ఈ బైక్ కు పెట్టే డబ్బులు పెడితే లగ్జరీ కారే వస్తుంది.. అదిరే ఫీచర్లు కావాలనుకున్న వాళ్లకు బెస్ట్ బైక్ ఇదే

ప్రముఖ మోటారు తయారీ సంస్థ కవాసాకి ఇండియా(Kawasaki India), భారత మార్కెట్లో తన కొత్త Z1100 సూపర్ బైక్‌ను (Z1100 Superbike) లేటెస్టుగా రిలీజ్ చేసింది. ఈ సూపర్ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఏకంగా రూ. 12.79 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ ధరలో ఒక లగ్జరీ ఎస్యూవీ కారును కొనుగోలు చేయవచ్చు. మునుపటి మోడల్ కంటే మెరుగైన డిజైన్, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో వచ్చిన ఈ 2026 కవాసాకి Z1100 లో 1,099 సీసీ లిక్విడ్-కూల్డ్ నాలుగు-సిలిండర్ ఇంజిన్ శక్తినిస్తుంది. మరి ఈ బైక్ ఫీచర్లు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు, రైడర్‌కు సహాయపడే అధునాతన ఎలక్ట్రానిక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

2026 కవాసాకి Z1100 బైక్ పవర్ పరంగా అద్భుతంగా రూపొందించారు. ఇందులో అడ్వాన్సుడ్ టెక్నాలజీని జోడించారు. ఈ బైక్‌లో 1,099 సీసీ లిక్విడ్-కూల్డ్, నాలుగు-సిలిండర్ల ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 134 హార్స్ పవర్ శక్తిని, 7,600 ఆర్‌పిఎమ్ వద్ద 113 న్యూటన్ మీటర్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో పాటు, రైడింగ్‌ను సులభతరం చేసేందుకు అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

Kawasaki Z1100 Superbike Launched in India at Rs 12 79 Lakh SUV Price Tag for a Motorcycle

ఈ బైక్ కవాసాకి ప్రముఖ సుగోమి డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందింది. ఇంజిన్ ముఖ్యంగా తక్కువ నుంచి మిడ్ రేంజ్ రెస్పాన్స్ కోసం ట్యూన్ చేశారు.Z1100 బైక్ కవాసాకి నింజా 1100SX బైక్ మాదిరిగానే అదే అల్యూమినియం ఛాసిస్‌ను ఆధారం చేసుకుని తయారు చేశారు.

స్టాండర్డ్ Z1100 వేరియంట్‌లో సర్దుబాటు చేయగల షోవా సస్పెన్షన్ సెటప్ ఉంది. కాగా అధిక ధర కలిగిన SE వేరియంట్‌లో షోవా ఫోర్క్‌తో పాటు, రిమోట్ ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన ఓహ్లిన్స్ S46 మోనోషాక్ను అందించారు.

Kawasaki Z1100 Superbike Launched in India at Rs 12 79 Lakh SUV Price Tag for a Motorcycle

స్టాండర్డ్ Z1100 లో కవాసాకి బ్రాండెడ్ టోకికో రేడియల్ కాలిపర్స్, 310ఎంఎం డ్యూయల్ డిస్క్‌లు ఉన్నాయి (ఇవి నింజా బైక్‌లోని 300ఎంఎం డిస్క్‌ల కంటే పెద్దవి). అయితే, SE వేరియంట్‌లో మెరుగైన బ్రేకింగ్ కోసం అప్‌గ్రేడ్ చేసిన బ్రెంబో M4.32 కాలిపర్స్, స్టీల్ బ్రేక్ లైన్లు ఉన్నాయి. Z1100 లో పవర్ఫుల్ ఇంజిన్‌కు తోడు, సురక్షితమైన, కంట్రోల్డ్ రైడింగ్ అనుభవం కోసం అనేక అడ్వాన్సుడ్ ఎలక్ట్రానిక్ రైడర్ సహాయక ఫీచర్లను జోడించారు.

