుంది. జావా 42 FJ బ్రేకింగ్ వ్యవస్థలో ముందు, వెనుక రెండూ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. అంతేకాకుండా డ్యూయల్-ఛానల్ ABS కలిగి ఉంది. ఇది హై స్పీడ్ బ్రేకింగ్ సమయంలో రక్షణ కలిగించడమే కాకుండా, డ్రైవింగ్ అనుభూతిని మెరుగుపరుస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








