పరుగు మొదలైంది.. ఆగదు! రాత్రిని చీల్చే లైట్.. గాలిని చీల్చే స్పీడ్‌తో దూసుకుపోయే కొత్త బైక్ వచ్చేసింది
స్పోర్టీ బైకులను తయారు చేయడంలో అగ్రగామిగా నిలిచిన కవాసకి (kawasaki) మరోసారి భారత మార్కెట్లో తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి, అత్యంత ప్రజాదరణ పొందిన ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకు అయిన నింజా 300 (Ninja 300 ను కొత్త రూపంలో తీసుకొచ్చింది. మారుతున్న కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా MY25 వెర్షన్‌ను అధునాతన రూపంలో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. యువతలో స్పోర్ట్స్ బైక్స్‌పై ఉన్న ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, కవాసకి ఈ కొత్త వెర్షన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ సారి విడుదలైన నింజా 300, కేవలం కొద్దిపాటి మార్పులతో కాదు, స్పోర్టీ లుక్‌కి సరికొత్త అర్థాన్ని ఇచ్చేలా తీర్చిదిద్దినట్లు ఉంది.
దీని ప్రారంభ ధర వచ్చేసి రూ.3,43,000 (ఎక్స్-షోరూమ్). కొత్తగా పలు మార్పులతో ఇది కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ముందుగా మన దృష్టిని ఆకర్షించే అంశం కొత్త ప్రొజెక్టర్ హెడ్‌లైట్. ఇది నింజా ZX-6R నుండి ప్రేరణ పొందింది. దీంతో బైక్‌కి మరింత దూకుడు, ఆధునికతను జోడించింది. ఇది రాత్రి ప్రయాణాల్లో మెరుగైన వెలుతురును అందిస్తుండగా, బైక్ డిజైన్‌కి ఒక ఫ్యూచరిస్టిక్ టచ్‌ను ఇస్తోంది.

ఇంకొక కీలక మార్పు పెద్ద విండ్‌షీల్డ్. డిజైన్ పరంగా కాకుండా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. వేగంగా వెళ్లేటప్పుడు గాలి తీవ్రతను తగ్గిస్తూ, రైడర్‌కి మరింత స్థిరత్వాన్ని ఇస్తుంది. దీనితో పాటు, అప్‌డేట్ అయిన టైర్ కూడా కొత్త పవర్ ఇస్తాయి. ఇవి రోడ్డుపై మరింత గట్టి పట్టును అందిస్తూ, మూలలు తిరిగే సమయంలో నియంత్రణను కల్పిస్తాయి. స్టైలింగ్, పనితీరు, బ్రాండ్ హోదా ఈ మూడింటినీ సమపాళ్లలో కలపగలిగిన మోడల్ ఇది.
కవాసకి MY25 నింజా 300లో బైక్‌పై కూర్చున్న వెంటనే గమనించే ప్రత్యేకత ఏమిటంటే, అల్యూమినియం ఫుట్‌పెగ్‌లు. ఇవి కేవలం లైట్‌వెయిట్ మేటీరియల్ తో తయారై ఉండడమే కాకుండా, ప్రొఫెషనల్ రేసింగ్ టచ్‌ను ఇచ్చేలా ఉన్నాయి. దానికి తోడు, బైక్‌కి మరింత దూకుడైన రూపాన్ని అందించే షార్ప్ ఫెయిరింగ్‌లు, స్పోర్ట్స్ బైక్‌కు అవసరమైన ఏరోడైనమిక్స్‌కు సహాయపడతాయి. రైడర్‌కు అవసరమైన సమాచారం మొత్తం అందించే మల్టీ-ఫంక్షనల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఉంది.

స్పీడ్, ఆర్‌పిఎం, గేర్ పొజిషన్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్ మొదలగు అన్నీ కూడా ముందు ఉన్నటువంటి డిస్‌ప్లేలో కనిపిస్తాయి. దీని ఇంజిన్ విసయానికి వస్తే, 296cc లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో 38.9 bhp పవర్, 26.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ గియర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ ముఖ్యంగా తన సాఫ్ట్ రివ్వింగ్ నేచర్, తక్కువ వైబ్రేషన్లతో పేరు తెచ్చుకుంది.
కలర్ విషయంలో కూడా నింజా 300 తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఇది మూడు ఆకట్టుకునే షేడ్లలో లైమ్ గ్రీన్, క్యాండీ లైమ్ గ్రీన్, మెటాలిక్ మూన్‌డస్ట్ గ్రేలలో ఉంది. సస్పెన్షన్ వ్యవస్థ విషయానికొస్తే, అదే నమ్మకమైన సెటప్‌ను కొనసాగిస్తోంది. ముందు భాగంలో 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో బాటమ్-లింక్ యూని-ట్రాక్ మోనోషాక్ ఉంటుంది. ఇది 5-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్‌తో వస్తుంది. రైడింగ్‌లో చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








