సంచలన ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. ఇలాంటిది మళ్లీ రాదేమో!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. ఓలా, ఏథర్ వంటి ఈవీ దిగ్గజ కంపెనీలు దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌పై కన్నేసి పోటా పోటీగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన వాహనాలను విడుదల చేస్తున్నాయి. వీటికి పోటీగా మరో కంపెనీ కూడా తన లాంచ్‌లతో దూసుకుపోతుంది. అదే జాయ్ ఈవీ తయారీదారు. వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ ఆధ్వర్యంలోని జాయ్ ఈ-బైక్, భారతీయ మార్కెట్‌లో తన ప్రత్యేకతను చూపించేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం, ఈ కంపెనీ తన పోటీదారులపై ఒత్తిడి పెంచేలా మరోసారి ముందుకు వచ్చింది. ప్రజాధారణ పొందిన తన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేకంగా డిస్కౌంట్లు ప్రకటించింది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కంపెనీ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది.
జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించడం ఇది కొత్తేమీ కాదు. ఈ బ్రాండ్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా ధరలు తగ్గిస్తూ వస్తుంది. ఈ కంపెనీ, ఈసారి కూడా తన ప్రసిద్ధ మోడళ్లపై ఆకర్షణీయమైన తగ్గింపులు ప్రకటించి మార్కెట్‌లో తన కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఇది కీలక ప్రయత్నం అని చెప్పవచ్చు. జాయ్ కంపెనీ ఇస్తోన్న తగ్గింపు వివరాల గురించి కింది కథనంలో తెలుసుకుందాం.

కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.14,000 కంటే ఎక్కువ ధరలను తగ్గించినట్లు ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం Wolf 31AH, Gen Next 31AH, Nano Plus, Wolf Plus, Nano Eco, Wolf Eco వంటి ఎంపిక చేసిన జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై కంపెనీ భారీ ఎత్తున ఈ డిస్కౌంట్స్ అందిస్తుంది. వోల్ఫ్ 31AH ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.72,000 నుండి ఏకంగా రూ.14,251 తగ్గి రూ.57,749కి చేరుకుంది.
ఇదే విధంగా, 31AH మోడల్ రూ.13,301 తగ్గింపుతో, రూ.70,000 స్థాయిలో ఉండగా ఇప్పుడు కేవలం రూ.56,699కే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అలాగే, టాప్ క్లాస్ ఫీచర్స్ కలిగిన నానో ప్లస్ మోడల్‌పై కంపెనీ రూ.86,000 నుండి ధరను తగ్గించి రూ.73,604కి అందిస్తుంది. వోల్ఫ్ ప్లస్ మోడల్ ధరలో ఏకంగా రూ.14,346 తగ్గించి, మునుపటి రూ.89,000ను రూ.74,654కి పరిమితం చేసింది.
ఇది తక్కువ బడ్జెట్‌తో శక్తివంతమైన ఈవీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక పెద్ద అవకాశంగా చెప్పవచ్చు. అలాగే, నానో ఎకో మోడల్ ధర రూ.75,000 నుంచి రూ.7,696 తగ్గి రూ.67,304గా నిర్ణయించారు. మరొక ముఖ్యమైన మోడల్ అయిన వోల్ఫ్ ఎకో స్కూటర్‌కు గతంలో రూ.80,000 వెచ్చించాల్సి వస్తే, ఇప్పుడు కేవలం రూ.68,354తోనే ఇది లభిస్తోంది. కంపెనీ ఈ మోడల్‌పై రూ.11,646 తగ్గింపును ఇస్తుంది.
అయితే, ఈ తగ్గింపులు కేవలం తక్కువ-స్పీడ్ మోడళ్లకే వర్తిస్తాయని కంపెనీ స్పష్టంగా తెలిపింది. మిహోస్, నెమో వంటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ ఆఫర్లు లేవు. తక్కువ-స్పీడ్ స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 25 కి.మీ.లకే పరిమితం చేశారు. మరో కీలక విషయం ఏమిటంటే వీటికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. దీంతో విద్యార్థులు, పెద్దవాళ్లు, నగరాల్లో చిన్న దూరాల ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.
ఈ కంపెనీకి ఇండియాలో దాదాపు 400 కి పైగా నగరాల్లో కంపెనీ నెట్వర్క్ కలిగి ఉన్నందున సర్వీస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పోటీ మార్కెట్లో జాయ్ ఈ-బైక్, ఒకినావా, ఆంపియర్ లాంటి ప్రముఖ కంపెనీలతో పోటీ పడుతోంది. ఒకేసారి స్కూటర్ ధరల్లో రూ.14,000 దాకా తగ్గించడం వల్ల కొత్తగా ఈవీ టూవీలర్ కావాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








