ఆలస్యమైనా అదిరిపోయింది.. అడ్వెంచర్ బైక్స్‌లో కింగ్ లాంటి మోడల్ లాంచ్.. ఒక్కసారి చూస్తే మరిచిపోలేరు
దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ కవాసకి (Kawasaki) బైక్ లవర్స్ కోసం కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దాని పేరు వెర్సిస్-X 300 (versys-x-300). గతంలో కొన్ని సంవత్సరాలపాటు విక్రయించిన ఈ అడ్వెంచర్ టూరర్, అమ్మకాలు నిలిపివేయబడిన తర్వాత మళ్లీ 2025లో కొత్త రంగు రూపంలో తిరిగొచ్చింది. దీని ధర రూ. 3.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. మునుపటి మోడల్‌లానే ఇంజిన్, ఫీచర్లు కలిగి ఉన్నప్పటికీ, ఇందులో ఇప్పుడు నీలం, తెలుపు కలర్‌లో ఫ్రెష్ లుకింగ్ గ్రాఫిక్స్ అదనంగా వచ్చాయి. ఇది కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా సర్దుబాటు చేయబడిన ఇంజిన్‌తో వస్తోంది, అంటే పర్యావరణ పరంగా కూడా మరింత మేలు చేసే అంశం. ఈ బైక్ నుంచి తక్కువ స్థాయిలో కాలుష్య కారకాలు విడుదల అవుతాయి.
ఈ బైక్‌లో 296cc ట్విన్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉండగా, ఇది దాదాపు 39 bhp పవర్‌ను అందిస్తుంది. దీని బరువు 184 కిలోలు, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిల్లీమీటర్లుగా ఉంది. ముందు భాగంలో లాంగ్-ట్రావెల్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మానోషోక్ ఉన్న ఈ బైక్, తేలికపాటి ఆఫ్-రోడింగ్‌కు సరిపడేలా రూపొందించబడింది. రోడ్లకే కాదు, పర్వతాలు, అడవుల్లో కూడా సాఫీగా ప్రయాణిస్తుంది.

వెర్సిస్-X 300 పూర్తి తయారీ యూనిట్ (CBU)గా దిగుమతి అవుతోంది. భారతదేశంలో దీనిని CKD(Complete Knocked Down) కిట్ ద్వారా అసెంబుల్ చేస్తారనే ఊహాగానాలు ఉన్నా, ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో తయారైన బైక్‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా, ఇది స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో కూడిన ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని వల్ల ట్రాఫిక్‌లో గేర్ మార్చడం చాలా సులువుగా ఉంటుంది. అలాగే హైవే రైడింగ్‌లో మరింత సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుంది.
ఇది 17 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం కలిగిన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. దీని వలన దూర ప్రయాణాల కోసం మళ్లీ మళ్లీ ట్యాంక్ నింపాల్సిన అవసరం లేకుండా సాగిపోతుంది. సస్పెన్షన్ వ్యవస్థ విషయానికి వస్తే, ముందు భాగంలో 130mm ట్రావెల్‌ను అందించే 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో 148mm ట్రావెల్‌తో మోనోషాక్ వ్యవస్థ ఉంది. ఇది రఫ్ రోడ్లు, గుంతలు సాఫీగా ప్రయాణించడానికి సహాయపడుతుంది.

గ్రౌండ్ క్లియరెన్స్ 180mm ఉండటంతో, చిన్న,పెద్ద అడ్డంకులను తేలికగా దాటేయొచ్చు. బైక్ 19-అంగుళాల ముందు స్పోక్డ్ వీల్, 17-అంగుళాల వెనుక స్పోక్డ్ వీల్ కలిగి ఉంది. ఇవి ట్యూబ్డ్ టైర్లతో వస్తాయి. స్పోక్డ్ వీల్స్ వలన బైక్ కఠిన భూభాగాలను అధిగమించడంలో మరింత స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. వెర్సిస్-X 300 మళ్లీ మార్కెట్లోకి రావడం ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, హీరో ఎక్స్‌పల్స్ లాంటి బడ్జెట్ టూరర్లకు పోటీ తప్పదు.
వెర్సిస్ X 300 కేవలం రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. కాండీ లైమ్ గ్రీన్ విత్ మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్, పెర్ల్ హారిజన్ వైట్‌లలో వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఆకర్షణీయమైన ఆప్షన్లను కలిగి ఉంది. రైడింగ్ సమయంలో గాలిని అడ్డుకోవడానికి పొడవైన విండ్‌స్క్రీన్, తక్కువ వెలుగులోనూ సరైన విజిబిలిటీని అందించడానికి సింగిల్-పాడ్ హాలోజన్ హెడ్‌ల్యాంప్ ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