కవాసాకి Z1100 బైక్‌ను కంట్రోల్ చేయడం,సేఫ్టీ, రైడింగ్ అనుభవం పరంగా అత్యున్నతంగా ఉండేందుకు అనేక అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. ఈ బైక్‌లో రెండు పవర్ మోడ్స్ ఉన్నాయి. రైడర్ అవసరాన్ని బట్టి ఫుల్ పవర్ లేదా తక్కువ పవర్‌ను ఎంచుకోవచ్చు. ఇది మూడు స్థాయిలలో పనిచేస్తుంది. స్లిప్‌గా ఉన్న రోడ్లపై వెనుక వీల్ పట్టు కోల్పోకుండా ఇది నియంత్రిస్తుంది, తద్వారా బైక్ కంట్రోల్‌లో ఉంటుంది.

Kawasaki Z1100 Superbike Launched in India at Rs 12 79 Lakh SUV Price Tag for a Motorcycle

క్విక్-షిఫ్టర్ గేర్‌లను మార్చేటప్పుడు క్లచ్ ఉపయోగించకుండానే గేర్ లివర్‌ను పైకి లేదా కిందికి మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ బైక్‌లో బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్ ఉంది, అంటే గేర్లను అప్-షిఫ్ట్ (పెంచడానికి), డౌన్-షిఫ్ట్ (తగ్గించడానికి) రెండింటికీ క్లచ్ అవసరం లేదు. కంట్రోల్ హైవేలపై స్థిరమైన వేగంతో వెళ్లడానికి ఇది సహాయపడుతుంది.

డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ముందు, వెనుక చక్రాలపై బ్రేకింగ్ సమయంలో బ్రేక్‌లు లాక్ కాకుండా నిరోధించడానికి ఈ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. పై అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అన్నీ ఒక ఐదు-అక్షాల IMU ద్వారా సపోర్ట్ చేయబడతాయి. IMU సెన్సార్ బైక్ లీన్ యాంగిల్ (బైక్ ఎంత వంగి ఉంది), యాక్సిలరేషన్, బ్రేకింగ్ వంటి అంశాలను నిరంతరం కొలుస్తుంది. దీనివల్ల బైక్ మూల మలుపులలో ఉన్నప్పుడు కూడా ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి ఫీచర్లు మరింత ఖచ్చితంగా పనిచేస్తాయి. దీనినే కవాసాకి KCMF (కార్నెరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్) అని కూడా అంటారు.

ఈ బైక్‌లో స్పోర్ట్, రోడ్, రెయిన్ అనే మూడు రెడీమేడ్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఒక్కో మోడ్‌లో పవర్, ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్‌లు ఆ రోడ్ లేదా వెదర్ కండిషన్‌కు అనుగుణంగా మారుతాయి. వీటితో పాటు రైడర్ తన ఇష్టానుసారం పవర్, ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్‌లను మార్చుకుని వ్యక్తిగత రైడర్ మోడ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు.బైక్‌లో 5-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇది బైక్ గురించిన సమాచారం అంతటినీ స్పష్టంగా చూపిస్తుంది.

ఈ డిస్‌ప్లే RIDEOLOGY THE APP అనే మొబైల్ యాప్‌తో కనెక్ట్ అవుతుంది, దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను (మలుపుల వారీగా దారి సూచన) డిస్‌ప్లేపై చూసుకోవచ్చు. కవాసాకి Z1100 కేవలం ఎబోనీ/మెటాలిక్ కార్బన్ గ్రే అనే ఒకే రంగులో లభిస్తుంది. కవాసాకి 50 సంవత్సరాల Z మోడల్ చరిత్రను పురస్కరించుకుని ఈ బైక్‌ను విడుదల చేశారు.ఈ బైక్ డెలివరీలు నవంబర్ 2025 చివరి నుంచి ప్రారంభమవుతాయని అంచనా.

More from DriveSpark

Article Published On: Friday, November 14, 2025, 10:10 [IST]
English summary
Kawasaki z1100 superbike launched in india at rs 12 79 lakh suv price tag for a motorcycle
Read more on: #kawasaki #luxury bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+