బైకులపై ఇంత తగ్గింపు ఎప్పుడూ లేదు! రూ.70,000 వరకు తగ్గిన ధర.. వెంటనే షోరూమ్‌కు పరిగెత్తండి!
ప్రముఖ వాహన బ్రాండ్ ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా, దేశవ్యాప్తంగా ఉన్న మోటార్‌సైకిల్ అభిమానులకు ఒక సంతోషకరమైన వార్తను అందించింది. ప్రీమియం సెగ్మెంట్‌లోకి వస్తున్న తమ రెండు ప్రసిద్ధ మోడళ్లపై భారీ ధరల తగ్గింపును ప్రకటించి, వీటిని మరింత చేరువైనవిగా మార్చింది. కొత్తగా బైకును కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్నవారు ఈ తగ్గింపును ఉపయోగించుకుని కొత్త బైకును తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. దాని ప్రసిద్ధ మోడల్ కీవే కె-లైట్ 250V (keeway k light 250v) దీని ధరను ఏకంగా రూ.71,000 తగ్గించారు. ఫలితంగా, ఈ స్టైలిష్ మోడల్‌ను ఇప్పుడు కేవలం రూ.2,49,000 (ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు. క్రూయిజింగ్ వాహనాల ప్రేమికులకు ఇది నిజమైన గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇది రెట్రో క్రూయిజర్ డిజైన్ కోసం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.
అలాగే, కేవలం ఆకర్షణీయమైన రూపమే కాకుండా, శక్తివంతమైన పనితీరుతో మోటార్‌సైకిల్ ప్రియులను ఆకట్టుకున్న జోంటెస్ 350 ఎక్స్ (zontes 350x) కూడా ధర తగ్గింపు పొందింది. దీని ధరను రూ.59,000 మేరకు తగ్గించటంతో, ఇప్పుడు కేవలం రూ.2,40,000 (ఎక్స్-షోరూమ్)కే ఈ బైక్ లభిస్తోంది. కంపెనీ ప్రకటన ప్రకారం, ఈ ధరల సవరణ ప్రీమియం మోటార్‌సైకిళ్లను మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చి, వినియోగదారులకు డబ్బుకు తగిన విలువను కల్పించడమే ముఖ్య ఉద్దేశం.

కీవే K-Lite 250V బైక్‌కి ఉన్న ప్రత్యేకతలు, ఏంటంటే ప్రధానంగా, ఈ బైక్‌కి శక్తిని అందించేది V-ట్విన్ 249cc ఇంజిన్. ఈ ఇంజిన్ తక్కువ ఆర్టిఫీషియల్ శబ్ధంతో స్మూత్‌గా టార్క్ ఉత్పత్తి చేస్తూ, సిటీ రైడింగ్ నుంచి లాంగ్ రైడ్‌ల వరకు ఒక చక్కటి క్రూయిజర్ అనుభవాన్ని అందిస్తుంది. బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ సాధారణ చైన్ డ్రైవ్‌కి భిన్నంగా, బెల్ట్ డ్రైవ్ రైడ్‌ను మరింత మృదువుగా, నిశ్శబ్ధంగా మారుస్తుంది.
ఈ విధానం తక్కువ నిర్వహణతో ఎక్కువ మైలేజ్, కంఫర్ట్‌ను అందించడంలో సహాయపడుతుంది. కీవే K-Lite 250Vకి ఉన్న ప్రీమియం క్రూయిజర్ డిజైన్ కూడా ప్రత్యేక ఆకర్షణ. దీన్ని చూడగానే స్పష్టంగా గుర్తుపడే విధంగా పూర్తి LED లైట్ సెటప్ అందించారు. ఇందులో LED హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు ఉండటంతో రాత్రి వేళల్లోనూ మెరుగైన దృశ్యమానతను కల్పిస్తాయి. రైడర్‌కు సమాచారం స్పష్టంగా అందించేందుకు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ అమర్చారు.

ఇది అన్ని ముఖ్యమైన డేటాను క్లియర్‌గా చూపించడమే కాకుండా, బైక్‌కు ఒక ఆధునిక స్పర్శను జోడిస్తుంది. స్పోర్టీ, స్టైలిష్ రూపాన్ని మరింత పటిష్టం చేసేందుకు ట్విన్ ఎగ్జాస్ట్‌లు అమర్చారు. ఇవి కేవలం లుక్‌కే పరిమితం కాకుండా, ఆకట్టుకునే ఎగ్జాస్ట్ నోట్స్ కూడా ఇస్తాయి. కనిపించడంలోనే కాదు, రైడ్‌లోనూ సౌకర్యం, శక్తి, సాంకేతికతను సమన్వయపరిచిన ఈ బైక్, ప్రీమియం క్రూయిజర్ విభాగంలో నిజంగా ప్రత్యేకమైన పెర్ఫామెన్స్ ఇస్తుంది.
జోంటెస్ 350X బైకు గురించి చూసినట్లయితే, ఒక ఆధునిక టూరింగ్ మిషన్‌లా కనిపిస్తూనే, అత్యాధునిక సాంకేతికత, శక్తివంతమైన పనితీరు, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను రైడర్ల కోసం ఒకేచోట అందిస్తుంది. దీనికి శక్తిని 348cc సామర్థ్యం కలిగిన లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 39.5 PS శక్తిని ఉత్పత్తి చేస్తూ, అన్ని రకాల రైడ్‌లోనూ సమర్థవంతమైన యాక్సలరేషన్, స్థిరమైన వేగాన్ని కలిగిస్తుందని నిర్ధారిస్తుంది. అందుకే ఇది రైడింగ్ ఆసక్తికరంగా, ఎనర్జిటిక్‌గా కొనసాగుతుంది.

రైడర్ సౌలభ్యం కోసం ఇందులో ఏర్పాటు చేసిన ఫీచర్లు వేరే స్థాయిలో ఉంటాయి. కీ-లెస్ కంట్రోల్ సిస్టమ్ సౌకర్యాన్ని గణనీయంగా పెంచుతుంది. కీ తీసి తిప్పడం అవసరం లేకుండా బైక్ ఆన్ చేయగలిగేలా రూపొందించారు. అలాగే, పూర్తి TFT కలర్ డిస్ప్లే ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, రైడ్ డేటా వంటి సమాచారం స్పష్టంగా చూపించబడుతుంది. ఈ డిజిటల్ యూనిట్, ఈ బైక్‌కు ఆధునికతను మరింతగా చేరిస్తుంది.
రాత్రి వేళల్లో రైడ్‌లోనూ విజిబిలిటీ కోసం ఆల్-LED లైటింగ్ సిస్టమ్‌ను అందించారు. హెడ్‌ల్యాంప్ నుంచి టెయిల్‌లైట్, టర్న్ ఇండికేటర్లు వరకు అన్ని లైట్లు LEDనే. ఇవి కేవలం స్టైలింగ్‌నే కాక, రైడర్‌కు మరింత భద్రతను కూడా ఇస్తాయి. దూర ప్రయాణాలకు వీలుగా పెద్ద 17-లీటర్ ఇంధన ట్యాంక్ కూడా అందించడం ఈ బైక్ యొక్క మరో హైలైట్. ఇలా నిరంతర ప్రయాణాల్లో ఎటువంటి ఇంధన ఆందోళన లేకుండా సౌకర్యంగా సాగిపోవచ్చు.


Click it and Unblock the Notifications








