ఈ బైకుపై మొదటి 100 మందికి ప్రత్యేకంగా రూ.60 వేల డిస్కౌంట్.. డిమాండ్ పెరగకముందే షోరూమ్‌కు పరిగెత్తండి
ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో టూవీలర్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ప్రజల రోజువారీ అవసరాలకు ఇంట్లో బైక్ లేదా స్కూటర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. దీంతో దేశీయంగా టూవీలర్స్ అమ్మకాలు ప్రతి ఏడాది జనాభా పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తయారీదారులు సరికొత్త డిజైన్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. తాజాగా ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ 'కీవే ఇండియా (keeway India)' ఇటీవల కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దాని పేరు 'కీవే కె300 ఎస్ఎఫ్ (keeway k300 sf)'. ఇది ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు అధికారిక కీవే ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ బైకును మొదటగా కొనుగోలు చేసే 100 కస్టమర్లకు ప్రత్యేకంగా తగ్గింపును అందిస్తుంది.
కీవే ఇండియా నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం, k300 sf బైకుపై రూ.60 వేల వరకు తగ్గింపును ఇస్తుంది. దీంతో మొదటి 100 మంది కస్టమర్లు దీనిని రూ.1.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రత్యేక ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ బైక్ డిజైన్ స్పోర్ట్సీ లుక్‌తో చాలా ఆకర్షనీయంగా ఉంది. ఇంజిన్ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర బైకులకు బలమైన ప్రత్యర్థిగా నిలిచే అవకాశం ఉంది.

కీవే కె300 ఎస్ఎఫ్ 292.4cc లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది 8,750 rpm వద్ద 27.5 hp పవర్, 7,000 rpm వద్ద 25 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇది 4-స్ట్రోక్‌తో వచ్చింది. దేశంలో 300 సీసీ విభాగానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కీవే ఇండియా ఈ సెగ్మెంట్‌లో తన సత్తాను చాటడానికి ప్రయత్నాలు చేస్తుంది.
ఈ బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంటుంది. రైడింగ్‌లో మెరుగైన రక్షణ కోసం డిస్క్ బ్రేక్‌లతో అధునాతన డ్యూయల్-ఛానల్ ABSని అందించారు. గుంతలు ఉన్న రోడ్లపై సాఫీగా ప్రయాణించడానికి ముందు USD ఫోర్స్క్, వెనుక మోనో షాక్ సస్పెన్షన్ సెటప్‌ను అమర్చారు. ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీనిలో పెట్రోల్, గేర్ బాక్స్ ఇండికేటర్స్, స్పీడ్ వంటివి ఉన్నాయి.

కీవే కె300 ఎస్ఎఫ్ 300 సీసీ సెగ్మెంట్‌లో కొత్త కస్టమర్లకు అత్యుత్తమైన ఆప్షన్ అవుతుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ బైకును కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు బుకింగ్ కోసం దేశంలోని కంపెనీ డీలర్లను కూడా సంప్రదించవచ్చు. కొత్తగా తక్కువ ధరలో అదిరిపోయే బైకును కొనాలనే ఆలోచన చేస్తున్నవారు ఈ బైక్‌ను బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.
అయితే ఈ ప్రత్యేక తగ్గింపు మొదటి 100 మంది కస్టమర్లకు కాబట్టి బుకింగ్ కోసం చాలా మంది వినియోగదారులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా రూ.60000 తగ్గింపుతో దీనిని సొంతం చేసుకోవాలంటే ముందుగా కంపెనీ సిబ్బందిని కలిసి అన్ని వివరాలు తెలుసుకుని బుక్ చేసుకోవడం బెస్ట్.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








