యూత్ డ్రీమ్ బైక్.. కొనేముందు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి! రేస్‌ట్రాక్‌, రోడ్‌పై స్టైల్‌‌గా వెళ్తుంది

కవాసకి (kawasaki) అనే పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ లవర్స్ మనసులో ప్రత్యేకమైన ఉత్సాహం కలుగుతుంది. రేసింగ్ ట్రాక్‌లపై దూసుకుపోయే స్పీడ్ బీష్ట్‌గా, రోడ్డుపై అందరినీ ఆకట్టుకునే లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్‌గా కవాసకి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. భారతదేశంలో కూడా ఈ కంపెనీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా యువత, స్పోర్ట్స్ బైక్‌లకు ఆసక్తి ఉన్నవారు కవాసకిని కలల బైక్‌గా భావిస్తారు. ఈ క్రమంలో తాజాగా కంపెనీ తన మరో సరికొత్త అద్భుతాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే కొత్త కవాసకి నింజా జెడ్‌ఎక్స్-6ఆర్ (KAWASAKI NINJA Zx 6r). దీనిని చూసిన వెంటనే దాని డిజైన్, స్టైల్ మనసును దోచేస్తాయి. రేసింగ్ హార్ట్‌బీట్ ఉన్న వారందరికీ నచ్చేలా ఈ బైకును డిజైన్ చేశారు.

ముఖ్యంగా కంపెనీకి సిగ్నేచర్‌గా మారిన లైమ్ గ్రీన్ కలర్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చింది. రోడ్డుపై కనిపిస్తేనే దాని పవర్, ప్రెజెన్స్‌ను అందరూ ఫీల్ అయ్యేలా ఉంటుంది. ధర విషయానికి వస్తే, కొత్త కవాసకి నింజా ZX-6R ఎక్స్-షోరూమ్ ప్రైస్ రూ.11.69 లక్షలుగా నిర్ణయించబడింది. ప్రీమియం స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో ఇది ఒక అద్భుతమైన ఆఫర్‌గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో డెలివరీలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది.

Kawasaki New Sports Model Bike Ninja Zx 6r Launched In India

అంటే ఈ బైక్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. కవాసకి ఎప్పటిలాగే తన బైకుల లైనప్‌లో స్పోర్ట్స్ మోడల్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ZX-6R కూడా ఈ జాబితాలో మరొక రత్నంలా చేరింది. రోడ్డుపై రైడర్‌కి అత్యుత్తమ అనుభవాన్ని ఇవ్వడానికి కావాల్సిన శక్తివంతమైన ఇంజిన్, అధునాతన టెక్నాలజీలు, భద్రతా ఫీచర్లు కలిగిన ప్యాకేజ్‌గా దీన్ని డిజైన్ చేశారు.

నింజా ZX-6R నిజంగా ప్రీమియం రైడర్స్‌కి కలల బైక్ అని చెప్పాలి. దీనిలో అమర్చిన 636cc లిక్విడ్-కూల్డ్ ఇన్-లైన్ 4-సిలిండర్ ఇంజిన్ దాని ప్రధాన ప్రత్యేకత. అధిక శక్తిని, అసాధారణ పనితీరును అందించగల ఈ ఇంజిన్‌ వల్ల రైడర్‌కు రేస్‌ట్రాక్‌ మీదైనా, నగర రోడ్లపైనా అద్భుతమైన రైడింగ్ అనుభవం లభిస్తుంది. దీన్ని మరో ప్రీమియం మోడల్ నింజా ZX-4R ఆధారంగా డిజైన్ చేసినప్పటికీ, దీనికి స్వంతమైన ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చారు.

Kawasaki New Sports Model Bike Ninja Zx 6r Launched In India

ఫ్రంట్ ఎండ్ డిజైన్‌నే తీసుకున్నా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో కాంపాక్ట్ సైజ్‌లో ఉన్న LED హెడ్‌లైట్‌లు అమర్చబడ్డాయి. ఇవి ఆకర్షణీయమైన లుక్‌ను మాత్రమే ఇవ్వకపోగా, రాత్రి సమయంలో స్పష్టమైన విజిబిలిటీని అందిస్తాయి. అలాగే, స్పోర్టీ విండ్‌షీల్డ్‌తో కలిపి ఈ హెడ్‌లైట్ డిజైన్ బైక్‌కు ఒక ప్రత్యేకమైన అగ్రెసివ్ ఫ్రంట్ లుక్‌ను ఇస్తుంది. ఇది అందంగా కనిపించడమే కాదు, రైడింగ్ చేసే సమయంలో విండ్రెసిస్టెన్స్ తగ్గించి మరింత స్మూత్ హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది.

కవాసకి ZX-6Rని కేవలం రేస్‌ట్రాక్ కోసం మాత్రమే కాదు, సాధారణ రోడ్లపై కూడా సౌకర్యవంతంగా వాడుకోవడానికి తీర్చిదిద్దింది. అంటే ఈ బైక్ హై-పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ బైక్ అయినప్పటికీ, రోజువారీ వినియోగానికి కూడా సరిపోయేలా డిజైన్ చేయబడింది. అద్భుతమైన హ్యాండ్లింగ్, పవర్‌ఫుల్ ఇంజిన్, స్పోర్ట్స్ బైక్ డిజైన్ కలిపి ఈ ZX-6Rని నిజంగా రేస్ అండ్ రోడ్ రెడీ బైక్‌గా మార్చేశాయి.

Kawasaki New Sports Model Bike Ninja Zx 6r Launched In India

దీని సస్పెన్సన్ విషయానికి వస్తే, ఫ్రంట్ సింగిల్-యాక్టింగ్ బిగ్ పిస్టన్ ఫోర్క్ అందించగా, వెనుక భాగంలో పూర్తిగా సర్దుబాటు చేయగల షోవా షాక్‌ను అమర్చారు. ఇతర ఫీచర్స్‌లో ఈ బైక్ హ్యాండిల్‌బార్ మధ్యలో 4.3-అంగుళాల TFT కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్‌ను అందించడం విశేషం. మీ మొబైల్ ఫోన్‌ను బైక్‌కు కనెక్ట్ చేయడానికి రేడియాలజీ ది యాప్ ద్వారా ఈ స్క్రీన్‌కు కనెక్ట్ కావచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, September 1, 2025, 16:40 [IST]
English summary
Kawasaki new sports model bike ninja zx 6r launched in india details check
Read more on: #kawasaki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+