కొత్త e-స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 118 కి.మీ.ల దూరం తిరుగులేకుండా వెళ్లవచ్చు!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. టూ వీలర్ వినియోగదారుల్లో చాలామంది ఇప్పుడు ఈవీలవైపు మొగ్గుచూపుతున్నారు. ఓలా, ఏథర్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఈ రంగంలో సత్తా చాటుతున్నాయి. మరోవైపు కొన్ని స్టార్టప్ సంస్థలు కూడా తమ ఈవీలతో మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. భారతీయ వినియోగదారులు వాహనం బాగుంటే చాలు.. బ్రాండ్‌తో సంబంధం లేకుండా.. ఈవీలను ఆదరిస్తూ వస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నాసిక్‌కు చెందిన జితేంద్ర ఈవీ అనే టూ వీలర్ స్టార్టప్ సంస్థ తమ కొత్త మోడల్‌తో మార్కెట్లోకి వచ్చేసింది. యూనిక్ పేరుతో తీసుకువచ్చిన ఈ ఇ-స్కూటర్‌ను అనేక ప్రత్యేకతలతో తయారు చేసింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
జితేంద్ర యూనిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ విషయానికి వస్తే.. ఇది ఒకప్పటి ఫేమస్ మోడల్ అయిన పియాజియో వెస్పా స్కూటర్‌ను గుర్తుకు తెస్తోంది. ఇక దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.24 లక్షలుగా ఉంది. జనవరి 15 నుంచి తమ ఈవీలను డెలివరీ ప్రారంభించనున్నట్లు జితేంద్ర ఈవీ సంస్థ తెలిపింది. ఈ స్కూటర్ల సేల్స్ కోసం ప్రత్యేక మార్కెటింగ్ స్ట్రాటజీతో కంపెనీ వస్తోంది.

ఇదే మోడల్‌లో మరో రెండు కొత్త వేరియంట్లను కూడా లాంచ్ చేయనున్నట్లు జితేంద్ర ఈవీ సంస్థ ప్రకటించింది. యూనిక్ లైట్, యూనిక్ ప్రో అనే రెండు వేరియంట్లను ఈ ఏడాది అక్టోబరు నాటికి అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. వీటి ప్రారంభ ధరలు రూ.92,000 గా ఉంటుందని వెల్లడించింది. వీటి రాకతో మార్కెట్‌లో ఈ స్కూటర్లు మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది.
ఇక జితేంద్ర యూనిక్ మోడల్... 3.8 kW LMFP రిమోవెబుల్ బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 118 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ యూనిక్ ఎలక్ట్రిక్ స్కూటర్... స్పిన్ స్విచ్ రైడింగ్ మోడ్‌లతో కూడిన హైపర్‌గేర్ పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంటుంది. ఈ తరహా పవర్‌ట్రైన్ ఉండడం.. ఈవీల్లో ఇదే తొలిసారి అని జితేంద్ర ఈవీ సంస్థ తెలిపింది.

ఈ స్కూటర్ ఫర్ఫామెన్స్‌లోనూ మేటి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది 75 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. అంతేగాకుండా అనేక ఆధునాతన ఫీచర్లను జోడించి దీన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిలో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, 12 అంగుళాల ట్యూబ్ లెస్ టైర్లు, అలాయ్ వీల్స్, సేఫ్టీ విషయంలో సైడ్ స్టాండ్ సెన్సార్లను ఈ ఈవీ కలిగి ఉంటుంది.
ఈ ఫీచర్లతో ప్రత్యర్థి సంస్థలకు ఇది గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. అంతేగాకుండా ఈ ఈవీలో... కీలెస్ ఎంట్రీ, USB ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్ డిజిటల్ LED క్లస్టర్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ యూనిక్ స్కూటర్ Chrome Arc LED హెడ్ ల్యాంప్స్, Radiant Hex LED టెయిల్ ల్యాంప్స్, ఈగల్ విజన్ LED బ్లింకర్స్ వంటివి దీనికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.

బ్లూటూత్ కెనక్టెడ్ బ్యాటరీ సదుపాయం ఇందులో ఉంటుంది. ఇది థర్మల్ ప్రొపగేషన్ అలర్ట్‌తో JENi యాప్‌తో అనుసంధానించి ఉంటుంది. ఇది మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించగలరు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి వైడ్-రేంజ్ యాక్సెససరీస్‌ని కూడా వినియోగదారుల కోసం జితేంద్ర ఈవీ సంస్థ తయారు చేసింది. అందులో ఒకటి.. బ్లూటూత్ కనెక్టివిటీతో ఉండే UniCrown Smart Technology helmet. దీని ద్వారా కాల్స్, మ్యూజిక్, నేవిగేషన్ వంటి వాటిని వినియోగించుకోవచ్చు.
రియర్ ప్యాసెంజర్ హెల్మెట్, స్టోరేజ్ కోసం యునికేస్ బ్యాగ్, పంక్ఛర్ అయినప్పుడు ఉపయోగపడే యునికార్ట్ బూస్టర్ వంటివి కూడా ఉన్నాయి. దీని బ్యాటరీపై మూడేళ్లు లేదా 50,000 కి.మీల వారంటీని అందిస్తోంది. ఇది Meadow Green, Dusk Blue, Forest White, Volcano Red and Eclipse Black అనే ఐదు కలర్ ఆప్షన్స్‌లో ఈ స్కూటర్ అందుబాటులో ఉన్నట్లు జితేంద్ర ఈవీ సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications








