మూడేళ్లలో రూ.లక్ష ఆదా చేస్తుంది.. కిమీకు కేవలం 25పైసలే ఖర్చు.. మార్కెట్లోకి వచ్చేసిన మొదటి ఎలక్ట్రిక్ బైక్

మేటర్ కంపెనీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా గేర్‌తో కూడిన ఎలక్ట్రిక్ బైక్ ఏరాను విడుదల చేసింది. రూ.1.93 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ బైక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 173 కి.మీ.ల వరకు వెళ్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్‌లో ప్రయాణించడం ద్వారా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మేటర్ కంపెనీ భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌లను తయారుచేస్తున్న ముఖ్యమైన సంస్థలలో ఒకటి. సాధారణంగా భారతదేశంలో అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ బైక్‌లకు గేర్లు ఉండవు, అవి సివిటి గేర్‌బాక్స్‌లతో వస్తాయి. కానీ మేటర్ ఏరా బైక్ మాత్రం 4-స్పీడ్ మాన్యువల్ గేర్ ఆప్షన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది.

Matter Aera

మేటర్ ఏరా బైక్ భారతదేశంలో రూ.1.93 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ బైక్ ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది. క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ బైక్ అమ్మకాలను విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.

ఏరా బైక్‌లో హైపర్ స్విఫ్ట్ 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అమర్చారు. ఇది మాన్యువల్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్, కనెక్టెడ్ సిస్టమ్‌లను కలిపి రూపొందించిన కొత్త టెక్నాలజీ. ఇది ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో ఒక కొత్త విభాగాన్ని సృష్టించింది. ఈ వాహనం మేటర్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది.

Matter Aera

ఈ బైక్‌లో 5kWh సామర్థ్యం గల హై పవర్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనికి ఐపీ 67 రేటింగ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఈ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 173కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు, ఈ బైక్ కేవలం 2.8 సెకన్లలో 0-40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇందులో లిక్విడ్ కూల్డ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడింది.

మేటర్ ఏరా బైక్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డు ఉంది. ఇందులో నావిగేషన్, రైడ్ డేటా, మ్యూజిక్ కంట్రోల్, ఓటిఏ అప్‌డేట్‌లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, ఈ బైక్‌కు రెండు చక్రాలపై ఏబీఎస్ తో కూడిన డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఉంది. ఇందులో డ్యూయల్ సస్పెన్షన్ సిస్టమ్తో పాటు పార్క్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది.

Matter Aera

ఈ బైక్‌ను మేటర్‌వర్స్ యాప్ ద్వారా ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో రైడ్ వివరాలు, రిమోట్ లాక్, అన్‌లాక్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, స్మార్ట్ కీ లెస్ రైడింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌లో ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి కేవలం 25పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ బైక్‌ను 3 సంవత్సరాలు నిరంతరం నడిపితే రూ.లక్ష వరకు ఆదా అవుతుందని ఆ కంపెనీ తెలిపింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మేటర్ ఏరా బైక్ భారతదేశంలోనే పూర్తిగా డిజైన్ చేసి, తయారు చేయబడింది. అందుకే ఇది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని ఆశించవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, July 4, 2025, 14:34 [IST]
English summary
Just 25 paisa per km matter aera electric bike creates sensation is the price really this low
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+