మార్కెట్లోకి మరో స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేసిన ఇటలీ లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్.. పిచ్చెక్కించే ఫీచర్స్ ఇవే!

ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ ప్రపంచ వ్యాప్తంగా వాహనాలను విడుదల చేస్తుంది. దాని యాజమాన్యంలో ఉన్న హంగేరియన్ టూవీలర్ బ్రాండ్ కీవే ఇండియన్ మార్కెట్లోకి తన ప్రోడక్ట్ పోర్ట్ ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. దేశీయ మార్కెట్లోకి ఇప్పటికే కీవే వియస్టా 300 , కీవే సిక్స్టీస్ 300ఐతో పాటుగా కీవే కె-లైట్ అనే క్రూయిజర్ బైక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కీవే ఇండియా తన ప్రసిద్ధ K300 మోటార్‌సైకిల్ సిరీస్‌లో స్పెషల్ ఎడిషన్ అయిన కీవే K300 SFను విడుదల చేసింది. ఈ పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్ డబ్బుకు విలువ కలిగిన గొప్ప ప్రోడక్ట్. ఈ K300 SF మోటార్ సైకిల్ K300N బైక్ అప్ డేటెడ్ వెర్షన్.

Keeway K300 SF Side

ఈ మోటార్ సైకిల్ భారత మార్కెట్లో ఉన్న మిగిలిన వాటి కంటే డిఫరెంట్ గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ ధర, దాని ఫీచర్ల గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. కీవే 300 SF ఇండియా అంతటా అధీకృత కీవే డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు వివరణాత్మక ప్రొడక్ట్ ఫీచర్స్, డీలర్ లోకేషన్లు, బుకింగ్ ఇన్ఫర్మేషన్ కోసం కీవే ఇండియా అధికారిక వెబ్ సైట్లో సెర్చ్ చేసుకోవచ్చు.

Take a Poll

ప్రీమియం 300సీసీ విభాగంలోకి ప్రవేశించిన కొత్త కీవే 300 SF ప్రస్తుతం దాని విభాగంలో అత్యంత సరసమైన బైక్. ఈ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే దీనిలో 292.4cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ కీవే 300 SF 8,750 ఆర్పీఎం వద్ద 27.5 HPపవర్, 7,000ఆర్పీఎం వద్ద 25ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Keeway K300 SF Price

బెటర్ కంట్రోల్ కోసం 17 అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లతో ఈ బైక్ వస్తుంది. స్పీడ్, గేర్ ఇండికేషన్, ఫ్యూయల్ స్టేటస్ లాంటి సమాచారాన్ని అందించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను అందించారు. ఇది సరైన స్టెబిలిటీ, ఫెసిలిటీ కోసం ముందు భాగంలో USD ఫోర్స్, బ్యాక్ మోనో-షాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. దాని అద్భుతమైన కొత్త పేరు, లేటెస్ట్ ఫీచర్లు, స్పెషల్ ధరలతో రైడర్లకు ఇది బెస్ట్ ఛాయిస్.

ఈ బైక్ స్పోర్టీ డిజైన్, హై పర్ఫామెన్స్ కలిగి ఉంటుంది. ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా పరిధిలోకి వచ్చే కీవే ఇండియా కంపెనీ. దీనికి ప్రత్యేక ఆఫర్లో భాగంగా కీవే K300 SF బైక్‌ను విడుదల చేసినప్పుడు మొదటి 100 మంది కస్టమర్లకు రూ. ఇది రూ. 1.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రత్యేక ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి డీలర్‌ను సంప్రదించవచ్చు.

Keeway K300 SF View

ఈ బైక్ మొత్తం 300cc మోటార్ సైకిల్ విభాగంలో మంచి డిమాండ్‌ కలిగి ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన పనితీరు, అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్న ఈ బైక్ ప్రస్తుతం చాలా మంది యువకుల దృష్టిని ఆకర్షించింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే కామెంట్స్ లో తెలియజేయండి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, March 14, 2025, 12:14 [IST]
English summary
Keeway k300 sf top features you must know about the new special edition motorcycle
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+