రైడర్ల కలల బైక్.. కవాసకి నుంచి మరో స్టైలిష్ మోడల్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

జపనీస్ కంపెనీ కవాసకి (Kawasaki) ఇండియాలో చాలా ఏళ్లుగా వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. అదిరిపోయే డిజైన్లతో యూత్‌ను ఆకట్టుకునే టూవీలర్స్‌ను విడుదల చేస్తుంది. కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూనే అదే సమయంలో తన పాత వాటిని ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త అప్‌డేట్‌లను జోడించి విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా తన ప్రీమియం అడ్వెంచర్ టూర్ బైక్ వెర్సిస్ 650 (versys 650)ను తాజా మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్‌తో విడుదల చేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, కొత్త దానిలో ఆకట్టుకునే అప్‌డేట్స్ బోలేడు ఉన్నాయి. ఈ కొత్త వెర్షన్, మోడల్ ఇయర్ 2025 (MY25), భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేస్తున్న తాజా BS6 ఫేజ్ 2 OBD2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది.

దీని ద్వారా బైకు నుంచి తక్కువ మొత్తంలో కాలుష్య కారకాలు విడుదల అవుతాయి. దీంతో పర్యవరణానికి మేలు కలుగుతుంది. ధర విషయానికొస్తే, కొత్త వెర్సిస్ 650ని కంపెనీ రూ. 7.93 లక్షల(ఎక్స్-షోరూం) ధరతో మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇది గత మోడల్ అయిన MY24 వెర్షన్ కంటే రూ. 16,000 ఎక్కువ. ఈ పెరిగిన ధరను చూస్తే, అప్‌డేట్ చేసిన ఉద్గార ప్రమాణాల అమలుతో వచ్చిన మార్పులు ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది.

Kawasaki 2025 versys 650 Motorcycle

ఇక పాత MY24 వెర్షన్ విషయానికి వస్తే, కవాసకి అధికారిక వెబ్‌సైట్ నుంచి అది తొలగించినట్లుగా తెలుస్తుంది. కానీ కొన్ని డీలర్‌షిప్‌ల వద్ద మాత్రం ఇప్పటికి మిగిలిన స్టాక్‌ కొంత వరకు ఉండే అవకాశం ఉంది. పైగా, ఈ వెర్షన్‌పై రూ. 20,000 వరకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కూడా లభించాయి, అంటే బడ్జెట్ పరంగా చూడదగిన ఆప్షన్‌గా మిగిలిపోతుంది. రెండు వెర్షన్ల మధ్య చాలా తేడాలు గమనించవచ్చు.

కవాసకి ఇప్పటికే నింజా 500, ఎలిమినేటర్ 500, నింజా 650 వంటి మోడళ్లను BS6 P2 ప్రమాణాలకు అప్‌డేట్ చేసిన నేపథ్యంలో, ఇప్పుడు వెర్సిస్ 650 కూడా అదే విధంగా అప్‌డేట్ చేసింది. 2025 కవాసకి వెర్సిస్ 650 ఇప్పుడు భారత మార్కెట్‌లో మెటాలిక్ మ్యాట్ గ్రాఫెనెస్టీల్ గ్రే అనే కొత్త కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది మునుపటి మోడల్ అయిన MY24 వెర్షన్‌తో పోలిస్తే స్పష్టమైన అప్‌డేట్.

Kawasaki 2025 versys 650 Motorcycle Launch Details

గతంలో వెర్సిస్ 650 రెండు వేర్వేరు కలర్స్, మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ డార్క్ గ్రే‌లో కొనుగోలుకు ఉంది. ఈసారి, కొత్త గ్రాఫెనెస్టీల్ గ్రే షేడ్ బైక్‌కు మాడ్రన్ లుక్‌ను అందిస్తుంది. బైక్ డిజైన్‌లో ఎక్కువ భాగం గ్రే, బ్లాక్ టోన్లలో ఉండగా, కాంట్రాస్ట్‌ కోసం ఆకుపచ్చ మచ్చలు గమనించవచ్చు. ఇవి కవాసకి బ్రాండ్‌కు చిహ్నంగా మారిన ఆకుపచ్చ రంగుకు ఒక చిన్న నివాళిగా కూడా చెప్పవచ్చు.

2025 కొత్త వెర్సిస్ 650 ఇప్పుడు BS6 ఫేజ్ 2 OBD2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా అప్‌డేట్ చేయబడింది. అయినప్పటికీ, ఇంజిన్ స్పెసిఫికేషన్ల పరంగా పెద్దగా మార్పు ఏమీ లేదు. బైక్‌లో 649cc సామర్థ్యం కలిగిన డ్యూయల్-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అందించారు. ఇది గరిష్టంగా 66 bhp పవర్, 61 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి అసిస్ట్ క్లచ్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జోడించారు.

2025 versys 650 Motorcycle Launch

2025 వెర్సిస్ 650 USD టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక ప్రీ-లోడ్ సర్దుబాటు చేయగల మోనో-షాక్ సెటప్, ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్ సెటప్, వెనుక భాగంలో సింగిల్ డిస్క్ ఉన్నాయి. రెండు చివర్లలో కూడా 17-అంగుళాల వీల్స్ ఉన్నాయి. ప్రధానంగా ఫ్రంట్ ట్విన్ LED హెడ్‌లైట్‌లతో సెమీ-ఫెయిరింగ్ ఉన్నప్పటికి దాని డిజైన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 30, 2025, 15:00 [IST]
English summary
Kawasaki 2025 versys 650 motorcycle launch in india with price at rs 7 93 lakh
Read more on: #kawasaki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+